ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః

 ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః 🙏


శ్రీకృష్ణ పరమాత్మ తన యోగమాయను మార్కండేయునకు చూపించడానికి వటపత్రంపై ఎడమకాలి బొటనవ్రేలును నోటిలో పెట్టుకొని శయనిస్తున్నట్లు దర్శనమిచ్చారు.


వటపత్రం పైనే ఎందుకు శయనించాడు అనగా ఈ విధంగా చెప్పారు. 

జంతువులలో గోవు ఎంత శ్రేష్టమో...

చెట్లలో మఱ్ఱిచెట్టు అంత శ్రేష్ఠమైనది. 

మఱ్ఱిచెట్టునే వటవృక్షమని, న్యగ్రోధమని అంటారు. 


ఈ వృక్షముది కనీకనబడని విత్తనమట. 

మిగతా మొక్కల్ని నాటినట్టుగా ఈ మఱ్ఱిమొక్కను ఎవరూ నాటరు. 

ఇది స్వయంభువంగా వెలుస్తుంది. 


దీనికి ఎన్నో కొమ్మలు, ఊడలు ఉండి అనేక చెట్ల గుంపులా విస్తారముగా ఉంటుంది. 


అంతచెట్టు చిరువిత్తనంలో ఉన్నట్లే... పరమాత్మ కూడా అణువణువులోనూ ఉన్నాడని, 

ఆ చెట్టు విస్తారంగా వ్యాపించినట్లే... పరమాత్మ కూడా బ్రహ్మాండమంతా తానే వ్యాపించి ఉన్నాడని,

ఇది స్వయంభువంగా మొలకెత్తినట్లే... పరమాత్ముడు కూడా స్వయంభువుడుగా అవతరించాడని, ఈ చెట్టుని గమనిస్తే అర్ధమౌతుంది. 


అందుకే దక్షిణామూర్తి మౌనంతో ఆత్మతత్త్వాన్ని వెల్లడించింది ఈ చెట్టు క్రిందనేనని అంటారు.


ప్రళయకాలంలో మార్కండేయునకు ఈ లీల చూపడంలో సమస్త సృష్టి మాయేనని, చిట్టచివరికి అంతా తనయందే లయమౌతుందని, అది గ్రహించమని జ్ఞానమార్గమును చూపించాడు.




                       బాలముకుందాష్టకం🙏


కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం ।

వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి (1)


సంహృత్య లోకాన్వటపత్రమధ్యే శయానమాద్యంతవిహీనరూపం ।

సర్వేశ్వరం సర్వహితావతారం బాలం ముకుందం మనసా స్మరామి (2)


ఇందీవరశ్యామలకోమలాంగం ఇంద్రాదిదేవార్చితపాదపద్మం ।

సంతానకల్పద్రుమమాశ్రితానాం బాలం ముకుందం మనసా స్మరామి (3)


లంబాలకం లంబితహారయష్టిం శృంగారలీలాంకితదంతపంక్తిం ।

బింబాధరం చారువిశాలనేత్రం బాలం ముకుందం మనసా స్మరామి (4)


శిక్యే నిధాయాద్యపయోదధీని బహిర్గతాయాం వ్రజనాయికాయాం ।

భుక్త్వా యథేష్టం కపటేన సుప్తం బాలం ముకుందం మనసా స్మరామి (5)


కలిందజాంతస్థితకాలియస్య ఫణాగ్రరంగేనటనప్రియంతం ।

తత్పుచ్ఛహస్తం శరదిందువక్త్రం బాలం ముకుందం మనసా స్మరామి (6)


ఉలూఖలే బద్ధముదారశౌర్యం ఉత్తుంగయుగ్మార్జున భంగలీలం ।

ఉత్ఫుల్లపద్మాయత చారునేత్రం బాలం ముకుందం మనసా స్మరామి (7)


ఆలోక్య మాతుర్ముఖమాదరేణ స్తన్యం పిబంతం సరసీరుహాక్షం ।

సచ్చిన్మయం దేవమనంతరూపం బాలం ముకుందం మనసా స్మరామి (8)


                                                     -- సత్య వాడపల్లి

         

Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు