ఓం ఆదిదేవాయ నమః🙏

 ఓం ఆదిదేవాయ నమః🙏

తేజస్సును ఇచ్చే భాస్కరుడు.

చైతన్యాన్ని ప్రసాదించే... రవి


సాయంసంధ్యా సమయానికి తనంత తానే శాంతుడయి ఆకాశానికి పావనత్వాన్ని ప్రసాదించే... శంఖుడు.




ఓం మృత్యవే నమః


కాలరూపంలో మన జీవితాలను హరిస్తున్నాడు.

ఈ మృత్యువు 4 రకాలు.

అవి 1) ఉత్తమము, 2)మధ్యమము, 

       3)అధమము, 4)అధమాధమము 


ఉత్తమము

ప్రత్యక్షంగా కనిపించే సూర్యుడు ఉత్తమమైన మృత్యువు


ఆరోగ్యంతో జీవిస్తున్నా... బాల్యం, కౌమారం, యవ్వనము, వార్ధక్యములతో కాలంతో పాటు వచ్చి మనలను మరణం ద్వారా ఇక్కడ నుంచి నిష్క్రమించేటట్టు చేసేవాడు.


మధ్యమము

వాయువు మధ్యమ మృత్యువు.


ప్రతి దినం ఇన్ని శ్వాసలు తీసుకోవాలి అని నియమం.


కోపము, ఆవేదన, ధుఃఖము, ఉద్వేగము, ఈర్ష్య, అసూయ, ద్వేషం మొదలయిన సమయాలలో

అవసరానికి మించి ఎక్కువ శ్వాసలు ఖర్చు చేస్తాము. అంత మొత్తంలో మన జీవిత ప్రమాణం తగ్గి పోతుంది. 


ఇది మన చేతిలోనే ఉంది. జపంలో శాంతిగతిలో ఎక్కువ సమయం సాగుతూ మన ఆవేశకావేశాలను అదుపులో ఉంచుకోవడం ద్వారా మన జీవితకాలాన్ని పదిలపరచుకోవచ్చు.


అధమము

అగ్ని ని అధమ మృత్యువు అన్నారు. 


జఠరాగ్ని రూపంలో మన శరీరంలో ఉండి మనం తిన్న ఆహారం పచనమయి రక్తముగా మారి శరీరానికి శక్తిని... అందాన్ని, ప్రకాశాన్ని ఇస్తూ మన నియమిత జీవన కాలాన్ని తగ్గకుండా చూస్తుంది. 


కానీ వేళ కాని వేళల్లో తినరానివి తింటూ అవసరానికి మించి భుజించడం వల్ల జీర్ణశక్తి తగ్గి అజీర్ణవ్యాధి ద్వారా మృత్యువును ఆహ్వానిస్తున్నాము. 


నియమిత అహార సేవనం, ఔషధ సేవనం వల్ల ఈ మృత్యువును దూరముగా ఉంచవచ్చు కాబట్టి ఇది అధమ మృత్యువు.


అధమాధమము

శోముడు (చంద్రుడు) ఓషధీశుడైనందున జలస్వరూపుడై సశ్య రక్షణ కావిస్తూ ఉంటాడు. 


నియమిత కాలంలో ఋతువులు వాటి క్రమం తప్పనంత వరకూ అంతా సశ్యశ్యామలంగానే ఉంటుంది. 


ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడితే ప్రజలు ఆహార కొరత వల్ల, ఓషధుల లేమి వల్ల అనారోగ్యంతో మృత్యువాత పడుతూంటారు.

కనుక చంద్రుని నాల్గవ మృత్యువు అన్నారు.

                                                        -- సత్య వాడపల్లి

                

Comments

Popular posts from this blog

వైశాఖ అమావాస్య శని జయంతి.

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

🌺🏵️🌼పూలపండుగ.. బతుకమ్మ🌹🙏