(ఓం శ్రీ మాత్రే నమః)అపరాజిత దేవి
ఓం శ్రీ మాత్రే నమః 🙏
అపరాజిత దేవి
ఆదిపరాశక్తి అయిన దుర్గాదేవికి అనేక నామాలున్నాయి. వాటిలో "అపరాజిత" ఒకటి.
"అపరాజిత" అంటే "పరాజయం లేనిది" అని అర్థం. విజయానికి ఆమె అధిదేవత.
అన్ని జీవుల్లోనూ అపరాజితాదేవి శక్తి రూపంలో ఉంటుంది.
జీవుల కర్మలను గమనిస్తూ, ఆ కర్మలను అనుసరించి ఫలాన్ని ప్రసాదిస్తుంది.
‘యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
చెడును తుంచడానికీ, మంచిని పెంచడానికీ దైవ శక్తులు అవతారాలు ఎన్నో కనిపిస్తాయి.
ఇంద్రాది దేవతల ప్రార్థనపై భండాసురుణ్ణి వధించడానికి... సకలదేవతా శక్తి స్వరూపిణిగా... మహాగ్నికుండం నుంచి శ్రీ దుర్గాదేవి ఆవిర్భవించింది.
ఆదిశక్తి అయిన ఆమె వివిధ అవతారాలు ధరించి... శుంభ, నిశుంభ, రక్తబీజ, చండ ముండాసుర, అరుణాసుర, మహిషాసురాదులను సంహరించి, సకల లోకాలకూ రాక్షస పీడ నుంచి విముక్తి కలిగించింది.
దుర్గామాత యుగయుగాల వేలుపు.
యాదేవీ మధుకైటభ ప్రశమనీ యామాహిషోన్మూలినీ
యాధూమ్రేక్షణ చండముండ దమనీ యారక్తబీజాశినీ
యాశుంభాది నిశుంభ దైత్యశమనీ యా సిద్ధలక్ష్మీఃవరా
తాంత్వాం చంద్ర కళావతంస మకుటాం చారుస్మితాం భావయే
శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః
దుష్టులైన మఽధు-కైటభులను నిర్జించి, మహిషాసురుణ్ణి మట్టుపెట్టి, చండ-ముండాసురులను వధించి, రక్తబీజుని పీచమణచి, శుంభ-నిశుంభులను సంహరించి, సకల లోక రక్షణ, ధర్మరక్షణ చేసి, సకలదేవతా కోటి పూజలందుకున్న సర్వ జగజ్జననీ... దుర్గాంబా మమ్మల్ని సదా రక్షించి, చల్లగా చూడమ్మా🙏
సత్కర్మలు ఆచరించేవారిని అపరాజితా దేవి కటాక్షిస్తుంది. ఆమెను ఆరాధిస్తే కోరినవన్నీ సిద్ధిస్తాయి.
అపరాజితా దేవిని ఆరాధిస్తే... మనలో ఉన్న అరిషడ్వర్గాలపై విజయం చేకూరుతుంది.
‘సర్వ కామార్థ సాధనం అపరాజితా పూజనం’
-- సత్య వాడపల్లి
Comments
Post a Comment