అంధకాసుర కృత శివస్తోత్రం

  ఓం నమః శివాయ 🙏


అంధకాసుర కృత శివస్తోత్రం


"శివపార్వతులు" "మందరగిరి"పై విహరిస్తుండగా, 

శివుడు తూర్పు దిక్కు చూస్తూ నిలబడి ఉన్నాడు.

పార్వతి వెనుక నుండి వెళ్లి , ఆయన కళ్లు మూసింది.

దానితో సమస్త లోకాలకు చీకటి కమ్మినట్లయింది.


ఆ హఠాత్ అంధకారానికి పార్వతి కూడా నివ్వెరపోయింది. 

ఆమెకు కలిగిన ఆశ్చర్యాందోళనల వల్ల, అరచేతుల్లో #స్వేదం కమ్మింది.


ఆ సమయంలో శివుని నేత్రాలు మూయబడిన అంధకారం సంఘటితమైనందున 'అంధకుడు' అయిన బాలుడు ఉద్భవించాడు.

 

హిరణ్యాక్షుడికి ఎంతకాలానికీ సంతానం లేకపోవడంతో అతడు శివునికై తపస్సు చేస్తున్న సమయంలో ఈ బాలకుడు జన్మించడం జరిగింది. 


"తక్షణం తనకో పుత్రుడిని ప్రసాదించవలసింది"గా కోరిన ఆ అసురుని కోరిక తీర్చదలచి అంధకుడిని దత్తత తీసుకోమని వరంగా ఇచ్చేశాడు శివుడు. 


గ్రుడ్డి బాలుడని చింతపడనక్కర్లేదనీ అసమాన శౌర్య పరాక్రమంతో విలసిల్లగలడనీ అనుగ్రహించాడు. 


పుట్టి గ్రుడ్డివాడైన అంధకుడు బ్రహ్మను గురించి ఘోర తపమాచరించాడు. 

"కోరరాని కోరిక కోరే వరకు" తనకు చావు ఉండదు అనే వరం పొందాడు.


నిజానికి తాను రుద్రాంశ సంభూతుడనీ, పార్వతీదేవి తనకు మాతృసమాన అనీ గ్రహించలేనంత మదించి ఉన్నాడు అంధకాసురుడు.


పార్వతీదేవి కోసం శివునితో యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు అంధకుడు.


శివుడు తన త్రిశూలం తో అంధకుణ్ణి పైకెత్తి పట్టుకున్నాడు. 

అది అతని శరీరంలో మూడుచోట్ల గుచ్చుకొని విలవిల్లాడసాగాడు. 


అలా త్రిశూలానికి వ్రేళ్లాడుతూ, అంధకుడు తానెవరో, ఎటువంటి కోరరాని కోరిక కోరాడో, తన ప్రస్తుత స్థితి ఏమిటో తెలుసుకుని #సామగానం తో శివుడ్ని స్తుతించాడు. 


శివుడు అంధకుడు పై కరుణ తో ప్రమథ గణాధిపతులలో ఒకడిగా నియమించాడు.

                

అంధకాసురుడు శివుని త్రిశూలానికి గుచ్చుకుని వేళ్ళాడుతూ చెప్పిన శివుని 108 నామాలు. 




            అంధ కృత శివస్తోత్రం (108 నామాలు)


మహాదేవం విరూపాక్షం చంద్రాకృత శేఖరం |

అమృతం శాశ్వతం స్థాణుం నీలకంఠం పినాకినం ||


వృషభాక్షం మాహాజేయం పురుషం సర్వకామదం |

కామారిం కామదహనం కామరూపం కపర్దినం | |


విరూపం గిరీశం భీమం స్రగ్విణం రక్త వాసనం |

యోగినం కాలదహనం త్రిపురఘ్నం కపాలినం | |


గూఢవ్రతం గుప్తమంత్రం గంభీరం భావగోచరం |

అణిమాదిగుణాధారం త్రిలోక్యైశ్వర్యదాయకం | |


వీరం వీరహణం ఘోరం విరూపం మాంసలంపటుమ్ |

మహామాంసాదమున్మత్తం భైరవం వై మహేశ్వరం | |


త్రైలోక్య ద్రావణం లుబ్ధం లుబ్ధకం యజ్ఞసూదనం |

కృత్తికానాం సుతైర్యుక్తమున్మత్తం కృత్తివాసనం | |


గజకృత్తి పరీధానం క్షుబ్దం భుజగభూషణమ్ |

దద్యాలంబం చ వేతాలం ఘోరం శాకిని పూజితం ||


అఘోరం ఘోరదైత్యఘ్నం ఘోరఘోషం వనస్పతిం |

భస్మాంగం జటిలం శుద్ధం భేరుండ శతసేవితం | |


భూతేశ్వరం భూతనాథం పంచభూతాశ్రితం ఖగం ||

క్రోధితం నిష్ఠురం చండం చండీశం చండికాప్రియం |


చండం తుంగం గరుత్మంతం నిత్య మాసవ భోజనం |

లేనిహానం మహారౌద్రం మృత్యుం మృత్యోరగోచరం | |


మృత్యోర్మృత్యుం మహాసేనం శ్మశానారణ్య వాసినం |

రాగం విరాగం రాగాంధం వీతరాగ శతార్చితం | |


సత్త్వం రజస్తమోధర్మమధర్మం వాసవానుజం |

సత్యం త్వసత్యం సద్రూపమసద్రూపమహేతుకం ||


అర్థనారీశ్వరం భానుం భాను కోటీశత ప్రభం |

యజ్ఞం యజ్ఞ పతిం రుద్రమీశానం వరదం శివం ||


అష్టోత్తరశతం హ్యేతన్మూర్తీనాం పరమాత్మనః |

శివస్య దానవో ధ్యాయన్ ముక్తస్తస్త్మాన్మహాభయాత్ ||

                                                          -- సత్య వాడపల్లి

                   

Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు