శ్రీ పుత్రగణపతి స్తోత్రం
ఓం శ్రీ మహా గణాధిపతయే నమః 🙏
సాక్షాత్ రుద్ర ఇవాపరః
అన్నట్లుగా జగదాంబ అనుగ్రహముతో జన్మించి... రుద్రానుగ్రహముతో సకల విఘ్నములకు అధిపతి అయిన గణపతిని పరమేశ్వరుడు శిరస్సు ఖండన చేసి మరలా గజముఖము పెట్టినప్పుడు...
జగదాంబ పార్వతీదేవిని ఆనందింప చేయుటకు పరమేశ్వరుడితో సహా దేవతలందరూ పార్వతీదేవి ఒడిలో ఉన్న వినాయకుని స్తుతించిన స్తుతి ఇది.
శ్రీ పుత్రగణపతి స్తోత్రం
శ్లో।। ఙ్ఞానశక్తిముమాం దృష్ట్వాయద్ దృష్టం వ్యోమ్ని శంభునా|
యచ్చోక్తం బ్రహ్మణా పూర్వంశరీరంతు శరీరిణామ్||
శ్లో।। యచ్చాపి హసితం తేనదేవేన పరమేష్ఠినా ।
ఏతత్కార్య చతుష్కేణపృథివ్యాంచ చతుర్ప్యపి ।।
శ్లో।। ప్రదీప్తాస్యో మహాదీప్తఃకుమారో భాసయన్ దిశః ।
పరమేష్ఠి గుణైర్యుక్తః సాక్షాత్‌రుద్ర ఇవాపరః ।।
శ్లో।। ఉత్పన్నమాత్రో దేవానాంయోషితః సప్రమోహయన్ ।
కాన్త్యా దీప్త్యా తథా మూర్త్యారూపేణచ మహాత్మవాన్ ।।
శ్లో।। తద్ దృష్ట్వా పరమం రూపంకుమారస్య మహాత్మనః ।
ఉమానిమీషే నేత్రాభ్యాంతమ పశ్యతభామినీ ।।
#శ్రీపరమేశ్వర_ఉవాచ –
శ్లో।। వినాయకో విఘ్నకరో గజాస్యో
గణేశ నామా చ భవస్య పుత్రః ।
ఏతేచ సర్వే తవయాన్తు భృత్యా
వినాయకాః క్రూరదృశః ప్రచండాః ।
ఉచ్చుష్మ దానాది వివృద్ధ దేహః
కార్యేషు సిద్ధం ప్రతిపాదయన్తః ।।
శ్లో।। భవాంశ్చ దేవేషు తథా ముఖేషు
కార్యేషుచాన్యేషు మహానుభావాత్ ।
అగ్రేషు పూజాం లభతేన్యధాచ
వినాశయిష్య స్యథ కార్యసిద్ధిం ।।
శ్లో।। ఇత్యేవ ముక్త్వా పరమేశ్వరేణ
సురైఃసమం కాంచన కుంభ సంస్థెః ।
జలై స్తథా సావభిషిక్తగా
త్రోరరాజ రాజేంద్ర వినాయకానాం ।।
శ్లో।। దృష్ట్వాబిషిచ్య మానంతుదేవాస్తం గణనాయకం ।
తుష్టువుః ప్రయతాః సర్వేత్రిశూలాస్త్రస్య సన్నిధౌ ।।
దేవా ఈచుః –
శ్లో।। నమస్తే గజవక్త్రాయనమస్తే గణనాయక ।
వినాయక నమస్తేస్తు నమస్తేచండ విక్రమ ।।
శ్లో।। నమోస్తుతే విఘ్నకర్త్రేనమస్తే సర్పమేఖహో ।
నమస్తే రుద్ర వక్రోత్థ ప్రలంబ జఠరాశ్రిత ।
సర్వదేవ నమస్కారాదవిఘ్నం కురు సర్వదా ।।
#శ్రీ_పార్వత్యువాచ
శ్లో।। అపుత్రోపి లభేత్ పుత్రానధనోపి ధనం లభేత్ ।
యం యమిచ్ఛేత్ మనసాతం తం లభతి మానవః ।।
శ్లో।। ఏవంస్తుత స్తదాదేవైర్మహాత్మా గణనాయకః ।
అభిషిక్తస్య రుద్రస్యసోమస్యా పత్యతాం గతః ।।
శ్లో।। ఏతస్యాం యస్తిలాన్ భుక్త్వాభక్త్యా గణపతిం నృప ।
ఆరాధయతి తస్యాశు తుష్యతేనాస్తి సంశయః ।।
శ్లో।। యశ్చైతత్ పఠతే స్తోత్రంయశ్చైతచ్ఛ్రుణుయాత్ సదా ।
నతస్య విఘ్న జాయన్తేనపాపం సర్వథా నృప ।।
ఈ స్తుతిని విన్న అమ్మవారు ఎవరైతే ఈస్తుతిని గౌరీ సమేత గణపతిని ఫాల్గుణ శుధ్ధ చవితి నాడు
(భాద్రపద శుద్ధ చవితి అనగా వినాయక చవితి నుండి సరిగ్గా 180 రోజులు అంటే ఆరు నెలలు గడిచే సరికి ఫాల్గుణ శుద్ధ చవితి వస్తుంది)
పఠించి నువ్వులు , బెల్లము నివేదన చేసి ప్రసాదముగా స్వీకరిస్తారో అట్టి భక్తులందరికీ నాకే విధముగా అయితే పుత్రశోకము తొలగి పుత్రవృద్ధి కలిగినదో అదేవిధముగా అందరికీ పుత్రోత్పత్తి కలిగి వంశవృద్ధి జరుగునని జగదాంబ పార్వతి వరమిచ్చెను.
ఈ స్తుతి పారాయణము చేయడం వలన వంశ దోషములు తొలగి శక్తి యుక్తులు కలిగిన పుత్రులు జన్మించునని వరాహపురాణ వచనము.
Comments
Post a Comment