ఓం శ్రీ సుబ్రహ్మణ్యస్వామినే నమః 🙏

  ఓం శ్రీ సుబ్రహ్మణ్యస్వామినే నమః 🙏


     నమస్తే నమస్తే మహాశక్తి పాణే

     నమస్తే నమస్తే లసద్వజ్రపాణే

     నమస్తే నమస్తే కటిన్యస్త పాణే

     నమస్తే నమస్తే సదాభీష్టపాణే


ఒక చేతిలో మహాశక్తి ఆయుధాన్ని, ఒక చేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని, ఇంకొక చేతిని కటిపై వుంచి,

మరొక హస్తంతో అభయప్రదానం చేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నమస్కారాలు🙏


సత్... పరమేశ్వరుడు

చిత్... అంబిక.

ఈ సత్ చిత్ రెండును ఏకం కాగా #ఆనందం ఉద్భవించింది. 

ఆ సచ్చిదానందమే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు.


కంఠంలో రత్నాలంకారాలు, మేనిలో చక్కదనం, చేతిలో జ్ఞానశక్తి ఆయుధం, ముఖాన చిరునవ్వు, కటియందు హస్తాన్ని దాల్చి నెమలిపై ప్రకాశిస్తుండే స్వామి #జ్ఞానస్వరూపుడు.

శరణన్నవారిని కాపాడే దేవుడు.


షణ్ముఖుడు...ఆరు ముఖాలు కలవాడు.

ఆయన ఈ సృష్టిలోని సమస్తంలో ఉన్నాడు.


సుబ్రహ్మణ్యస్వామి...

శూరపద్ముని ఆవరించి ఉన్న మాయను తొలిగించి, అతనికి మోక్షమార్గాన్ని చూపినందుకే స్వామిని మనమంతా సుబ్రహ్మణ్యస్వామి అని కొలుచుకుంటున్నాం. 


ఆయన కరుణామయుడు...మనలోని అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి, మన మనసులలో జ్ఞానజ్యోతులను వెలిగిస్తాడు.


స్కందుడు

"స్కంద" అంటే ఒకటిగా చేరినది అని అర్థం. పార్వతీదేవి ఆరుపద్మాలలో ఆరు శిశువులను చూసిన కాసేపటికి ఆ ఆరు శిశువులు ఒకే శిశువుగా మారి ఆరు తలలతో పన్నెండు చేతులతో ప్రత్యక్షమయ్యాడు. 

అందుకే స్కందుడు అయ్యాడు.


గాంగేయుడు

శివుని త్రినేత్రం నుండి వెలువడిన జ్యోతి కిరణాలు శరవణపోయ్ గై అనే నదిలో ఐక్యం అయిన తరువాత స్వామి ప్రత్యక్షమవడం వలన గాంగేయుడు అని పిలువబడుతున్నాడు. గాంగేయుడు అంటే #గంగపుత్రుడు.


వేలాయుధుడు

స్వామి ఆయుధం శూలం (వేల్ అని తమిళంలో అంటారు).

ఈ వేల్ తోనే శూరపద్ముడు, అతని దుష్ట పరివారమంతా సంహరించబడింది. 

వేల్ జ్ఞానశక్తికి ప్రతీక. 

స్వామి తన వేలాయుధంతో మనలోని అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞాన దీపికలను వెలిగిస్తున్న వేలాయుధుడు. 



సేనా విదారక స్కంధ మహాసేన మహాబల

రుద్రోమాగ్నిజ శాద్వాక్త్ర గంగార్భా నమోస్తుతే


రాక్షససైన్యాన్ని నశింపజేసినవాడా, 

శరవణ తటాకము నుండి ఒడ్డుకు జారినవాడా.

గొప్ప సైన్యాన్ని నిరంతరం అదుపు రక్షణగా ఉంచుకునే వాడా, సాటిలేని శక్తి సామర్థ్యములు గలవాడా, శంకరునకు పార్వతికి అగ్నికి కుమారుడవైనట్టివాడా, గంగాదేవి గర్భవాసం చేసినట్టివాడా, షణ్ముఖా, నీకు నమస్కారం🙏


ఈ శ్లోకం మనకు శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క సంపూర్ణ స్వరూప, స్వభావ, మహాత్మ్యాలను తెలియజేస్తుంది. 

దీనిని చెప్పుకొని ప్రార్థిస్తే ఆయన కృపకు ప్రాత్రులం అవుతాం.

                                                          -- సత్య వాడపల్లి

           

Comments

Popular posts from this blog

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

వైశాఖ అమావాస్య శని జయంతి.

💥సింహాచల చందనోత్సవం💥