ఆరోగ్యం కోసం సూర్యుని మంత్రం🙏

 ఓం నమో సూర్యాయ నమః 🙏


సూర్యనమస్కార మంత్రం🙏 


ఓం ధ్యాయేస్సదా సవితృమండలమధ్యవర్తీ

     నారాయణస్సరసిజాసన సన్నివిష్టః |

    కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ

     హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ||


 అర్ఘ్యం


వెలుగు, సమృద్ధికి చిహ్నంగా ఆదినారాయణుడు ని పేర్కొంటారు.

సూర్యునికి రోజూ "ఆర్ఘ్యం" ఇవ్వడం వల్ల శక్తి లభించి ఆర్థిక, అనారోగ్య సమస్యలన్నీ దూరమవుతాయి.


రోజూ ఉదయాన్నే సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడంతోనే దినచర్య ప్రారంభించడం ఉత్తమం.

అయితే అర్ఘ్యం ఇస్తూ సూర్య నమస్కారం చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలని పండితులు చెప్తున్నారు.


బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి.

అంటే సూర్యోదయానికి గంటన్నర ముందు మేల్కోవాలి. సూర్యోదయానికి ఎంత ముందు మేల్కొంటే అంత ఉత్తమం. 


స్నానం చేసిన తర్వాత శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. ఆర్ఘ్యం ఇచ్చేటప్పుడు సూర్యకిరణాలు తీవ్రంగా ఉండకూడదు. 

లేలేత భానుడి కిరణాల వల్ల ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్యపరమైన ప్రయోజనాలు చేకూరతాయి.


రాగి పాత్రలో స్వచ్చమైన నీటిని తీసుకుని అందులో కొద్దిగా తేనె కలిపాలి. 

ఆ తర్వాత రెండు చేతులతో ఈ పాత్రను పైకెత్తి సూర్య కిరణాలను చూస్తూ అందులోని నీటిని విడిచిపెడుతూ "సూర్యాయ నమః" మంత్రాన్ని ఉచ్ఛరించాలి. 

"ఓం ఘృణి సూర్య ఆదిత్య నమః" అనే మంత్రాన్ని 11 సార్లు ఉచ్చరిస్తూ నమస్కారం చేయాలి.


చేతులను సాధ్యమైనంత మేర పైకి లేపి అర్ఘ్యం ఇవ్వాలి. 

ఇలా చేస్తే సూర్యుడి నుంచి విడుదలయ్యే ఏడు కిరణాల శరీరం గుండా ప్రసరిస్తాయి. 

అంతే కాదు ఆసమయంలో నవగ్రహాల ఆశీర్వాదం కూడా లభిస్తుంది. 


అర్ఘ్యం ఇచ్చిన జలం పడిన ప్రదేశంలో కుడిచేతి వేళ్లతో తాకి ఆ మట్టిని నుదుటిపై పూసుకోవాలి.

అలాగే కళ్లు, మెడకు రాసుకోవాలి.

మట్టి ఉండే ప్రదేశంలోనే అర్ఘ్యం ఇవ్వాలి. 

సూర్యునికి సమర్పించిన జలాన్ని పాదాలకు తాకకుండా చూసుకోవాలి.


శరీరంలోని అనేక శక్తి ప్రదేశాలు ఉంటాయి. 

సూర్య నమస్కారం చేస్తూ, మంత్రాన్ని ఉచ్ఛరిస్తే ఈ శక్తి ప్రదేశాలన్నీ ఉత్తేజితమవుతాయి. 

దీని వల్ల కేవలం ప్రశాంతతే కాదు, అనేక వ్యాధులను కూడా దూరమవుతాయి.


భక్తితో సూర్య భగవానుడికి నీరు సమర్పిస్తే మనసులోని కోరికలన్నీ నేరవేరతాయి. 

పరిశుద్ధమైన ఆత్మ, స్వచ్ఛమైన మనసుతో భగవానుడికి వినయపూర్వకంగా అర్ఘ్యం ఇస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయి.

                    


ఆరోగ్యం కోసం సూర్యుని మంత్రం🙏


నమః సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణే

ఆయురారోగ్య ఐశ్వర్యం దేహి దేహిదేవః జగత్పతే!! 

     

అర్థం

ఓ సూర్యదేవా

జగత్ పరిపాలకా నీకిదే నా నమస్కారము🙏 

నీవు సర్వరోగములను తొలగించువాడవు. 

శాంతిని వొసంగువాడవు. మాకు ఆయువును, ఆరోగ్యమును, సంపదను అనుగ్రహించుము.


                                                          -- సత్య వాడపల్లి

                

Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం