ఓం నమో వేంకటేశాయ (శ్రీ పద్మావతీ అమ్మవారు)
ఓం నమో వేంకటేశాయ 🙏
శ్రీవేంకటేశ్వర స్వామి దేవేరి శ్రీ పద్మావతి అమ్మవారు.
ఈ అమ్మ తిరుపతి సమీపంలోని తిరుచానూరు (అలమేలు మంగాపురం)లో కొలువుదీరివున్నారు.
పూర్వం నైమిశారణ్యంలో మునులందరూ కలసి యజ్ఞాలు చేస్తుండగా, అక్కడికి నారదమహర్షి వచ్చి... “ఈ యాగం ఎవరికోసం చేస్తున్నారు” అని అడిగి, “చేస్తే చేశారు గానీ, దేవతలలో గొప్పవారు ఎవరో ముందుగా తెలుసుకుని...
ఈ యాగఫలాన్ని వారికి అర్పించండి” అని చెప్పి వెళ్ళిపోయాడు.
భృగుమహర్షి, ఎవరు గొప్పో తేల్చాలని ముందుగా బ్రహ్మలోకానికి, ఆ తరువాత కైలాసానికి వెళ్ళి చివరగా వైకుంఠానికి వెళ్ళినప్పుడు... కోపంతో
శ్రీమహావిష్ణువు వక్షస్థలం మీద కాలితో తన్నుతాడు.
అది చూసిన శ్రీమహాలక్ష్మీ ఆవేశంతో అలిగి భూలోకానికి వెళ్ళిపోయి కొల్హాపురం చేరుకుంది.
శ్రీనివాసుడు శుక ముని ఆశ్రమానికి చేరుకొని, అక్కడ ఒక చెరువు త్రవ్వి, అందులో స్వర్గలోకం నుంచి తెచ్చిన పద్మ🌷పుష్పాలను నాటుతాడు.
ఆ పుష్పాలు ఎల్లప్పుడూ వికసించి ఉండాలని, అందుకోసం సూర్యదేవుని కూడా ప్రతిష్టించి పన్నెండేళ్ళ పాటు తపస్సు చేయగా...
లక్ష్మీదేవి ప్రసన్నురాలై తిరుచానూరు పద్మ సరోవరంలో బంగారు పద్మంలో పదహారేండ్ల యువతిగా అవతరించింది.
శ్రీపద్మావతీ అమ్మవారు కార్తీక మాసం... శుక్లపక్షం... పంచమి తిథి రోజు శుక్రవారం ఉత్తారాషాఢ నక్షత్రంలో జన్మించారు.
పద్మంలో అవతరించినందువల్ల శ్రీమహాలక్ష్మీని పద్మావతిగా పిలుస్తూ దేవతలందరూ ఎన్నో విధాలుగా స్తుతించి ప్రార్థించారు.
కనుక లక్ష్మీదేవియే పద్మములో జనించిన పద్మావతి లేదా "అలమేలు మంగ"
తమిళంలో "అలర్" అనగా పువ్వు.
"మేల్" అనగా పైన. "మంగై" అనగా అందమైన స్త్రీ. "అలమేలు" అనగా "పద్మంలో ప్రకాశించు సుందరి".
చాన అంటే స్త్రీ, తిరుచాన అంటే శ్రీమంతురాలైన స్త్రీమూర్తి అని అర్థం.
ఆమె జన్మనక్షత్రం ఆధారంగా కార్తీకమాసంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.
ఈశానం జగతోస్య వేంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం
తద్వక్షస్థ్సల నిత్యావాసరసికాం తత్ క్షాంతి సంవర్థినీమ్,
పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం
వాత్సల్యాది గుణోజ్ఞ్యలాం భగవతీం పందే జగన్మాతరమ్
-- సత్య వాడపల్లి
Comments
Post a Comment