శ్రీ ఆంజనేయం (హనుమాన్ చాలీసా)

 శ్రీ ఆంజనేయం 🙏


భారతదేశాన్ని పాలిస్తున్న అక్బరు పాదుషాకు తులసీదాసు గురించి తెలిసింది. 

తన కొలువుకు రావాల్సిందిగా ఆహ్వానించాడు. 

కొన్ని మహిమలు చూపి పారితోషికాలను స్వీకరించవలసినదిగా ఆయనను కోరాడు. 


దానికి తులసీదాసు తన వద్ద మహిమలు లేవనీ, నిమిత్తమాత్రుడననీ తెలియజేశాడు. 

ఏవైనా మహిమలు జరిగితే అవి శ్రీరామచంద్రుని లీలలేనని తెలియజేసాడు. 


దానికి అక్బరుకు ఆగ్రహం కలిగింది. 

తన ఆజ్ఞను ధిక్కరించినందుకు భటుల్ని పిలిచి తులసీదాసును కొరడాలతో కొట్టవలసిందిగా ఆదేశించాడు. తులసి రెండు చేతులు జోడించి రామనామ స్మరణం చేశాడు. 


భటుల చేతుల్లోని కొరడాలు లేచినవి లేచినట్లే ఉండిపోయాయి. 

అక్బరుతో సహా భటులను భయంకరమైన చూపులతో, అరుపులతో అసంఖ్యాకమైన కోతులు బెదిరించసాగాయి. 

అంతా నిలువునా కంపించిపోసాగారు. 

చుట్టూ చేరిన కోతులు వాళ్లను అడుగైనా కదలనివ్వడం లేదు. 

అక్బరు దిగ్భ్రాంతి చెంది దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాడు. తన పొరపాటు తెలుసుకున్నాడు. తులసీదాసు పాదాల మీద పడిపోయి కన్నీరు, మున్నీరుగా విలపించసాగాడు. 


తులసిదాసుకేమీ అర్థం కాలేదు. 

కారణమడిగితే తన దయనీయస్థితిని వివరించాడు అక్బరు. 

తనకే కోతులు కనిపించడం లేదే అని

భక్తి ప్రపత్తులతో హనుమను ప్రార్థించాడు.

"స్వామీ! నాపైన ఎందుకింత నిర్దయ? వీరందరికీ దర్శనమిచ్చి కరుణించావు కదా, నాకెందుకా సౌభాగ్యం ప్రసాదించవు? నేను చేసిన అపరాధం ఏదైనా ఉంటే క్షమించు' అంటూ... 

వాయునందనుణ్ని అనేక విధాల స్తుతిచేశాడు. ఆంజనేయుని దర్శనం పొంది పరమానందభరితమైనాడు. 

అదే "హనుమాన్‌ చాలీసా"గా జగత్ప్రసిద్ధి పొందింది.


హనూమన్ చాలీసాలో నలభై శ్లోకాలు ద్విపదులుగా ఉంటాయి.

 


                

   హనుమాన్‌ చాలీసా


శ్రీగురుచరణ సరోజరజ నిజమన ముకుర సుధారి వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి | బుద్ధిహీన తను జానికే సుమిరౌ పవనకుమార బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార |


జయ హనుమాన జ్ఞానగుణసాగర జయ కపీశ తిహుం లోక ఉజాగర (1)


రామదూత అతులితబలధామా అంజనిపుత్ర పవనసుత నామా (2)


మహావీర విక్రమ బజరంగీ కుమతి నివార సుమతి కే సంగీ (3)


కంచనవరన విరాజ సువేసా కానన కుండల కుంచిత కేశా (4)


హాథ వజ్ర అరు ధ్వజా విరాజై కాంధే మూంజ జనేవూ సాజై (5)


శంకరసువన కేసరీనందన తేజ ప్రతాప మహాజగవందన (6)


విద్యావాన గుణీ అతిచాతుర రామ కాజ కరివే కో ఆతుర ( 7)


ప్రభు చరిత్ర సునివే కో రసియా రామ లఖన సీతా మన బసియా (8)


సూక్ష్మ రూప ధరి సియహిం దిఖావా వికట రూప ధరి లంక జరావా (9)


భీమ రూప ధరి అసుర సంహారే రామచంద్ర కే కాజ సంవారే (10)


లాయ సంజీవన లఖన జియాయే శ్రీరఘువీర హరషి ఉర లాయే (11)


రఘుపతి కీన్హీ బహుత బడాయీ కహా భరత సమ తుమ ప్రియ భాయీ (12)


సహస వదన తుమ్హరో యస గావైం అస కహి శ్రీపతి కంఠ లగావై (13)


సనకాదిక బ్రహ్మాది మునీశా నారద శారద సహిత అహీశా (14)


యమ కుబేర దిగపాల జహాం తే కవి కోవిద కహి సకే కహాం తే (15)


తుమ ఉపకార సుగ్రీవహిం కీన్హా రామ మిలాయ రాజపద దీన్హా (16)


తుమ్హరో మంత్ర విభీషణ మానా లంకేశ్వర భయే సబ జగ జానా (17)


యుగ సహస్ర యోజన పర భానూ లీల్యో తాహి మధుర ఫల జానూ (18)


ప్రభు ముద్రికా మేలి ముఖమాహీ జలధి లాంఘి గయే అచరజ నాహీం (19)


దుర్గమ కాజ జగత కే జేతే సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే (20)


రామ ద్వారే తుమ రఖవారే హోత న ఆజ్ఞా బిను పైసారే (21)


సబ సుఖ లహై తుమ్హారీ శరణా తుమ రక్షక కాహూ కో డరనా (22)


ఆపన తేజ సంహారో ఆపై తీనోం లోక హాంక తేం కాంపై (23)


భూత పిశాచ నికట నహిం ఆవై మహావీర జబ నామ సునావై (24)


నాసై రోగ హరై సబ పీరా జపత నిరంతర హనుమత వీరా (25)


సంకటసే హనుమాన ఛుడావై మన క్రమ వచన ధ్యాన జో లావై (26)


సబ పర రామ తపస్వీ రాజా తిన కే కాజ సకల తుమ సాజా (27)


ఔర మనోరథ జో కోయీ లావై సోయి అమిత జీవన ఫల పావై (28)


చారోం యుగ పరతాప తుమ్హారా హై పరసిద్ధ జగత ఉజియారా (29)


సాధు సంత కే తుమ రఖవారే అసుర నికందన రామ దులారే (30)


అష్ట సిద్ధి నవ నిధి కే దాతా అస వర దీన జానకీ మాతా (31)


రామ రసాయన తుమ్హరే పాసా సదా రహో రఘుపతి కే దాసా (32)


తుమ్హరే భజన రామ కో పావై జనమ జనమ కే దుఖ బిసరావై (33)


అంత కాల రఘుపతి పుర జాయీ జహాం జన్మ హరిభక్త కహాయీ (34)


ఔర దేవతా చిత్త న ధరయీ హనుమత సేయి సర్వ సుఖ కరయీ (35)


సంకట హరై మిటై సబ పీరా - జో సుమిరై హనుమత బలబీరా (36)


జై జై జై హనుమాన గోసాయీ కృపా కరహు గురు దేవ కీ నాయీ (37)


జో శత బార పాఠ కర కోయీ ఛూటహి బంది మహా సుఖ హోయీ (38)


జో యహ పఢై హనుమాన చలీసా హోయ సిద్ధి సాఖీ గౌరీసా (39)


తులసీదాస సదా హరి చేరా కీజై నాథ హృదయ మహ డేరా (40)


పవనతనయ సంకట హరణ మంగళ మూరతి రూప్ రామ లఖన సీతా సహిత హృదయ బసహు సుర భూప్ |

                  

Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు