వినాయకుని ఆసనంలో అంతరార్థం

  ఓం గం గణపతయే నమః 🙏


  ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకమ్‌


 భక్తావాసం స్మరేనిత్యం ఆయుష్కామార్థసిద్ధయే



వినాయకుని ఆసనంలో అంతరార్థం


లలితాసనం

చాలా ప్ర‌తిమ‌ల‌లో వినాయ‌కుడు త‌న ఎడ‌మ కాలుని ముడుచుకుని, కుడి పాదాన్ని కింద‌కి ఉంచి క‌నిపిస్తాడు. 

దీనినే యోగ‌శాస్త్రంలో ల‌లితాస‌నం అంటారు. 

సాక్షాత్తూ జ్ఞానానికి ప్ర‌తిబింబ‌మైన ల‌లితాదేవి కూడా ఈ ఆస‌నంలోనే క‌నిపిస్తుంది.


ఒక ప‌క్క ప్రశాంతంగా ఉంటూనే అవ‌స‌ర‌మైన‌ప్పుడు ఎలాంటి కార్యాన్ని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే త‌త్వానికి ఈ ఆస‌నాన్ని ప్ర‌తీక‌గా భావిస్తారు. 


ఒక ప‌క్క జీవితంలో ఎదుర‌య్యే ఒడుదొడుకులను ఎదుర్కొంటూనే, మ‌న‌సుని స్థిరంగా నిలుపుకోగ‌ల‌డ‌మే నిజ‌మైన స‌వాలు.


త‌న‌ను కొలిచే భ‌క్తుల విఘ్నాల‌ను తొల‌గించి వారిని కూడా పరిపూర్ణ‌మైన వ్య‌క్తులుగా తీర్చిదిద్దుతాన‌ని స్వామి హామీ ఇస్తున్నాడు. 


అందుక‌నే భ‌క్తులు ఎక్కువ‌గా ల‌లితాస‌నంలో ఉన్న వినాయ‌కునికే పూజ‌లు చేస్తుంటారు.


అభంగం

స‌్థిరంగా నిల్చొని ఉన్న గ‌ణ‌ప‌తి రూపాన్ని "అభంగ‌" అంటారు.


తాను చూడ‌టానికి భారీకాయంతో ఉన్నా త‌న మ‌న‌స్సు ఆ శారీర‌క ప‌రిమితుల‌కు లోబ‌డ‌ద‌ని గ‌ణేశుడు ఈ భంగిమ‌లో మ‌న‌కి సూచిస్తున్నాడు. 


త‌న ద‌రికి చేరిన భ‌క్తుల‌కు విజయాన్ని చేకూర్చేందుకు క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని... 

భ‌క్తుల‌ను కూడా దృఢ‌సంక‌ల్పంతో ఉండ‌మ‌ని ఆ విఘ్న‌నాయ‌కుడు తెలియ‌చేస్తున్నాడు.


నాట్య గణపతి

ప‌ట్ట‌రాని సంతోషం క‌లిగిన‌ప్పుడు ఎవ‌రికైనా నాట్యం చేయాల‌ని ఉంటుంది.

అలా భ‌క్తుల‌కు అంతులేని ఆనందాన్ని అనుగ్ర‌హిస్తాన‌ని ఈ భంగిమ సూచిస్తుంది. 


మ‌న‌సులోని భావాల‌కు అనుగుణంగా ల‌య‌బ‌ద్ధమైన అడుగులు వేయ‌డం మ‌న భార‌తీయ నాట్య‌శాస్త్రంలోని ప్ర‌త్యేక‌త‌. 


మ‌నసు, శ‌రీరం రెండూ ఒక‌దానికొక‌టి అనుగుణంగా సాగే ఈ ఆనంద తాండ‌వంలా మ‌న అంద‌రి జీవిత‌మూ హాయిగా సాగిపోవాల‌ని ఆ గ‌ణేశుడు సంక‌ల్పిస్తున్నాడ‌న్న‌మాట‌. 

            

భంగిమ ఏదైనా త‌న భ‌క్తులకు స‌క‌ల విజ‌యాల‌నూ క‌లిగించ‌డ‌మే ఆ విఘ్న‌నాయ‌కుని ల‌క్ష్యం.

                  

ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః

ప్రమథ పతయే నమస్తేస్తు లంబోదరాయ

ఏకదంతాయ విఘ్నవినాశినే శివ సుతాయ 

శ్రీవరద మూర్తయే నమో నమః🙏

                                                        -- సత్య వాడపల్లి

                     

Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు