Posts

Showing posts from February, 2024

💥మాధవుని సన్నిధికి చేర్చే మాఘ పౌర్ణమి

Image
 ⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ🌹🙏 💥మాధవుని సన్నిధికి చేర్చే మాఘ పౌర్ణమి . మాసాలన్నింటిలోకీ మాఘ మాసం విశిష్టమైనది. రథసప్తమి (సూర్యుడు), భీష్మ ఏకాదశి (విష్ణుమూర్తి), శ్రీ పంచమి (సరస్వతీదేవి), మహాశివరాత్రి (శివుడు) ఇలా సకల దేవతలనూ కొలుచుకునేందుకు ఏదో ఒక పర్వదినాన్ని అందించే మాసం ఇది. చైత్రాది పన్నెండు మాసాలకూ ఏదో ఒక ప్రత్యేకత వుంది. కార్తీక మాసం దీపాలకూ , దీపారాధనలకు ప్రసిద్ధి. మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి. "మా - అఘం'' అంటే పాపం ఇవ్వనిది అని అర్థం. కనుకనే మాఘమాసం అన్నారు. సంవత్సరంలో నాలుగుసార్లు సాగరస్నానం చేయాలనీ, అవి కూడా "ఆషాఢ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ, మాఘ పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ'' లలో చేయాలని , ఆలా సాగరస్నానాలు చేసినవారికి సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యం కలుగజేస్తాడని పురాణాలు చెప్పాయి.  ఇక మాఘ పౌర్ణమి వచ్చిందంటే చాలు పుణ్య తీర్థాలన్నీ కళకళలాడిపోతాయి. స్నానాలలోకెల్లా మాఘస్నానం ఉత్తమం అని పెద్దలు చెబుతూ ఉంటారు. నదులు, సముద్రాలు, ఆఖరికి గుడిలోని కోనేరులు కూడా ఈ రోజున పవిత్రతను సంతరించుకుంటాయని నమ్మకం.  ఇక మాఘపౌర్ణమి నాడు చేసే సముద్ర స్నానం గురించి చెప్పనే అక్కర్లేద...

సమ్మక్క - సారలమ్మ అసలు కథ ఏంటి? కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏 💥 సమ్మక్క - సారలమ్మ అసలు కథ ఏంటి? కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు? మేడారం జాతర .. ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా కీర్తి గడించింది. ఇక్కడి వన దేవతలను దర్శించుకొనేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలివస్తుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో మేడారం జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. అయితే, మేడారానికి ఇంతటి ప్రాశస్త్యం ఎందుకు దక్కింది? ఇక్కడ వన దేవతలుగా కొలిచే సమ్మక్క సారలమ్మ ఎవరు? జంపన్న వాగు ప్రాముఖ్యం ఏమిటి? అసలు ఈ జాతరను ఇంత వైభవంగా ఎందుకు నిర్వహిస్తున్నారు? 💥పూర్వం కోయదొరలు వేటకోసం అడవికి వెళ్లిన సందర్భంలో అక్కడ వారికి పెద్ద పులుల కాపలా మధ్య ఓ పసిపాప కనిపించింది. ఆ పాపను కోయదొరలు గుడారానికి తీసుకెళ్లి దాచారు. పాప గూడేనికి వచ్చినప్పటి నుంచి అన్నీ శుభాలే జరగడంతో కొండ దేవతే ఆ రూపంలో ఉందని నమ్మారు.  మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఆ పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు. సమ్మక్కను ఆ ప్రాంతపు కోయ చక్రవర్తి మేడరాజు పెంచి పెద్ద చేశాడు. క్రీస్తు శకం 1260 నుంచి 1320 కాలంలో అంటే కాకతీయుల ఏలుబడిలో ఇప్పటి జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పొలవాసను గిర...

ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః🌹

Image
 ⚜️🕉️ 🚩 ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః🌹🙏 చిద్ఘనాయ మహేశాయ వటమూలనివాసినే । సచ్చిదానందరూపాయ దక్షిణామూర్తయే నమః ॥  💥"భూతాకాశము" అనగా నీవు చూసే ఆకాశ మొకటి.. చిత్తాకాశము, చిదాకాశము, దహరాకాశము, కేవలాకాశములతో కలిపి మొత్తం "పంచగగనములు" ఈ పంచ గగనముల పద్ధతిగా, బోధించబడే బోధ పేరు 'ప్రబోధ'. దక్షిణామూర్తి విధానంలో చెప్పబడేదంతా ప్రబోధ పద్ధతి. అచల సిద్ధాంతంలో ప్రబోధ చూడామణి అని కందార్థాలలో ఒకటుంది. అచల సిద్ధాంతమంతా మౌనవ్యాఖ్యే. గురువు గారిని చూస్తూ ఉండగానే హృదయ స్థానంలో గురుశిష్య ఐక్యతా సిద్ధిని పొంది, గురువు గారిలో ప్రబోధ చేయాలి, ప్రకటించాలని సంకల్పం కలగగానే శిష్యుడికి అర్థం కావాలి. గురు హృదయంలో బోధించాలనే సంకల్పం కలగగానే, వ్యక్తీకరించక ముందే శిష్యుడికి అర్థమైపోవాలి. అర్థమైతే చెప్పక్కర్లేదు. ఇంటిలో వారి అవసరాన్ని గుర్తెరిగి ఆ అవసరాన్ని తీర్చావు గనుక వారికి సంతోషం. అలా కాకపోతే అన్యోన్యత లోపించినట్లవుతుంది. అన్యోన్యత ఉన్నచోట మౌనం ఉంటుంది. బాగా గుర్తుంచుకోవాలి. మనం మాట్లాడే విధానం గురించి భాగవతంలో ప్రహ్లాదుడు ఏం చెప్పాడు? ఢమఢమ ధ్వనుల ఢక్క గాక! సదా ఈశ్వరీయ బుద్ధితో, ఈశ్వరీయ చ...

💥సిద్ధి వినాయక స్తోత్రం💥

Image
 ⚜️🕉️🚩ఓం గం గణపతయే నమః 🌹🙏 💥 సిద్ధి వినాయక స్తోత్రం💥 విఘ్నేశ విఘ్నచయఖండననామధేయ శ్రీశంకరాత్మజ సురాధిపవంద్యపాద । దుర్గామహావ్రతఫలాఖిలమంగళాత్మన్ విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ॥ 1 ॥ సత్పద్మరాగమణివర్ణశరీరకాంతిః శ్రీసిద్ధిబుద్ధిపరిచర్చితకుంకుమశ్రీః । వక్షఃస్థలే వలయితాతిమనోజ్ఞశుండో విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ॥ 2 ॥ పాశాంకుశాబ్జపరశూంశ్చ దధచ్చతుర్భి- -ర్దోర్భిశ్చ శోణకుసుమస్రగుమాంగజాతః । సిందూరశోభితలలాటవిధుప్రకాశో విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ॥ 3 ॥ కార్యేషు విఘ్నచయభీతవిరించముఖ్యైః సంపూజితః సురవరైరపి మోదకాద్యైః । సర్వేషు చ ప్రథమమేవ సురేషు పూజ్యో విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ॥ 4 ॥ శీఘ్రాంచనస్ఖలనతుంగరవోర్ధ్వకంఠ- -స్థూలేందురుద్రగణహాసితదేవసంఘః । శూర్పశ్రుతిశ్చ పృథువర్తులతుంగతుందో విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ॥ 5 ॥ యజ్ఞోపవీతపదలంభితనాగరాజ మాసాదిపుణ్యదదృశీకృతృక్షరాజః । భక్తాభయప్రద దయాలయ విఘ్నరాజ విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ॥ 6 ॥ సద్రత్నసారతతిరాజితసత్కిరీటః కౌసుంభచారువసనద్వయ ఊర్జితశ్రీః । సర్వత్రమంగళకరస్మరణప్రతాపో విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ॥ 7 ॥ దేవాంతకాద్యసురభీతసు...

కొలిచే వారికి కొంగుబంగారం వెూపిదేవి సుబ్రహ్మణ్యస్వామి..

Image
 ⚜️🕉️🚩ఓం సుబ్రహ్మణ్యాయ నమః🌹🙏 💥 కొలిచే వారికి కొంగుబంగారం వెూపిదేవి సుబ్రహ్మణ్యస్వామి .. కొలిచే వారికి కొంగు బంగారం, కోరిన వారికి కోరికలు తీర్చే మహిమాన్వితుడు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి. దివ్యమైన దివిసీమలో వేంచేసి యున్న మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం పరమ పవిత్రమైన స్థలం. పరమ పవిత్రమైన ప్రాచీనమైన మోపిదేవి ఆలయంలో పరమేశ్వరుడు, ఆయన కుమారుడైన కుమారస్వామి ఒకే చోట కొలువై ఉన్నారు. మోపిదేవి సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రం ప్రస్తావన స్కంద పురాణంలో కూడా కనిపిస్తుంది. ఈ స్వామిని కొలిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని, వివాహం కాని వారికి వివాహం జరుగుతుందని తరతరాలుగా భక్తుల నమ్మకం. 💥#స్థల_పురాణం: దేవతల వినతి మేరకు మేరుపర్వతం గర్వమణచే ఘట్టంలో భాగంగా అగస్త్య మహర్షి కాశీ పట్టణాన్ని వీడి దక్షిణ భారతదేశం పర్యటనకు బయలుదేరారట. ఆ క్రమంలోనే అగస్త్య మహర్షి కృష్ణానదీ తీరంలో ఉన్న ప్రస్తుతం మోపిదేవి పేరు.. పూర్వం మోహినీపురం. అక్కడకు చేరి సేద తీరుతుండగా జాతి వైరాన్ని మరిచి పాము, ముంగిస, నెమలి ఒకే చోట ఆడుకొంటూ కనిపించాయి. అటుపక్కనే దివ్యతేజస్సు విర జిమ్ముతూ ఒక పుట్ట కూడా ఆకర్షించింది. దగ్గరికి వ...

భీష్మ ఏకాదశి", "మహాఫల ఏకాదశి", "జయ ఏకాదశి

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 మాఘ శుద్ధ ఏకాదశిని "భీష్మ ఏకాదశి", "మహాఫల ఏకాదశి", "జయ ఏకాదశి" అని అంటారు. భీష్మ నిర్యాణానంతరం వచ్చిన ఏకాదశి కనుక ఈ భాగవత శిఖామణి పేరున ఈ ఏకాదశిని ‘భీష్మ ఏకాదశి’ అని పిలుస్తారు భారతంలో భీష్మునిది ఒక ప్రత్యేకమైన పాత్ర. శీలంలో, శౌర్యంలో, నీతిలో, నిష్ఠలో భీష్మునికి సాటి భీష్ముడే.  చిన్నతనం నుంచీ ఆయన త్యాగపురుషుడే. తండ్రి కొరకు స్వసుఖాన్నీ, రాజ్యాన్నీ అన్నీ వదులుకున్నవాడు భీష్ముడు తప్ప మరొకరు లేరు. శ్రీకృష్ణుడు కేవలం నరుడు కాడని, ఆయన సాక్షాత్తు పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుడని శ్రీకృష్ణుని సమకాలికులలో ఎరుక గల్గిన అతికొద్ది మందిలో భీష్ముడు ముఖ్యుడు.  💥58 రోజులు అంపశయ్యపై పవళించి ఉత్తరాయణ పుణ్య తిథి కోసం వేచి ఉన్న, ధ్యాన సమాధి స్థితిలోనున్న భీష్ముడు, ఎవరో తన దగ్గరకు వచ్చిన అలికిడికి వాలివున్న కను రెప్పలను భారంగా పైకెత్తి చూసాడు. పాండవులు, శ్రీకృష్ణుడు కనిపించారు. అంతిమ క్షణాల్లోమాధవుని ముఖారవింద దర్శనం ఆ కురువృద్ధునికి ఆనందం కలిగించింది. భక్తిగా చేతులు జోడించగా, పాండవులు ఆ జ్ఞాననిధికి పాదాభివందనం చేశారు. మౌనంగానే వారిని ఆశీర్వది...

💥శివపార్వతుల దశావతారములు:

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 మహాదేవం మహాయోగ మీశానం త్వంబికాపతిమ్ | యోగినం యోగదాకారం యోగమాయా సమహృతమ్ || 💥 శివపార్వతుల దశావతారములు : జీవరాశుల అభ్యున్నతి కోసం నిర్హేతుక కృపతో భగవంతుడు స్వీకరించేదే అవతారం.  ప్రపంచమందు అధర్మం ఎక్కువైనపుడు చెడ్డవాళ్లను శిక్షించటానికి, మంచివాళ్లని రక్షించటానికి భగవంతుడు పశు పక్షి మనుష్యాది రూపాలలో భూమిపైన అవతరించునని నమ్మకం. పురాణాల ప్రకారం విష్ణుమూర్తి లోక కల్యాణార్థం ఒక్కో యుగంలో ఒక్కో అవతారంలో పది అవతారాలు ఎత్తి ప్రతి యుగంలోనూ ధర్మాన్ని నిలబెట్టాడు. అయితే లోక కల్యాణార్థం శివపార్వతులు కూడా పది అవతారాలు ఎత్తారు అని పురాణాలు చెబుతున్నాయి. అడిగిన వెంటనే వరాలిచ్చే భోళాశంకరుడు అయిన పరమ శివునకు కూడా విష్ణుమూర్తి వలె దశావతారములున్నవి. 💥శతరుద్ర సంహితలో నందీశ్వరుడు, సనత్కుమారునకు ఈశ్వరావతారమును వివరిస్తాడు.  ఒక్కొక్క అవతారము ఒక్కొక్క ప్రయోజనం కలిగి ఉంటుంది. మరి ఆ పది అవతారాలను తెలుసుకుందాం. 1) శివుని ప్రధమ అవతారము మహాకాలుడు. మహాకాళి ఈ మహా కాలునికి భార్య. వీరిరువురు భక్తులకు భుక్తి, ముక్తిని ఇచ్చుచు వారి కోరికలను నెరవేర్చుచుందురు. 2) ఈశ్వరుని ద్వితీయ అవ...

💥సప్త మోక్షపురి..

Image
 ⚜️🕉️🚩శ్రీ రామ జయ రామ జయజయ రామ 🌹🙏 💥సప్త మోక్షపురి.. కాశీ కాంచీ అవంతికా పురీ ద్వారావతీ చైవ సప్తైతే మోక్షదాయికా ఈ శ్లోకం జగత్‌ ప్రసిద్ధం.... దీని అర్థం: అయోధ్యా , మధుర, మాయ (హరిద్వార్), కాశీ, కాంచీపురం, అవంతిక (ఉజ్జయిని), ద్వారక... ఈ ఏడు ముక్తినిచ్చే స్థలాలు (నగరాలు) దేశంలోని ఈ ఏడు ప్రధాన పుణ్యక్షేత్రాలను సప్త మోక్ష పురాలుగా పురాణాలు పేర్కొంటున్నాయి. 1) #అయోధ్య: అందరూ అనుకుంటున్నట్లు అయోధ్య కేవలం నగరం మాత్రమే కాదని, మానవ జీవచైతన్యానికి ఇదొక ప్రతీక అని అధర్వణవేదం చెబుతున్నది. "అష్టాచక్రా నవద్వారా దేవానాం పూరయోధ్యా తస్యాం హిరణ్మయః కోశః స్వర్గో జ్యోతిషావృత్తః" ఎనిమిది చక్రాలు, తొమ్మిది ద్వారాలు ఉండే మానవ శరీరం అయోధ్యకు ప్రతీక. యోగశాస్త్ర ప్రకారం అయోధ్యను మానవశరీరంలో ఉండే సహస్రార చక్రంతో పోలుస్తారు. సహస్రార చక్రం శిరస్సు మధ్యభాగంలో ఉంటుంది. ఇది పరిపూర్ణమైన జ్ఞానానికి ప్రతీక. ఈ చక్రంలో విశ్వచైతన్యం వ్యక్తిచైతన్యంగా ప్రకాశిస్తుంది. ఆత్మజ్ఞానాన్ని సాధించిన పరమయోగులకు మాత్రమే సహస్రార చక్రానికి సంబంధించిన అనుభూతి పూర్వక జ్ఞానం లభిస్తుంది. ఈ స్థానాన్ని తెలుసుకున్నవారికి పునర్జన్మ ఉం...

💥మాఘమాస శుక్లపక్ష నవమి మధ్వనవమి

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🙏 💥మాఘమాస శుక్లపక్ష నవమి మధ్వనవమి అది కన్నడ సీమలోని ఉడుపి పట్టణం. ఆ సాయం సమయంలో... సముద్రంలో ఒక పడవ కదలకుండా నిలిచిపోయింది. దాన్ని కదిలించడానికి నావికులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ప్రయోజనం కనిపించడం లేదు. తీరంలో ఉన్న ప్రజలను సాయం చెయ్యాలని కోరుతూ ఆ నావికులు బిగ్గరగా అరుస్తున్నారు. సముద్రంలో అలలు పోటు మీద ఉండడంతో... ఎవరూ ముందుకు వెళ్ళడానికి సాహసించలేక పోతున్నారు.  ఆ సముద్ర తీరంలో... ఒక ఇసుక తిన్నె మీద కూర్చొని, దైవ ధ్యానం చేస్తున్న ఒక యతీశ్వరుడు... ఆ శబ్దాలను విని కళ్ళు తెరిచి చూశారు. పరిస్థితి గ్రహించారు. తన భుజం మీద ఉన్న కాషాయాంబరాన్ని తీసి, పడవను రమ్మన్నట్టుగా ఊపారు. వెంటనే పెనుగాలి వీచింది. సముద్రంలో చిక్కుకున్న పడవ ఒక్కసారిగా ఊగి, సముద్రం వైపు కొట్టుకువచ్చింది. పడవలోని నావికులు, ప్రయాణికులు తమ ప్రాణాలను కాపాడిన ఆ యతీశ్వరుణ్ణి అనేక విధాలుగా ప్రశంసించారు. ఆ యతీశ్వరుడే శ్రీ మధ్వాచార్యులు. వాయుదేవుడి మూడవ అవతారంగా ఆయన కీర్తి పొందారు. 💥ఉడుపిలో శ్రీ కృష్ణప్రతిమను ప్రతిష్ఠించాలనే సంకల్పంతో శ్రీ మధ్వాచార్యులు ఆ రోజు అక్కడికి వచ్చి ధ్యానం చేస్తున...

💥అష్టాక్షరీ మహామంత్రం💥

Image
 ⚜️🕉️🚩🌹ఓం నమో నారాయణాయ🌹🙏 కరుణాపారావార వరుణాలయ గంభీర నారాయణ! నవ నీరద సంకాశ కృత కలి కల్మష నాశ నారాయణ!! యమునా తీర విహార ధృతకౌస్తుభ మణి హార నారాయణ! పీతాంబర పరిధాన సుర కళ్యాణ నిధాన నారాయణ!! 💥 అష్టాక్షరీ మహామంత్రం 💥 ప్రతి అక్షరం బీజాక్షరం, ప్రతి బీజాక్షరం దేవతాశక్తి స్వరూపం. విశ్వచైతన్యం దేవతగా అవతరించినపుడు అతి సూక్ష్మంగా ఆలోక్యమయ్యే అతీంద్రియ శక్తి మంత్రం..  "ఓం నమో నారాయణాయ" అనే అష్టాక్షరీ మంత్రంలో “ఓమ్" – ఆత్మ స్వరూపాన్ని, "నమః” – అనే అక్షరాలు – బుద్ధిని, మనస్సుని, “నారాయణాయ” – అనే అక్షరాలు పంచేంద్రియాలను “జీవుని” తెలియజేస్తున్నాయి. అష్టాక్షరీ మంత్రం ‘వ్యాపక మంత్రం’. ఆకాశతత్త్వంపై ఆధారపడి ఉంది. ఆ కారణంగా ఈ మంత్రాన్ని జపించేటప్పుడు, ఉపాసకుని మనస్సంతా ఈ మంత్రమే వ్యాపించి ఏకాగ్రతను కలిగిస్తుంది. జలాలకు నారములని పేరు. పరమాత్మ ఆ ‘అనంతజలరాశి’లో శయనిస్తాడు కనుక ఆయనకు ‘నారాయణ’ అనే నామం వచ్చింది. ఇంకా, “న” కార పదోచ్చారణ మాత్రేనైవ నాకాధిప భోగం లభతే “ర” కార పదోచ్ఛారణేవ రామరాజ్య భోగం లభతే “య” కార పదోచ్ఛారణేవ కుబేరవత్ ప్రకాశతే “ణ” కార పదోచ్చారణేవ వైరాగ్యం లభతే “న" అను ...

తిరుమలలో వైభ‌వంగా ర‌థ‌స‌ప్త‌మి వేడుక‌లు.. సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడు.

Image
 ⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ🌹🙏 💥తిరుమలలో వైభ‌వంగా ర‌థ‌స‌ప్త‌మి వేడుక‌లు.. సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడు. . ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమినాడు ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడి జన్మదినాన్ని పురష్కరించుకుని రథ సప్తమి వేడుకలను టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహిస్తుంది. రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో క్రీ.శ 1564 నుండి జరుపుతున్నట్లుగా శాసనాధారాలు ఉన్నాయి. సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు మలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు. రథసప్తమి సందర్భంగా తేజో నిధి, సకల రోగ నివారకుడు, ప్రకృతి చైతన్య ప్రదాత అయిన సూర్యుని వాహనంగా అధిరోహించి తిరుమలలో శ్రీ మలయప్ప స్వామి భక్తులను కటాక్షించారు. తిరుమాఢ వీధుల్లో విహరిస్తున్న మలయప్ప స్వామి వారిని దర్శించుకునేందుకు అశేష సంఖ్యలో భక్తులు తిరుమాడ వీధులు చేరుకుని గోవిందుడికి మంగళ హారతులు పలికారు. 💥సూర్యప్ర‌భ వాహ‌నం .. రథసప్తమి వాహనసేవల్లో అత్యంత ప్రధానమైనది సూర్యప్రభవాహనం. ఉద‌యం 5.30 గంట‌ల‌కు సూర్యప్రభ వాహన‌సేవ ప్రారంభమయి.. అక్కడ నుండి ఆలయ వాయువ్య దిక్కుకు చేరుకోగానే సూర్యోద‌యాన భాను...

💥మాఘ శుద్ధ అష్టమి.. భీష్మాష్టమి

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥మాఘ శుద్ధ అష్టమి.. భీష్మాష్టమి రధసప్తమి తరువాత వచ్చే రోజునే "భీష్మ అష్టమి" గా పిలుస్తారు. ఎందుకంటే ఇచ్ఛామరణ వరం ఉన్న భీష్ముడు ఉత్తరాయణం వచ్చాక ప్రాణాలు విడిచిపెట్టాడు. ఆయన కన్నుమూసిన మాఘ శుద్ధ అష్టమిని.. భీష్మాష్టమి పర్వంగా పేర్కొన్నారు. దేవతా గణాల్లో "అష్టవసువుల" పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. వీరిలో ఎనిమదో వసువు పేరు ప్రభాసుడు. ఈ ప్రభాసుడే భీష్ముడిగా జన్మించాడు. గంగాదేవి, శంతన మహారాజు ఎనిమిదో సంతానంగా పుట్టిన ప్రభాసుడికి "దేవవ్రతుడు" అని పేరు పెట్టారు. పదహారేండ్ల పాటు గంగాదేవి దగ్గర పెరిగాడు. సకల విద్యలు అభ్యసించిన దేవవ్రతుడిని శంతనుడికి అప్పగించింది గంగాదేవి. తండ్రి మీద అభిమానంతో తనకు రావలసిన రాజ్యాధికారాన్ని తృణప్రాయంగా వదిలేశాడు. ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు. కురుక్షేత్ర సంగ్రామంలో పదిరోజులు భీకర యుద్ధం చేసి శిఖండి కారణంగా అస్త్ర సన్యాసం చేసి, అర్జునుడి శరపరంపరకు నేలకొరిగాడు. ఉత్తరాయణ పుణ్యకాలం కోసం యాభై ఎనిమిది రోజుల పాటు అంపశయ్య మీద వేచి ఉన్నాడు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాక దేహత్యాగం చేశాడు. ధర్మ పక...

సూర్యాష్టకం

Image
 ⚜️🕉️ 🚩ఓం శ్రీ సూర్య నారాయణాయ నమః 🌹🙏 💥 సూర్యాష్టకం 💥 ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మభాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాశ్వ రధ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం లోహితం రధమారూఢం సర్వ లోక పితామహం మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం బృంహితం తేజసాం పుంజం [తేజపూజ్యం చ] వాయు మాకాశ మేవ చ ప్రభుం చ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహం బంధూక పుష్పసంకాశం హార కుండల భూషితం ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం విశ్వేశం విశ్వ కర్తారం మహాతేజః ప్రదీపనం మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం జగతాం నాధం జ్నాన విజ్నాన మోక్షదం మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనం అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్ ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్ధినే సప్త జన్మ భవేద్రోగీ జన్మ కర్మ దరిద్రతా స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్ధినే న వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం స గచ్ఛతి ఇతి శ్రీ శివప్రోక్తం శ్రీ సూర్యాష్టకం సంపూర్ణం ⚜️🕉️⚜️🕉️⚜...

💥మాఘ శుద్ధ సప్తమి.. రథసప్తమి

Image
 ⚜️🕉️🚩ఓం శ్రీ సూర్య నారాయణాయ నమః🌹🙏 💥మాఘ శుద్ధ సప్తమి.. రథసప్తమి . ఆదిదేవ! నమస్తుభ్యం - ప్రసీద మమ భాస్కర | దివాకర! నమస్తుభ్యం - ప్రభాకర నమోస్తుతే || సకల జీవకోటికి ప్రాణప్రదాత అయిన సూర్యున్ని హిందువులు ప్రత్యక్ష్య దైవంగా భావిస్తారు. సమస్త జీవజాలం సూర్యునిపైనే ఆధారపడి ఉందని ఋగ్వేదం (1-164) చెబుతోంది. వైదిక సాంప్రదాయాల్లో సూర్యుడికి విశిష్ట స్థానం కల్పించబడింది. సూర్యున్ని త్రిమూర్తి స్వరూపుడిగా భావించి.. బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం| సాయం ధ్యాయే సదా విష్ణుం త్రయీమూర్తిద్ధివాకరః|| అంటే ఉదయం బ్రహ్మ స్వరూపంగా, మధ్యాహ్నం పరమేశ్వర స్వరూపంలో, సాయంకాలం విష్ణురూపునిగా స్తుతిస్తాం. రథసప్తమి రోజున సూర్యోదయ కాలంలో పుణ్యస్నానాన్ని చేయడం, సూర్యున్ని పూజించడం చేయాలి. ఈనాటి సూర్యారాధన వలన ఎంతటి అనారోగ్యమైనా తొలగి ఆరోగ్యం చేకూరుతుందని, అకాల మరణం నివారింపబడుతుందని, సకల సంపదలు కలుగుతాయని చెప్పబడినది. 💥రథసప్తమి వ్రతాచరణలో స్నానం, దీపం, అర్ఘ్యం, ఉపచార పూజ, తర్పణం ముఖ్యమైనవి. #స్నానం: సప్తమి ముందురోజు రాత్రి అంటే షష్ఠి రోజు రాత్రి ఉపవాసం ఉండి, సప్తమి నాడు సూర్యోదయ సమయంలో స్నానాన్ని ఆచరించా...

💥జ్ఞానప్రదాత.. దత్తావధూత

Image
 ⚜️🕉️🚩ఓం శ్రీదత్తాయ నమః 🌹🙏 "అక్షరాత్‌, వరేణ్యాత్‌, ధూత సంసార బంధనాత్‌, తత్వ మస్యాది లక్ష్యత్వాత్‌, అవధూత ఇతీర్యతే" అవధూత అంటే అక్షరుడు (నాశనం లేనివాడు), వరేణ్యుడు (ఉత్తముడు), ధూతబంధనుడు (సంసార బంధనాలేవీ లేనివాడు) వేదాంత గోచరమైన తత్వమస్యాది వాక్యాలకు లక్ష్యమైన వాడని అవధూత ఉపనిషత్తు  చెబుతుంది. ఈ లక్షణాలన్నీ కలిగి బ్రహ్మ, విష్ణు,మహేశ్వరుల అంశతో త్రిమూర్తి స్వరూపంగా అవతరించిన పరబ్రహ్మ స్వరూపమే దత్తావతారం. అవధూత అంటే.. పూర్తిగా దేహధ్యాస లేనివారు. లౌకిక ప్రపంచం, బంధాలు, బంధుత్వాలు పట్టనివారు. వారు ఎక్కడా నిలవరు. ఆవు పాలు పితికినంత సేపే వారు ఒకచోట ఉంటారు. 💥జ్ఞానప్రదాత.. దత్తావధూత మహా తపస్సంపన్నుడు అత్రి మహర్షికీ, పతివ్రతా శిరోమణి అనసూయాదేవికి కలిగిన పుణ్య సంతానమే దత్తాత్రేయ స్వామి. సత్వ, రజో, తమో గుణాలు లేనివాడు అ‘త్రి’ మహర్షి. న+ అసూయ అసూయా గుణం లేని, మరోవిధంగా చెబితే మాయను వదిలిన తత్వం గలది అనసూయా మాత. అందుకే త్రిగుణాతీతుడై మాయారహితుడైన అవధూత స్వరూపంగా దత్తాత్రేయుడు ఉద్భవించాడు.  అత్రి తనయుడు కనుక ఆత్రేయుడు, తనకు తానుగా దత్తమయినాడు (తల్లిదండ్రులకు ఇవ్వబడినాడు) కాబట్టి దత...

💥సరస్వతీ స్తోత్రం

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ సరస్వత్యై నమః 🌹🙏 💥 సరస్వతీ స్తోత్రం 💥 యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా । యా బ్రహ్మాచ్యుత శంకరప్రభృతిభిర్దేవైస్సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా ॥ 1 ॥ దోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణినిభై రక్షమాలాందధానా హస్తేనైకేన పద్మం సితమపిచ శుకం పుస్తకం చాపరేణ । భాసా కుందేందుశంఖస్ఫటికమణినిభా భాసమానాzసమానా సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా ॥ 2 ॥ సురాసురైస్సేవితపాదపంకజా కరే విరాజత్కమనీయపుస్తకా । విరించిపత్నీ కమలాసనస్థితా సరస్వతీ నృత్యతు వాచి మే సదా ॥ 3 ॥ సరస్వతీ సరసిజకేసరప్రభా తపస్వినీ సితకమలాసనప్రియా । ఘనస్తనీ కమలవిలోలలోచనా మనస్వినీ భవతు వరప్రసాదినీ ॥ 4 ॥ సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి । విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ॥ 5 ॥ సరస్వతి నమస్తుభ్యం సర్వదేవి నమో నమః । శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః ॥ 6 ॥ నిత్యానందే నిరాధారే నిష్కళాయై నమో నమః । విద్యాధరే విశాలాక్షి శుద్ధజ్ఞానే నమో నమః ॥ 7 ॥ శుద్ధస్ఫటికరూపాయై సూక్ష్మరూపే నమో నమః । శబ్దబ్రహ్మి చతుర్హస్తే సర్వసిద్ధ్యై నమో నమః ॥ 8 ॥ ముక్తా...

💥మాఘ శుక్ల పంచమి.. వసంతపంచమి.. శ్రీ పంచమి.

Image
 ⚜️🕉️🚩ఓం శ్రీ సరస్వత్యై నమః🌹🙏 సరస్వతీం శుక్లవర్ణాం సుస్మితాం సుమనోహరామ్‌ కోటిచంద్ర ప్రభా ముష్ట పుష్ట శ్రీయుక్త విగ్రహమ్‌ ! వహ్ని శుద్దాంశుకాధానం వీణా పుస్తక ధారిణీమ్‌ రత్న సారేంద్ర నిర్మాణ నవ భూషణ భూషితామ్‌ !! 💥 మాఘ శుక్ల పంచమి.. వసంతపంచమి.. శ్రీ పంచమి. సకల విద్యా స్వరూపిణి పరాశక్తి సరస్వతిగా ఆవిర్భవించిన తిథి. "యాదేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా’’ అంటూ దేవీ భాగవతం ప్రస్తుతించింది. మాఘ శుక్ల పంచమ్యాం విద్యారంభే దినేపి చ పూర్వేహ్ని సమయం కృత్యా తత్రాహ్న సంయుతః రుచిః॥ మాఘ శుద్ధ పంచమినాడు ప్రాతఃకాలంలో సరస్వతీదేవిని అర్చించి విద్యారంభం చేయాలని శాస్త్ర వచనం. ఈ రోజునే క్షీరసాగర మథన సందర్భంగా మహాలక్ష్మి ఆవిర్భవించిన కారణంగా "#శ్రీపంచమి"గా పేర్కొనడంతో, ఈ రోజు మహాగణపతిని, శ్రీలక్ష్మిని, శ్రీ సరస్వతిని షోడశోపచారాలతో పూజించాలి. శ్రీ సరస్వతిదేవి ప్రతిమతోపాటు, జ్ఞానానికి ప్రతీకలైన పుస్తకాలను, లేఖినులను పూజాపీఠంపై ఉంచి అర్చించాలి.  సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి | విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా || శ్రీ సరస్వతీదేవిని తెల్లని పూలతో, సుగంధ ద్రవ్యాలతో, చందనంతో, అర్చిం...

శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్య్మం – విజయుని చరిత్ర.

Image
 ⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏 దివ్యమంగళదేహాయ పీతాంబరధరాయ చ తప్త కాంచన వర్ణాయ మంగళం శ్రీహనూమతే ! భక్తరక్షణ శీలాయ జానకీ శోక హారిణే సృష్టికారణ భూతాయ మంగళం శ్రీహనూమతే !! 💥ఓం హం హనుమతే నమః💥 💥 శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్య్మం –  విజయుని చరిత్ర. శ్రీ ఆంజనేయస్వామిని అర్చించి తరించిన భక్తుల చరిత్రలను పరాశర మహర్షి , మైత్రేయునికి తెలిపాడు. అందులో "విజయుని చరిత్ర" తెలుసుకుందాం. త్రేతాయుగంలో "చంద్ర కోణం" అనే ప్రసిద్ధి చెందిన నగరం  వుంది. దాన్ని విజయుడు అనే మహారాజు పాలిస్తున్నాడు. అతడు బలశాలి, శత్రు సంహారకుడు, సమర్ధుడు. యుద్ధ విద్యలో చేయి తిరిగినవాడు. నాలుగు దిక్కులలో వున్న రాజ్యాలన్నీ జయించి స్వాధీనం చేసుకోవాలనే బలమైన కోర్కె అతనికి కలిగింది. రాజ్యాన్ని కుమారులకు అప్పగించి, పెద్ద సైన్యంతో, జైత్ర యాత్రకు బయల్దేరాడు. కొంత ప్రయాణం చేసిన తరువాత "గర్గ మహర్షి" ఆశ్రమం చేరాడు. సైన్యాన్ని దూరంగా వుంచి తానొక్కడే మహర్షిని సందర్శించాడు. భక్తీతో ఆయనకు నమస్కరించి నిలుచున్నాడు. ఆతని శ్రద్ధకు భక్తికి సంతోషించిన గార్గుడు కుశల ప్రశ్నలతో స్వాగతం పలికి ఆతిధ్యం ఇచ్చాడు. గర్గముని- రాజైన విజయుడి...

శివుడు "గంగాధరుడు" ఎలా అయ్యాడు..?

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 🌼🌺 హర హర మహాదేవ శంభో శంకర 🌺🌼 💥 శివుడు "గంగాధరుడు" ఎలా అయ్యాడు..? గంగను శిరస్సున ధరించినవాడు - శివుడు... #గంగాధరుడు. ఒకప్పుడు సగరుడనే రాజు, శ్రీరాముని పూర్వీకులలో ఒకరు...  కోసల రాజ్యాన్ని పరిపాలించేవాడు. పొరుగు ప్రాంతాలపై తన ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు అశ్వమేధ యజ్ఞం నిర్వహించాలని ఆకాంక్షించారు. ఆచారం ప్రకారం గుర్రాన్ని విడుదల చేశారు. రాజు యొక్క ఆధిపత్యాన్ని అంగీకరించే వారు గుర్రాన్ని ఆపకుండా వదిలేస్తారు, అదే సవాలు చేయాలనుకునే వారు గుర్రాన్ని పట్టుకుంటారు. అప్పుడు యాగం చేసిన రాజు సవాలు చేసేవాడితో యుద్ధం చేసి గుర్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. గుర్రాన్ని ఆపడానికి ఎవరూ సాహసించక పోగా, కొంత సేపటికి గుర్రం తప్పిపోయింది. సగర రాజు తన అరవై వేల మంది కుమారులను గుర్రాన్ని వెతకడానికి పంపాడు.  వీరు కపిల మహర్షి ఆశ్రమానికి చేరుకున్నప్పుడు, అక్కడ కట్టివేయబడిన గుర్రం కనిపించింది. నిజానికి, యజ్ఞాన్ని అంతం చేయడం కోసం ఆ గుర్రాన్ని బంధించి, నింద నుండి తప్పించుకోవడం కోసం కపిల ఆశ్రమంలో కట్టబెట్టినవాడు ఇంద్రుడు. అయితే, సగరుని కుమారులు ఈ విషయం తెలుసుకోలేదు. వారు ఋషి గుర...

⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 🌼హర హర మహాదేవ శంభో శంకర🌼

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 🌼హర హర మహాదేవ శంభో శంకర🌼

సౌర పురాణంలో "మను మహారాజు" కృత "సూర్య స్తుతి

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః 🌹🙏 ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః  హరిదశ్వస్సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్ తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తండక అంషుమాన్ 💥తాత్పర్యము: ఆదిత్యుడు జగత్‌ సృష్టికి కారకుడు. జనులు తమ విధులు నిర్వర్తించుటకు ప్రేరణ యిచ్చును. లోకోపకారం కొరకు ఆకాశమున సంచరించి వర్షముల ద్వారా జగత్తును పోషించి తన కిరణములను ప్రకాశింపజేయును. బంగారు వన్నెతో తేజరిల్లుచు అద్భుతముగా ప్రకాశించువాడు. బ్రహ్మాండములు ఉత్పత్తికి బీజమైనవాడు. చీకట్లను తొలగించుచు దివాసమయమున ప్రాణులను కార్యనిమగ్నులను గావించువాడు. శ్యామవర్ణము గల రథాశ్వములు గలవాడు. అసంఖ్యాకములైన కిరణములు గలవాడు. సప్త అను పేరు గల రథాశ్వము గల వాడు. రథమునకు ఏడు గుఱ్ఱములుగలవాడు. తేజో నిధానములైన కిరణములు గలవాడు. సర్వ సంహారకుడు. జగత్ప్రళయమునకు పిమ్మట దానిని మరల సృజించుటకై ఆవిర్భవించెడి వాడు. నిరంతరము తన కిరణములచే ప్రకాశించుచుండువాడు. 💥 సౌర పురాణంలో "మను మహారాజు" కృత "సూర్య స్తుతి " ఇది.. నమో నమో వరేణ్యాయ, వరదాయాంశు మాలినే, జ్యోతిర్మయ నమస్తుభ్యం, అనంతాయాజితాయ...

మాఘమాసం

Image
 ⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ 🌹🙏 💥 మాఘమాసం 💥 "మాఘమాసం" వస్తూనే శుభాలని, శుభకార్యాలని వెంట తెచ్చుకుని వస్తుంది. ఈ పేరు వినగానే మామిడితోరణాలు, పచ్చని పందిర్లు, పెళ్ళిళ్ళు మాత్రమే కాదు, చన్నీటి స్నానాలు, భీష్మ ఏకాదశి, శివరాత్రి జాగారాలు కూడా గుర్తొస్తాయి. సామాజిక, ఆధ్యాత్మిక శోభలను ఏకకాలంలో మన కళ్ళ ముందు ఉంచే మాఘమాసాన్ని ఆనందంగా ఆహ్వానించ్చేద్దాం. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాఘమాసంలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఒక్కసారైనా సముద్ర స్నానం చేసినా లేదా నదీ స్నానం చేసినా పాపాల నుండి విముక్తి పొంది మరణానంతరం మోక్షాన్ని పొందుతారని పురాణాలు మనకు చెపుతున్నాయి. ఈ మాసంలో ప్రయాగలో ఉన్న గంగా నదిలో వేకువ జామునే నిండా మునిగి స్నానం చేస్తే ఇక పునర్జన్మ ఉండదనేది కూడా ఒక నమ్మకం. ఈ నెలలో వచ్చే పౌర్ణమిని "మహామాఘం" అంటారు. నెలలో అన్ని రోజులు సూర్యోదయానికి ముందు స్నానం చెయ్యటానికి వీలు కుదరని వారు పౌర్ణమి నాడైనా తప్పక స్నానం చెయ్యాలంటారు. ఏ మాసంలోనైనా కొద్ది రోజులకే ప్రాధాన్యత ఉంటుంది. కాని మాఘమాసంలో ప్రతిరోజుకు ఓ ప్రత్యేకత ఉందనే చెప్పాలి. 💥తిల చతుర్థి: మాఘ శుద్ధ చతుర్థిని "కుండ చత...

💥శ్రీ శ్యామలాదేవి నవరాత్రులు💥

Image
 ⚜️🕉️🚩ఓం మాతంగ్యై నమః🌹🙏 💥శ్రీ శ్యామలాదేవి నవరాత్రులు💥 మాఘ శుద్ధ పాడ్యమి నుంచి మాఘ శుద్ధ నవమి వరకు "శ్యామలా నవరాత్రులు".. శ్యామల నవరాత్రులనే "మాతంగి నవరాత్రులు" అని కూడా అంటారు. శ్యామల సరస్వతీ రూపం జ్ఞాన స్వరూపం. ఈమెను మంత్రిణి అంటారు. అమ్మవారికి శ్యామల దేవి మంత్రి, వారాహిమాత సేనాధిపతి. శ్యామలా ఉపాసన అనేది దశమహావిద్యలలో ఒక విద్య. ఈ తల్లిని మాతంగి (మాతంగ ముని కుమార్తె), రాజా మతాంగి, రాజశ్యామల అని కూడా అంటారు. దశమహావిద్య లో ప్రధానంగా శ్రీ విద్యను ఉపాసిస్తే తర్వాత అంత ప్రసిద్ధిగా చెప్పుకునేది మాతాంగి శ్యామలా ఉపాసన. ఈ ఉపాసన వామాచారం, దక్షణాచారం రెండు పద్ధతులలో ఆరాధిస్తారు. ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో ఈ దశమహావిద్య సాధన మహా ప్రసిద్ధి. ఈ పది విద్యలలో ఏది ఉపాసించిన మిగతా తొమిది విద్యలు అందులో కలిసి ఉంటాయి.. కనుక దశమహావిద్యలలో ఒక్క విద్య సాధన చేసిన మిగిలిన అన్నిటిలో ఉపాసన విధి తెలిసిపోతుంది. త్వరగా సిద్ధిస్తుంది. అయితే ఈ దశమహావిద్యల్లో శ్రీవిద్య ప్రధానంగా శంకరులు వారు వ్యాప్తిలోకి తెచ్చారు. దానికి కారణం శ్రీ విద్యలో బ్రహ్మజ్ఞాన తత్వం గురించి ఉంటుంది. ముఖ్యంగా తాంత్రిక ఉప...

💥శ్రీ మహాలక్ష్మ్యష్టకం💥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః 🌹🙏 💥క్షీరాబ్ధి పుత్రికగా అవతరించిన లక్ష్మీదేవి... డోలాసురుడనే రాక్షసుణ్ణి సంహరించిందనీ పురాణాలు చెబుతున్నాయి. రెండు చేతులలో కమలాలు ధరించి, అభయ, వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా... భక్తుల అభీష్టాలను తీర్చే మహాలక్ష్మి సర్వ మంగళకారిణి. లోక స్థితికారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్ముల సమష్టి రూపమైన మహాలక్ష్మీదేవినీ పూజిస్తే... ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి కలుగుతుందనీ, సుఖ సంతోషాలు చేకూరుతాయనీ, దారిద్య్రం, దుఃఖాలు తొలగిపోయి సకల శుభాలూ కలుగుతాయనీ భక్తుల నమ్మిక. 💥 శ్రీ మహాలక్ష్మ్యష్టకం 💥 ఇంద్ర ఉవాచ - నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే । శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 1 ॥ నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి । సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 2 ॥ సర్వజ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి । సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 3 ॥ సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని । మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 4 ॥ ఆద్యంత రహితే దేవి ఆ...

⚜️🕉️🚩ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః🌹🙏

Image
 ⚜️🕉️🚩ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః🌹🙏

💥ఉగ్రనారసింహుని అవతారతత్త్వం!

Image
 ⚜️🕉️🚩ఓం లక్ష్మీనృసింహాయ నమః🌹🙏 💥 ఉగ్రనారసింహుని అవతారతత్త్వం ! రామకృష్ణాది అవతారముల వలె గాక, నిర్యాణములేని శాశ్వత అవతారము శ్రీ నరసింహ అవతారం. నారసింహుని పూజలతో, అకాల మృత్యు భయముండదని, దుష్టగ్రహ బాధలు, పైశాచిక చేతబడుల ప్రయోగాలను తిప్పికొట్టే శక్తి నారసింహ మంత్రానికి గలదని భక్తుల, సాంప్రదాయాచరణాసక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం! నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం!! 💥పగలు రాత్రి కాని సంధ్యా సమయాన, నరుడు జంతువు కాని రూపంతో, భూమ్యాకాశాలు కాని తొడలపై, సజీవము నిర్జీవమూకాని చేతిగోళ్ళతో, హరణ్య కశిపుని చీల్చి భక్త జన రక్షకుడై, సుదర్శన, శంఖ, చక్ర, ఖడ్గ, అంకుశ, పాశు, పరశు, ముసల, కులిశ, పద్మాదులను కలిగి గదాధరుడై ప్రకాశించిన ఉగ్రనారసింహ అవతార తత్వం మిగతా అవతారాలకు భిన్నమైనది. భగవంతుని అవతారాలలో అత్యద్భుత అవతారం నారసింహావతారం. సగం మనిషి సగం మృగం ఆకారంలో రూపు దాల్చ డం ఈ అవతార ప్రత్యేకత. దుష్టశిక్షణ శిష్ట రక్షణ, సర్వాంతర్యామిత్వం, భక్తుని మాటను నిజం చేయడం... నమ్మినబంటును శాప విముక్తుని గావించడం, ఎన్ని నియంత్రణలు, వరాలున్నా వాటిని అధిగమించి భక్తుడు లేక వ...

ఓం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః 🌹🙏 💥శ్రీ కార్తికేయునికి  గల 28 నామములు: 1) యోగీశ్వరః – యోగీశ్వరులకు అధిపతి 2) మహాసేనః – దేవసైన్యానికి అధిపతి, దేవసేనాపతి 3) కార్తికేయః – ఆరు కృత్తికా నక్షత్రములచే పోషింపబడిన వాడు 4) అగ్నినన్దనః – పరమశివుని జ్ఞానాగ్ని నుంచి ఉద్భవించినవాడు మరియు పరమశివుని తేజస్సు కొంత సేపు భరించినందువల్ల, అగ్ని దేవునికి కూడా తనయుడిగా పిలువబడినవాడు. 5) స్కందః – పరమశివుని తేజస్సు నుండి జన్మించినవాడు 6) కుమారః – కుమార అన్న నామం కేవలం సుబ్రహ్మణ్యునికే చెందినది. ఎందుకంటే, జగత్తుకి మాతా పితలు అయిన పార్వతీ పరమేశ్వరుల అన్యోన్యతకి ఫలం మన బుజ్జి సుబ్రహ్మణ్యుడు. 7) సేనానీః – దేవసేనలకు అధిపతి, దేవసేనాధ్యుక్షుడు. 8) స్వామీ శంకరసంభవః – శంకరుని దివ్యమైన తేజస్సు నుండి పుట్టినవాడు. 9)  గాంగేయః – పరమశివుని తేజస్సు అగ్నిదేవుడు భరించలేక, గంగా మాతకి ఇచ్చేస్తే, గంగా మాత కొంత సేపు శివుని తేజస్సును భరిస్తుంది. అందువల్ల, గంగా మాతకి కూడా పుత్రునిగా పిలబడ్డవాడు కాబట్టి గాంగేయ అనే నామం వచ్చింది. 10) తామ్రచూడః – కుక్కుటమును అధిరోహించిన వాడు. 11) బ్రహ్మ...