💥శ్రీ శ్యామలాదేవి నవరాత్రులు💥
⚜️🕉️🚩ఓం మాతంగ్యై నమః🌹🙏
💥శ్రీ శ్యామలాదేవి నవరాత్రులు💥
మాఘ శుద్ధ పాడ్యమి నుంచి మాఘ శుద్ధ నవమి వరకు "శ్యామలా నవరాత్రులు".. శ్యామల నవరాత్రులనే "మాతంగి నవరాత్రులు" అని కూడా అంటారు.
శ్యామల సరస్వతీ రూపం జ్ఞాన స్వరూపం. ఈమెను మంత్రిణి అంటారు. అమ్మవారికి శ్యామల దేవి మంత్రి, వారాహిమాత సేనాధిపతి.
శ్యామలా ఉపాసన అనేది దశమహావిద్యలలో ఒక విద్య. ఈ తల్లిని మాతంగి (మాతంగ ముని కుమార్తె), రాజా మతాంగి, రాజశ్యామల అని కూడా అంటారు.
దశమహావిద్య లో ప్రధానంగా శ్రీ విద్యను ఉపాసిస్తే తర్వాత అంత ప్రసిద్ధిగా చెప్పుకునేది మాతాంగి శ్యామలా ఉపాసన.
ఈ ఉపాసన వామాచారం, దక్షణాచారం రెండు పద్ధతులలో ఆరాధిస్తారు.
ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో ఈ దశమహావిద్య సాధన మహా ప్రసిద్ధి. ఈ పది విద్యలలో ఏది ఉపాసించిన మిగతా తొమిది విద్యలు అందులో కలిసి ఉంటాయి.. కనుక దశమహావిద్యలలో ఒక్క విద్య సాధన చేసిన మిగిలిన అన్నిటిలో ఉపాసన విధి తెలిసిపోతుంది. త్వరగా సిద్ధిస్తుంది.
అయితే ఈ దశమహావిద్యల్లో శ్రీవిద్య ప్రధానంగా శంకరులు వారు వ్యాప్తిలోకి తెచ్చారు. దానికి కారణం శ్రీ విద్యలో బ్రహ్మజ్ఞాన తత్వం గురించి ఉంటుంది.
ముఖ్యంగా తాంత్రిక ఉపాసకులు ఈ శ్యామలా నవరాత్రులని విశేషంగా జరుపుకుంటారు.
విశుక్రుడు అనే రాక్షసుడిని సంహరించిన దేవతలలో వారాహి, శ్యామల రూపాలు ప్రధానమైనవిగా లలితా నామ వివరణలో తెలుసుకున్నాము. ఇంకా అనేక సందర్భాలలో శ్యామలా దేవి గురించి సహస్త్ర నామంలో ప్రస్తావించబడినది.
అమ్మవారి కుడివైపు శ్యామలా దేవి, ఎడమవైపు వారాహి దేవి ఉంటారు.
అమ్మవారు ఆమె అనామిక ఉంగరమును రాజముద్రగా శ్యామలా దేవికి అలంకరించి ఆమెను ప్రతినిధిగా రాజ్య భారమంతా అప్పగించింది. అందుకే "రాజశ్యామల" అంటారు.
శ్యామలా దేవిని ఉపాసించిన వారు విద్యలో రాణిస్తారు. కోల్పోయిన పదవులు, కొత్త పదవులు, ఉద్యోగాలు పొందుతారు. త్వరగా మంత్ర సిద్ధి పొందడానికి ఏదైనా చెడు ప్రయోగాల నుండి రక్షించడానికి, ఈ తల్లి ఉపాసన ప్రసిద్దిగా చేస్తారు.
💥శ్యామల నవరాత్రులు - 2024:💥
1) మొదటిరోజు మాఘ శుక్ల పాడ్యమి Feb.10వ తేదీ శనివారం "లఘు శ్యామలాదేవి" రూపంలో పూజిస్తారు.
2) రెండవ రోజు శుక్ల విదియ ఫిబ్రవరి 11 ఆదివారం నాడు అమ్మవారిని "వాగ్వాదిని శ్యామలాదేవి" రూపంలో పూజిస్తారు.
3) మూడవరోజు శుక్ల తదియ ఫిబ్రవరి 12 సోమవారం నాడు అమ్మవారిని "నకుల శ్యామలాదేవి" రూపంలో పూజిస్తారు.
4) నాలుగవ రోజు శుక్ల చవితి ఫిబ్రవరి 13 మంగళవారం నాడు అమ్మవారిని "హాసంతి శ్యామలాదేవి" రూపంలో పూజిస్తారు.
5) 5వ రోజు శుక్ల పంచమి ఫిబ్రవరి 14 బుధవారం నాడు అమ్మవారిని "సర్వసిద్ధి మాతంగి" రూపంలో పూజిస్తారు.
6) ఆరవ రోజు శుక్ల షష్టి ఫిబ్రవరి 15 గురువారం నాడు అమ్మవారిని "వాస్య మాతంగి" రూపంలో పూజిస్తారు.
7) ఏడవ రోజు శుక్ల సప్తమి ఫిబ్రవరి 16 శుక్రవారం నాడు అమ్మవారిని "సారికా శ్యామలాదేవి" రూపంలో పూజిస్తారు.
8) 8వ రోజు శుక్ల అష్టమి ఫిబ్రవరి 17 శనివారం నాడు అమ్మవారిని "శుక శ్యామలాదేవి" రూపంలో పూజిస్తారు.
9) 9వ రోజు శుక్ల నవమి ఫిబ్రవరి 18 ఆదివారం నాడు అమ్మవారిని "రాజమాతంగి" లేదా "రాజశ్యామలాదేవి" రూపంలో పూజిస్తారు.
💥శ్రీ శ్యామలా స్తుతి💥
మాణిక్యవీణా ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసం |
మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగకన్యాం మనసాస్మరామి || 1 ||
చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగాశోణే |
పుండ్రీక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేక మాతః || 2 ||
మాతా మరకతశ్యామ మాతంగి మధుశాలినీ
కుర్యాత్కటాక్షం కళ్యాణీ కడంబవనవాసినీ |
జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే
జయ సంగీతరసికే జయ లీలా శుక ప్రియే || 3 ||
శ్రీ స్స్వయం సర్వతీర్దాత్మికే సర్వామంత్రాత్మికే
సర్వతంత్రాత్మికే సర్వాముద్రాత్మికే |
సర్వశక్త్యాత్మికే సర్వ వర్ణాత్మికే సర్వరూపే జగన్మాతృకే
పాహిమాం పాహిమాం పాహి || 4 ||
ఇతి శ్రీ శ్యామలా స్తుతి సంపూర్ణం ||
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️

Comments
Post a Comment