మాఘమాసం

 ⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ 🌹🙏


💥మాఘమాసం💥


"మాఘమాసం" వస్తూనే శుభాలని, శుభకార్యాలని వెంట తెచ్చుకుని వస్తుంది.

ఈ పేరు వినగానే మామిడితోరణాలు, పచ్చని పందిర్లు, పెళ్ళిళ్ళు మాత్రమే కాదు, చన్నీటి స్నానాలు, భీష్మ ఏకాదశి, శివరాత్రి జాగారాలు కూడా గుర్తొస్తాయి.


సామాజిక, ఆధ్యాత్మిక శోభలను ఏకకాలంలో మన కళ్ళ ముందు ఉంచే మాఘమాసాన్ని ఆనందంగా ఆహ్వానించ్చేద్దాం.


ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాఘమాసంలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఒక్కసారైనా సముద్ర స్నానం చేసినా లేదా నదీ స్నానం చేసినా పాపాల నుండి విముక్తి పొంది మరణానంతరం మోక్షాన్ని పొందుతారని పురాణాలు మనకు చెపుతున్నాయి.


ఈ మాసంలో ప్రయాగలో ఉన్న గంగా నదిలో వేకువ జామునే నిండా మునిగి స్నానం చేస్తే ఇక పునర్జన్మ ఉండదనేది కూడా ఒక నమ్మకం.


ఈ నెలలో వచ్చే పౌర్ణమిని "మహామాఘం" అంటారు.

నెలలో అన్ని రోజులు సూర్యోదయానికి ముందు స్నానం చెయ్యటానికి వీలు కుదరని వారు పౌర్ణమి నాడైనా తప్పక స్నానం చెయ్యాలంటారు.


ఏ మాసంలోనైనా కొద్ది రోజులకే ప్రాధాన్యత ఉంటుంది. కాని మాఘమాసంలో ప్రతిరోజుకు ఓ ప్రత్యేకత ఉందనే చెప్పాలి.


💥తిల చతుర్థి:


మాఘ శుద్ధ చతుర్థిని "కుండ చతుర్థి" అని అంటారు. దీనికే తిల చతుర్థి అని కూడా పేరు. తిల అంటే నువ్వులు కదా! ఈ రోజు తప్పకుండా నువ్వులు తింటారు చాలామంది. నువ్వుల ఉండలను పంచిపెడతారు. నువ్వులను దానం ఇచ్చినా కూడా మంచిదట.


💥శ్రీ పంచమి:


మాఘ శుద్ధ పంచమి అంటే "శ్రీ పంచమి" లేదా "వసంత పంచమికి ఎంతో విశిష్టత ఉంది. ఈ పంచమి నాడే చదువుల తల్లి సరస్వతిదేవి జన్మించిందట. అందుకే ఈ రోజున అక్షరాభ్యాసం చేసిన పిల్లలకి చదువులో తిరుగులేదని అంటారు మన పెద్దవాళ్ళు.


💥రథసప్తమి:


మనకి ప్రత్యక్ష దైవమై రోజు దర్శనమిచ్చే సూర్యభగవానుడు తన రథాన్ని ఎక్కి పయనం ప్రారంభించిన రోజే ఈ రథసప్తమి.


చాలా మంది చిక్కుడు కాయలతో రథాన్ని చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి,చిక్కుడు ఆకులలో పెట్టి సూర్యుడికి నైవేద్యంగా పెడతారు. ఇలా చేస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయని ఓ నమ్మకం.


💥భీష్మ ఏకాదశి:


అంపశయ్యపై ఉన్న భీష్ముడికి తను ఎప్పుడు కోరుకుంటే అప్పుడే మరణించే వరం ఉన్నందువల్ల మాఘ శుద్ధ ఏకాదశి రోజు తనువు చాలించాడు. అలా మరణించే ముందు కృష్ణుడిని స్తుతిస్తూ చేసిన పారాయణే ఈ విష్ణు సహస్ర నామ పారాయణ.


ఉదయం నుండి ఉపవాసం ఉండి సాయంత్రం విష్ణు సహస్రనామస్తోత్రం పారాయణ చేస్తే పుణ్యం లభిస్తుందని ప్రతీతి.


💥బహుళ ఏకాదశి:


దీనినే "విజయ ఏకాదశి" అని కూడా అంటారు. లంకను చేరటానికి శ్రీరామ చంద్రుడు సేతు నిర్మాణం పూర్తి చేసిన రోజు ఈ రోజేనట. అందుకే ఈ రోజు ఎవరు ఏ పని మొదలుపెట్టినా తప్పక విజయం లభిస్తుందని పురాణాలు చెపుతున్నాయి.


💥మహా శివరాత్రి:


హాలాహలం సేవించిన శివుని కోసం నిద్రాహారాలు మాని భక్తులందరూ తపించిన రోజు. పగలంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి పుణ్యం సంపాదించుకునే భక్తులకి ఇదొక గొప్ప పర్వదినం.


💥ఇలా నెలలో ప్రతీ రోజుకి ఒక ప్రత్యేకతని సంతరించుకున్న మాఘ మాసానికి స్వాగతం పలుకుదాం.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు