కొలిచే వారికి కొంగుబంగారం వెూపిదేవి సుబ్రహ్మణ్యస్వామి..
⚜️🕉️🚩ఓం సుబ్రహ్మణ్యాయ నమః🌹🙏
💥కొలిచే వారికి కొంగుబంగారం వెూపిదేవి సుబ్రహ్మణ్యస్వామి..
కొలిచే వారికి కొంగు బంగారం, కోరిన వారికి కోరికలు తీర్చే మహిమాన్వితుడు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి.
దివ్యమైన దివిసీమలో వేంచేసి యున్న మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం పరమ పవిత్రమైన స్థలం.
పరమ పవిత్రమైన ప్రాచీనమైన మోపిదేవి ఆలయంలో పరమేశ్వరుడు, ఆయన కుమారుడైన కుమారస్వామి ఒకే చోట కొలువై ఉన్నారు.
మోపిదేవి సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రం ప్రస్తావన స్కంద పురాణంలో కూడా కనిపిస్తుంది. ఈ స్వామిని కొలిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని, వివాహం కాని వారికి వివాహం జరుగుతుందని తరతరాలుగా భక్తుల నమ్మకం.
💥#స్థల_పురాణం:
దేవతల వినతి మేరకు మేరుపర్వతం గర్వమణచే ఘట్టంలో భాగంగా అగస్త్య మహర్షి కాశీ పట్టణాన్ని వీడి దక్షిణ భారతదేశం పర్యటనకు బయలుదేరారట.
ఆ క్రమంలోనే అగస్త్య మహర్షి కృష్ణానదీ తీరంలో ఉన్న ప్రస్తుతం మోపిదేవి పేరు.. పూర్వం మోహినీపురం. అక్కడకు చేరి సేద తీరుతుండగా జాతి వైరాన్ని మరిచి పాము, ముంగిస, నెమలి ఒకే చోట ఆడుకొంటూ కనిపించాయి.
అటుపక్కనే దివ్యతేజస్సు విర జిమ్ముతూ ఒక పుట్ట కూడా ఆకర్షించింది. దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ కార్తికేయుడు సర్ప రూపంలో తపస్సు చేసుకుంటూ కని పించాడు.
పుట్ట నుంచి దివ్య తేజస్సు వెలువడటాన్ని గమనించిన ఆ మహాముని ఈ దివ్యతేజస్సును సాధారణ మానవులు భరించలేరని తన జ్ఞానదృష్టితో గ్రహించిన అగస్త్య మహర్షి ఆ పుట్టపైన ఓ శివలింగాన్ని ప్రతిష్టించి పూజాధికాలు నిర్వహించటం జరిగింది.
ఈ విషయం తెలుసుకొన్న దేవతలందరూ ఇక్కడకు చేరుకొని స్వామి వారిని దర్శించి తరించారట.
ఇది జరిగిన కొన్ని రోజులకు పుట్టలో ఉన్న కార్తికేయుడు "వీరారపు పర్వతాలు" అనే స్థానిక కుమ్మరి భక్తుడికి కలలో కనిపించి తనకు ఆలయాన్ని నిర్మించాల్సిందిగా ఆదేశించాడు.
ఆయన ఈ విషయాన్ని గ్రామ పెద్దలకు తెలియజేసి అక్కడ ఆలయాన్ని నిర్మించి అక్కడ షణ్ముఖుడి రూపంలో విగ్రహాన్ని ప్రతిష్టించి నట్లు చరిత్ర వలన తెలుస్తోంది.
💥తూర్పుదిశగా వుండే ఈ ఆలయ గర్భగుడిలో సర్పాల చుట్టపై శివుడు లింగ రూపంలో ఉన్నారు. ఈ సర్పాల చుట్టనే పానవట్టం అని పిలుస్తారు.
అయితే కార్తికేయుడే శివలింగం రూపంలో వెలిశాడన్న మరో నమ్మకం కూడా ఉంది.
పానవట్టం కింద ఉన్న రంధ్రం ద్వారానే అర్చకులు పాలతో కార్తికేయుడిని అభిషేకిస్తారు. ఈ గర్భగుడిలో దేవతా సర్పం రూపంలో స్వామి వారు సంచరిస్తారని భక్తుల విశ్వాసం.
ఈ పుట్ట మట్టిని పుట్ట బంగారంగా భావిస్తూ దాన్ని చెవుల తమ్మిలకు అద్దుకుంటారు. ఇలా ధరించడం వలన కోర్కెలు తీరటంతో పాటు ఏవిధమైన పీడలు, వ్యాధులు దరికి రావని, పైగా సకల శుభాలు కలుగుతాయని భక్తుల అచంచల విశ్వాసం.
సేకరణ... 💐🙏

Comments
Post a Comment