💥మాఘ శుద్ధ అష్టమి.. భీష్మాష్టమి

 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏


💥మాఘ శుద్ధ అష్టమి.. భీష్మాష్టమి


రధసప్తమి తరువాత వచ్చే రోజునే "భీష్మ అష్టమి" గా పిలుస్తారు. ఎందుకంటే ఇచ్ఛామరణ వరం ఉన్న భీష్ముడు ఉత్తరాయణం వచ్చాక ప్రాణాలు విడిచిపెట్టాడు. ఆయన కన్నుమూసిన మాఘ శుద్ధ అష్టమిని.. భీష్మాష్టమి పర్వంగా పేర్కొన్నారు.


దేవతా గణాల్లో "అష్టవసువుల" పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. వీరిలో ఎనిమదో వసువు పేరు ప్రభాసుడు. ఈ ప్రభాసుడే భీష్ముడిగా జన్మించాడు.


గంగాదేవి, శంతన మహారాజు ఎనిమిదో సంతానంగా పుట్టిన ప్రభాసుడికి "దేవవ్రతుడు" అని పేరు పెట్టారు.


పదహారేండ్ల పాటు గంగాదేవి దగ్గర పెరిగాడు. సకల విద్యలు అభ్యసించిన దేవవ్రతుడిని శంతనుడికి అప్పగించింది గంగాదేవి.


తండ్రి మీద అభిమానంతో తనకు రావలసిన రాజ్యాధికారాన్ని తృణప్రాయంగా వదిలేశాడు. ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు.


కురుక్షేత్ర సంగ్రామంలో పదిరోజులు భీకర యుద్ధం చేసి శిఖండి కారణంగా అస్త్ర సన్యాసం చేసి, అర్జునుడి శరపరంపరకు నేలకొరిగాడు.


ఉత్తరాయణ పుణ్యకాలం కోసం యాభై ఎనిమిది రోజుల పాటు అంపశయ్య మీద వేచి ఉన్నాడు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాక దేహత్యాగం చేశాడు.


ధర్మ పక్షపాతిగా ముద్రపడిన భీష్ముడు పాండవులకు బోధించిన సూత్రాలు.. సర్వకాలాలకూ ఆచరణ యోగ్యాలు.


భీష్మ పితామహుని తలుచుకుంటూ మనిషిగా పుట్టిన ప్రతి వారు నీటిని తర్పణగా విడువమని చెప్పింది శాస్త్రం.

తల్లిదండ్రులు ఉన్నవారైనా సరే తర్పణ విడువడమే కర్తవ్యమ్.


💥తర్పణ ఇచ్చేటప్పుడు ఇలా చదువుతూ ఇవ్వమని చెప్పింది శాస్త్రం..


1) భీష్మః శాన్తనవో వీరః: సత్యవాది జితేంద్రియః!

ఆభిరద్భిరవాప్నోతు పుత్ర పౌత్రోచితాం క్రియామ్!!

(దోసిట్లో నీళ్ళు విడిచిపెట్టాలి)


2) వైయాఘ్ర పద గోత్రాయ సాంకృత్య ప్రవరాయచ!

అపుత్రాయ దదామ్యేతత్ జలం భీష్మాయ వర్మణే!!

(దోసిట్లో నీళ్ళు విడిచిపెట్టాలి)


3) వసూనామవతారాయ శంతనోరాత్మజాయచ!

అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే!!

(దోసిట్లో నీళ్ళు విడిచిపెట్టాలి)


అనేన భీశం అర్ఘ్యప్రదానేన సర్వాత్మకో భగవాన్ శ్రీ హరి జనార్దనః ప్రీయతాం – ఓం తత్ సత్!!


#తర్పణం_ఫలితం:


సశాస్త్రీయంగా ఎవరైతే భీష్మునికి తర్పణం విడిచి పెడతారో వారికి ఎటువంటి దోషములు వున్నా అన్నీ తొలగిపోయి చక్కని సంతానం కలుగుతుంది అని శాస్త్రప్రమాణం.


ధర్మరాజుకు విష్ణు సహస్ర నామాలు ఉపదేశించిన ఈ పురాణ పురుషుడి అనుగ్రహం కోసం భీష్మాష్టమి సందర్భంగా ఉపవాసం, జాగారం చేసే ఆచారం ఉంది. 


విష్ణుమూర్తిని తామర పూలు, తులసి దళాలు, జాజిమాలతో అలంకరించాలి. విష్ణు అష్టోత్తరం, నారాయణ కవచం, నారాయణ హృదయం, విష్ణు సహస్రనామాలు, విష్ణు పురాణం వంటి విష్ణు సంబంధిత పారాయణాలు చేయాలి.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు