ఓం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః 🌹🙏

 ⚜️🕉️🚩 ఓం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః 🌹🙏


💥శ్రీ కార్తికేయునికి  గల 28 నామములు:


1) యోగీశ్వరః – యోగీశ్వరులకు అధిపతి


2) మహాసేనః – దేవసైన్యానికి అధిపతి, దేవసేనాపతి


3) కార్తికేయః – ఆరు కృత్తికా నక్షత్రములచే పోషింపబడిన వాడు


4) అగ్నినన్దనః – పరమశివుని జ్ఞానాగ్ని నుంచి ఉద్భవించినవాడు మరియు పరమశివుని తేజస్సు కొంత సేపు భరించినందువల్ల, అగ్ని దేవునికి కూడా తనయుడిగా పిలువబడినవాడు.


5) స్కందః – పరమశివుని తేజస్సు నుండి జన్మించినవాడు


6) కుమారః – కుమార అన్న నామం కేవలం సుబ్రహ్మణ్యునికే చెందినది. ఎందుకంటే, జగత్తుకి మాతా పితలు అయిన పార్వతీ పరమేశ్వరుల అన్యోన్యతకి ఫలం మన బుజ్జి సుబ్రహ్మణ్యుడు.


7) సేనానీః – దేవసేనలకు అధిపతి, దేవసేనాధ్యుక్షుడు.


8) స్వామీ శంకరసంభవః – శంకరుని దివ్యమైన తేజస్సు నుండి పుట్టినవాడు.


9)  గాంగేయః – పరమశివుని తేజస్సు అగ్నిదేవుడు భరించలేక, గంగా మాతకి ఇచ్చేస్తే, గంగా మాత కొంత సేపు శివుని తేజస్సును భరిస్తుంది. అందువల్ల, గంగా మాతకి కూడా పుత్రునిగా పిలబడ్డవాడు కాబట్టి గాంగేయ అనే నామం వచ్చింది.


10) తామ్రచూడః – కుక్కుటమును అధిరోహించిన వాడు.


11) బ్రహ్మచారీ – ఎల్లప్పుడూ బ్రహ్మనందు రమించువాడు.


12) శిఖిధ్వజః – అగ్ని ధ్వజముగా కలవాడు


13) తారకారిః – తారకాసురడనే రాక్షస సంహారము చేయుటకు అవతారం దాల్చిన వాడు, తారకాసురుడిని, ఇతర రాక్షస గణములను సంహరించి దేవతలను రక్షించినవాడు.


14) ఉమాపుత్రః – ఉమాదేవి, అంటే పార్వతీ అమ్మ వారి ముద్దుల తనయుడు. అందుకే సుబ్రహ్మణ్య స్వామి వారు అచ్చం అమ్మవారి లానే ఉంటారు.


15) క్రౌంచారిః – పర్వత రూపములో ఉన్న క్రౌంచ అనే రాక్షసుడిని సంహరించినవాడు.


16)  షడాననః – ఆరు ముఖములు గలవాడు.


17) శబ్దబ్రహ్మసముద్రః – జ్ఞాన స్వరూపుడు, అంటే వేదములు ఏ పరబ్రహ్మ స్వరూపమును గురించి ఘోషిస్తున్నాయో,  ఆ వేద శబ్దములచే ప్రతిపాదించబడిన వాడు.


18)   సిద్ధః – పరిపూర్ణ సిద్ధ స్వరూపుడు


19)  సారస్వతః – సరస్వతీ స్వరూపము, అంటే జ్ఞాన స్వరూపము.


20)  గుహః – సకలజీవుల హృదయ గుహలో కొలువై ఉన్నవాడు.


21) భగవాన్ సనత్కుమారః – చతుర్ముఖ బ్రహ్మ గారి నలుగురు మానస పుత్రులలో ఒకరైన సనత్కుమారుడే సుబ్రహ్మణ్యుడిగా వచ్చారు. ఈ విషయమే, త్రిపురా రహస్యంలో మాహాత్మ్యఖండంలో వివరించబడినదని, శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నిర్ధారించారు.


22) భోగమోక్షఫలప్రదః – ఈ భూమి మీద మనం సుఖంగా జీవించడానికి అవసరమైన సంపదతో పాటు అంత్యమునందు మోక్షమును కూడా ఇవ్వగలిగినవాడు.


23) శరజన్మా – శరవణతటాకము (రెల్లు పొదల) నుండి జన్మించినవాడు.


24) గణాధీశః – సకల దేవతలకు, గణములకు అధిపతి అయిన వాడు.


25)  పూర్వజః – అందరికన్నా ముందున్నవాడు, అంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు, కేవలం ఒక అవతారం మాత్రమే కాదు, ఎప్పుడూ ఉండే పరబ్రహ్మ స్వరూపం. ఆయన ఎప్పుడూ ఉన్నవాడు, పుట్టుక లేనివాడు.


26) ముక్తిమార్గకృత్ – ముక్తి మార్గమును బోధించే గురు స్వరూపం. అంత్యమున ముక్తిని ప్రసాదించి, తనలో కలుపుకునే స్వామి.


27) సర్వాగమప్రణేతా – సకల ఆగమములకు మూలము.


28)  వాంచితార్ధప్రదర్శనః – అభీష్టములను నెరవేర్చే తండ్రి.


💥II స్కంద ఉవాచ II💥


యోగీశ్వరో మహాసేనః కార్తికేయోಽగ్నినన్దనః I

స్కందః కుమారః సేనానీః స్వామీ శఙ్కరసమ్భవః II 1 II


గాంగేయస్తామ్రచూడశ్చ బ్రహ్మచారీ శిఖిధ్వజః I

తారకారిః ఉమాపుత్రః క్రౌంచారిశ్చ షడాననః II 2 II


శబ్దబ్రహ్మసముద్రశ్చ సిద్ధః సారస్వతో గుహః I

సనత్కుమారో భగవాన్ భోగమోక్షఫలప్రదః II 3 II


శరజన్మా గణాధీశః పూర్వజో ముక్తిమార్గకృత్ I

సర్వాగమప్రణేతా చ వాంఛితార్థప్రదర్శనః II 4 II


అష్టావింశతినామాని మదీయానీతి యః పఠేత్ I

ప్రత్యూషే శ్రద్ధయా యుక్తో వాచస్పతిర్భవేత్ II 5 II


మహామన్త్ర మయానీతి మమ నామానుకీర్తనమ్ I

మహాప్రజ్ఞామవాప్నోతి నాత్ర కారా విచారణా II 6 II  

 

II ఇతి శ్రీరుద్రయమలే ప్రజ్ఞావివర్ధన శ్రీకార్తికేయస్తోత్రం సంపూర్ణం II


💥ఈ "ప్రజ్ఞావివర్ధన కార్తికేయ స్తోత్రము" రుద్రయమల తంత్రములోనిది. ఎవరైతే ఈ 28 నామములు ప్రతీ దినం ప్రాతః కాలం భక్తి శ్రద్ధలతో చదువుతారో, వారు చక్కని తెలివితేటలు, మంచి వాక్కు మరియు  జ్ఞానమును పొందుతారు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు