తిరుమలలో వైభ‌వంగా ర‌థ‌స‌ప్త‌మి వేడుక‌లు.. సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడు.

 ⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ🌹🙏


💥తిరుమలలో వైభ‌వంగా ర‌థ‌స‌ప్త‌మి వేడుక‌లు.. సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడు..


ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమినాడు ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడి జన్మదినాన్ని పురష్కరించుకుని రథ సప్తమి వేడుకలను టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహిస్తుంది.


రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో క్రీ.శ 1564 నుండి జరుపుతున్నట్లుగా శాసనాధారాలు ఉన్నాయి.


సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు మలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు.


రథసప్తమి సందర్భంగా తేజో నిధి, సకల రోగ నివారకుడు, ప్రకృతి చైతన్య ప్రదాత అయిన సూర్యుని వాహనంగా అధిరోహించి తిరుమలలో శ్రీ మలయప్ప స్వామి భక్తులను కటాక్షించారు.


తిరుమాఢ వీధుల్లో విహరిస్తున్న మలయప్ప స్వామి వారిని దర్శించుకునేందుకు అశేష సంఖ్యలో భక్తులు తిరుమాడ వీధులు చేరుకుని గోవిందుడికి మంగళ హారతులు పలికారు.


💥సూర్యప్ర‌భ వాహ‌నం..


రథసప్తమి వాహనసేవల్లో అత్యంత ప్రధానమైనది సూర్యప్రభవాహనం.


ఉద‌యం 5.30 గంట‌ల‌కు సూర్యప్రభ వాహన‌సేవ ప్రారంభమయి.. అక్కడ నుండి ఆలయ వాయువ్య దిక్కుకు చేరుకోగానే సూర్యోద‌యాన భానుడి తొలికిర‌ణాలు శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి పాదాల‌ను స్ప‌ర్శిస్తాయి. ఈ ఘ‌ట్టం భ‌క్తుల‌కు క‌నువిందు చేస్తుంది.


సర్వలోకాలకు చైతన్యాన్ని కలిగిస్తూ ఉదయించే శ్రీ సూర్య భగవానుడు తన ఉషారేఖలను శ్రీవారి పాదాలపై ప్రసరించి అంజలి ఘటించాడు.


💥సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాడు.


ఈ వాహ‌నంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభ. సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యుని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం.


ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.


సూర్యప్రభ వాహనంపైన శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్యం, విద్య, ఐశ్వర్యం, సంతానం వంటి ఫలాలు భక్తకోటికి సిద్ధిస్తాయి. 

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం