భీష్మ ఏకాదశి", "మహాఫల ఏకాదశి", "జయ ఏకాదశి
⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏
💥మాఘ శుద్ధ ఏకాదశిని "భీష్మ ఏకాదశి", "మహాఫల ఏకాదశి", "జయ ఏకాదశి" అని అంటారు.
భీష్మ నిర్యాణానంతరం వచ్చిన ఏకాదశి కనుక ఈ భాగవత శిఖామణి పేరున ఈ ఏకాదశిని ‘భీష్మ ఏకాదశి’ అని పిలుస్తారు
భారతంలో భీష్మునిది ఒక ప్రత్యేకమైన పాత్ర. శీలంలో, శౌర్యంలో, నీతిలో, నిష్ఠలో భీష్మునికి సాటి భీష్ముడే.
చిన్నతనం నుంచీ ఆయన త్యాగపురుషుడే. తండ్రి కొరకు స్వసుఖాన్నీ, రాజ్యాన్నీ అన్నీ వదులుకున్నవాడు భీష్ముడు తప్ప మరొకరు లేరు.
శ్రీకృష్ణుడు కేవలం నరుడు కాడని, ఆయన సాక్షాత్తు పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుడని శ్రీకృష్ణుని సమకాలికులలో ఎరుక గల్గిన అతికొద్ది మందిలో భీష్ముడు ముఖ్యుడు.
💥58 రోజులు అంపశయ్యపై పవళించి ఉత్తరాయణ పుణ్య తిథి కోసం వేచి ఉన్న, ధ్యాన సమాధి స్థితిలోనున్న భీష్ముడు, ఎవరో తన దగ్గరకు వచ్చిన అలికిడికి వాలివున్న కను రెప్పలను భారంగా పైకెత్తి చూసాడు. పాండవులు, శ్రీకృష్ణుడు కనిపించారు.
అంతిమ క్షణాల్లోమాధవుని ముఖారవింద దర్శనం ఆ కురువృద్ధునికి ఆనందం కలిగించింది. భక్తిగా చేతులు జోడించగా, పాండవులు ఆ జ్ఞాననిధికి పాదాభివందనం చేశారు. మౌనంగానే వారిని ఆశీర్వదించాడు భీష్ముడు.
అప్పుడు ధర్మరాజు వినయంగా చేతులు జోడించి, ‘‘పితామహా! సంగ్రామ ఫలమైన విజయలక్ష్మిని వరించానన్న మాటేగానీ, మానసిక విజయాన్ని వరించలేక పోయాను. నాకు మానసిక శాంతి కలిగే మార్గాన్ని ఉపదేశించు.
ఈ విశ్వంలో గొప్పదైవం ఎవరు? ఎవరిని కీర్తిస్తే సుఖసంతోషాలు లభిస్తాయి. ఎవరిని అర్చిస్తే సకల శుభాలు కలుగుతాయి? ఎవరిని శరణుకోరితే ఈ భయంకర సంసార సాగరం నుంచి విముక్తి కలుగుతుంది?’’ అని ప్రశ్నించాడు.
భీష్ముడు చిరునవ్వుతో ధర్మజుని వైపు చూసి... తన చూపులను వాసుదేవుడైన శ్రీకృష్ణునిపై నిలిపి, ‘‘ధర్మజా! నీ సందేహాలన్నింటికీ నా చివరి సమాధానం, లీలా మానుష విగ్రహుడైన ఈ శ్రీకృష్ణుడే’’ అంటూ చేతులు జోడించి..
‘‘జగత్ ఏభుం దేవదేవమనంతం పురుషోత్తమం’’ అంటూ ప్రారంభించి, ‘‘విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు:’’ అంటూ విష్ణుసహస్ర నామావళిని వేయి విధాలుగా కీర్తిస్తూ, విశ్వకళ్యాణ కాంక్షతో ఈ మానవాళికి అందించాడు.
అదే ఏకాగ్రతతో శ్రీకృష్ణుని చూస్తూ ఊర్ధ్వలోక ప్రయాణానికి అనుమతి ఇమ్మని కోరాడు.
శ్రీకృష్ణుడు దీవిస్తూ ‘‘గాంగేయా! నీ భక్తిపారవశ్యం నాకు ఆనందం కలిగించింది. మాఘశుద్ధ ఏకాదశి తిథిని నీ సంస్మరణదినంగా నీకు కానుక యిస్తున్నాను. మహామహులకు లభించే శాశ్వత పుణ్యలోకాలు నీకు లభిస్తాయి’’ అని పలికాడు.
మహా భారత యితిహాసంలోని ఓ మహామహుని మహాప్రస్థానం అలా ముగిసింది.
💥విష్ణు సహస్రనామం ఎప్పుడు పఠించినా పుణ్యం కలుగుతుంది. ముఖ్యంగా భీష్మ ఏకాదశినాడు గనుక విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే ఆ ఫలితం అనంతంగా ఉంటుంది.
అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెర వేరుతాయి. భోగభాగ్యాలు కలుగుతాయి. సర్వ పాపాలూ హరిస్తాయి. పుణ్యగతులు లభిస్తాయి.
ముఖ్యంగా విష్ణు సహస్ర నామ జపం, ధ్యానం వల్ల భయం తొలగుతుంది, శుభం కలుగుతుంది.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment