💥శ్రీ మహాలక్ష్మ్యష్టకం💥
⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః 🌹🙏
💥క్షీరాబ్ధి పుత్రికగా అవతరించిన లక్ష్మీదేవి... డోలాసురుడనే రాక్షసుణ్ణి సంహరించిందనీ పురాణాలు చెబుతున్నాయి.
రెండు చేతులలో కమలాలు ధరించి, అభయ, వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా... భక్తుల అభీష్టాలను తీర్చే మహాలక్ష్మి సర్వ మంగళకారిణి.
లోక స్థితికారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్ముల సమష్టి రూపమైన మహాలక్ష్మీదేవినీ పూజిస్తే... ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి కలుగుతుందనీ, సుఖ సంతోషాలు చేకూరుతాయనీ, దారిద్య్రం, దుఃఖాలు తొలగిపోయి సకల శుభాలూ కలుగుతాయనీ భక్తుల నమ్మిక.
💥శ్రీ మహాలక్ష్మ్యష్టకం💥
ఇంద్ర ఉవాచ -
నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే ।
శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 1 ॥
నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి ।
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 2 ॥
సర్వజ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి ।
సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 3 ॥
సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని ।
మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 4 ॥
ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి ।
యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 5 ॥
స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే ।
మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 6 ॥
పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి ।
పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 7 ॥
శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే ।
జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 8 ॥
మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః ।
సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ॥
ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనమ్ ।
ద్వికాలం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః ॥
త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్ ।
మహాలక్ష్మీ ర్భవేన్-నిత్యం ప్రసన్నా వరదా శుభా ॥
ఇతి ఇంద్ర కృత శ్రీ మహాలక్ష్మ్యష్టక స్తోత్రం సంపూర్ణం ||

Comments
Post a Comment