ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః🌹

 ⚜️🕉️🚩 ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః🌹🙏


చిద్ఘనాయ మహేశాయ వటమూలనివాసినే ।

సచ్చిదానందరూపాయ దక్షిణామూర్తయే నమః ॥ 


💥"భూతాకాశము" అనగా నీవు చూసే ఆకాశ మొకటి.. చిత్తాకాశము, చిదాకాశము, దహరాకాశము, కేవలాకాశములతో కలిపి మొత్తం "పంచగగనములు"


ఈ పంచ గగనముల పద్ధతిగా, బోధించబడే బోధ పేరు 'ప్రబోధ'. దక్షిణామూర్తి విధానంలో చెప్పబడేదంతా ప్రబోధ పద్ధతి.


అచల సిద్ధాంతంలో ప్రబోధ చూడామణి అని కందార్థాలలో ఒకటుంది. అచల సిద్ధాంతమంతా మౌనవ్యాఖ్యే.


గురువు గారిని చూస్తూ ఉండగానే హృదయ స్థానంలో గురుశిష్య ఐక్యతా సిద్ధిని పొంది, గురువు గారిలో ప్రబోధ చేయాలి, ప్రకటించాలని సంకల్పం కలగగానే శిష్యుడికి అర్థం కావాలి.


గురు హృదయంలో బోధించాలనే సంకల్పం కలగగానే, వ్యక్తీకరించక ముందే శిష్యుడికి అర్థమైపోవాలి. అర్థమైతే చెప్పక్కర్లేదు.


ఇంటిలో వారి అవసరాన్ని గుర్తెరిగి ఆ అవసరాన్ని తీర్చావు గనుక వారికి సంతోషం. అలా కాకపోతే అన్యోన్యత లోపించినట్లవుతుంది. అన్యోన్యత ఉన్నచోట మౌనం ఉంటుంది. బాగా గుర్తుంచుకోవాలి.


మనం మాట్లాడే విధానం గురించి భాగవతంలో ప్రహ్లాదుడు ఏం చెప్పాడు? ఢమఢమ ధ్వనుల ఢక్క గాక!


సదా ఈశ్వరీయ బుద్ధితో, ఈశ్వరీయ చింతన చేసేవారికి, సదా విష్ణు పదాంబుజ నిరతి కలిగినటువంటి వారికి అన్యం ఎలా తోస్తుంది?


అన్యం తోస్తే కదా మాట్లాడటానికి? సదా ఆత్మోపరతి యందు నిష్ఠ గల్గినవాడికి అన్యమే తోచడం లేదు. అన్యం తోచనప్పుడు వాక్కులోకి ఎలా దిగి వస్తాడు?


ఎంతటి ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన సాంప్రదాయం, ఉన్నతమైన బోధ, ఉన్నతమైన శాస్త్రాలు అయినప్పటికీ, దీనిని బోధించే మహానుభావులు ఉన్నారు.


కానీ అందుకోవాలంటే ఏం చేయాలి? దక్షిణామూర్తిని ఆశ్రయించాలి.


దక్షిణామూర్తిని గమనిస్తే 'వటమూల నివాసిని'

వటవృక్షమంటే మర్రిచెట్టు. వటవృక్షం దక్షిణామూర్తి సమానం. అశ్వత్థ వృక్షమంటే రావిచెట్టు. అశ్వత్థ వృక్షం విష్ణు సమానం.


పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలుసుకోవడానికి ఈ వటవృక్షాన్ని అధ్యయనం చేయాలి, ఆశ్రయించాలి.


'ఊర్ధ్వ మూలమదఃశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం, ఛందాంసి యధ్య వర్ణాణి యుక్తం వేదసవేదవిత్‌'

అంటున్నారు.


పైన మూలం ఉందట, క్రిందికి శాఖలున్నాయట.

పైన మూలముంటే విత్తనం ఎక్కడుండాలి? విత్తనం కూడ పైనే ఉండాలి. కాబట్టి శూన్యమనే విత్తనం ద్వారా సర్వం అనే సృష్టి వ్యక్తమైంది.


మరి ఆ సర్వం అంతా కూడ కొమ్మలని, రెమ్మలని, ఆకులని అధ్యయనం చేద్దామా? ఎంతకాలం చేస్తే మాత్రం ఏమి అవుతుంది?


అందువలన 'వటమూలనివాసిని' ఏ శూన్యం నుండి సర్వం వ్యక్తమైందంటున్నావో, ఆ శూన్యాతీతమే పరబ్రహ్మము. అక్కడ ఉన్నాడు దక్షిణామూర్తి.


పరబ్రహ్మ నిర్ణయం ద్వారా దక్షిణామూర్తిని ఆశ్రయించు. అప్పుడు ఏం పొందుతావు? ఆవరణ రహితం, జనన మరణ రహితం, సాయుజ్యం పొందుతావు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం