సౌర పురాణంలో "మను మహారాజు" కృత "సూర్య స్తుతి

 ⚜️🕉️🚩 ఓం శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః 🌹🙏


ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్

సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః 


హరిదశ్వస్సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్

తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తండక అంషుమాన్


💥తాత్పర్యము:

ఆదిత్యుడు జగత్‌ సృష్టికి కారకుడు.

జనులు తమ విధులు నిర్వర్తించుటకు ప్రేరణ యిచ్చును. లోకోపకారం కొరకు ఆకాశమున సంచరించి వర్షముల ద్వారా జగత్తును పోషించి తన కిరణములను ప్రకాశింపజేయును.


బంగారు వన్నెతో తేజరిల్లుచు అద్భుతముగా ప్రకాశించువాడు. బ్రహ్మాండములు ఉత్పత్తికి బీజమైనవాడు. చీకట్లను తొలగించుచు దివాసమయమున ప్రాణులను కార్యనిమగ్నులను గావించువాడు.


శ్యామవర్ణము గల రథాశ్వములు గలవాడు.

అసంఖ్యాకములైన కిరణములు గలవాడు. సప్త అను పేరు గల రథాశ్వము గల వాడు. రథమునకు ఏడు గుఱ్ఱములుగలవాడు.


తేజో నిధానములైన కిరణములు గలవాడు. సర్వ సంహారకుడు. జగత్ప్రళయమునకు పిమ్మట దానిని మరల సృజించుటకై ఆవిర్భవించెడి వాడు. నిరంతరము తన కిరణములచే ప్రకాశించుచుండువాడు.


💥సౌర పురాణంలో "మను మహారాజు" కృత "సూర్య స్తుతి" ఇది..


నమో నమో వరేణ్యాయ, వరదాయాంశు మాలినే,

జ్యోతిర్మయ నమస్తుభ్యం, అనంతాయాజితాయతే || 1 ||


త్రిలోక చక్షుషే తుభ్యం, త్రిగుణాయామృతాయచ

నమో ధర్మాయ హంసాయ, జగజ్జనన హేతవే || 2 ||

           

నరనారీ శరీరాయ నమో మీడుష్టమాతయే

ప్రజ్ఞానాఖిలేశాయ, సప్తాశ్వాయ త్రిమూర్తయే || 3 ||

           

నమో వ్యాహృతి రూపాయ,  త్రిలక్షాయాసుగామినే

హర్యశ్వాయ నమస్తుభ్యం, నమో హరిత బాహవే || 4 ||

           

ఏకలక్ష, విలక్షాయ, బహులక్షాయ దండినే

ఏక సంస్థ ద్విసంస్థాయ బహుసంస్థాయ తే నమః || 5 ||

           

శక్తిత్రయాయ శుక్లాయ, రవయే పరమేష్టినే

త్వం శివస్త్వం హరిర్దేవ త్వం బ్రహ్మాత్వం దివస్పతిః || 6 ||

            

త్మమోంకారో వషట్కారః స్వధా స్వాహా త్వమేవహి

త్వామృతే పరమాత్మానాం, న తత్పశ్యామి దైవతం ||


ఇతి శ్రీ సౌరపురాణే మనుకృత సూర్య స్తోత్రం సంపూర్ణం ||


🌹అసంఖ్యాక కిరణములతో సంశోభితమయ్యే ఓ అంశుమాలిన్! వరములు ప్రదానం చేయటంలో నువ్వే సర్వ సమర్థునివి.


హే జ్యోతిస్వరూపా! నీ స్వరూపం అంతము లేనిది.

నీ నామములు అనంతములు.


త్రిలోక చక్షువు నీవే! త్రిగుణాత్మకమైన నీ రూపము అమృతమయము. జగత్సృష్టికర్తవు నీవే! 


ధర్మస్వరూపా! హంస అని కూడా పిలువబడే నీవు, సప్తాశ్వ యుతమైన రథముపై త్రిలోకాల లోనూ సంచరిస్తూ ఉంటావు!


ఓ జ్ఞానభాండారమా! అఖిలేశుని గానూ, శివ స్వరూపునిగానూ, సతత గతిశీలుని గానూ, వినతులందుకునే భగవన్!


ఏకలక్ష, విలక్ష, బహులక్ష, ఏకసంస్థ, ద్విసంస్థ, బహుసంస్థాది నామాలన్నీ నీ పర్యాయ పదాలే! 


పరమేష్టి సంజ్ఞ తో సుశోభితుడవైన హే భగవన్! నీలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల మూడు శక్తులూ నెలకొని వున్నాయి. 


ఓంకార, వషట్కార, స్వాహా, స్వధా స్వరూపమైన నీవే పరమాత్మవు. సదా నిన్నే నేను శరణు వేడుతాను.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments