Posts

Showing posts from October, 2022

💥ఓం నమో భగవతే శ్రీ రమణాయ 💥

Image
 ⚜️🕉️🚩 అరుణాచల శివ అరుణాచల శివ 🌹🙏  💥ఓం నమో భగవతే శ్రీ రమణాయ 💥 ఊరూరు తిరుగక ఉల్లము నిను గన అణగని ధృతి జూపు ఘన అరుణాచలా! 💥భావము: ప్రపంచమును పట్టుకొని తిరుగు నా మనసుకు నీ సుందరమగు స్వరూపమును చూపి, అందే నా మనస్సును అణగివుండునట్లు అనుగ్రహింపుము అరుణాచలా! 🍁🍁🍁🍁🍁 💥అరుణాచలం నాలుగైదు ఉపశిఖరాలుండి అనేక కోణాలనుంచి కనిపించే ఏకైక ముఖ్య శిఖరంతో అలరారే ఏకపర్వతం. అలాగే రమణుల మార్గం కూడా "ఆత్మవిచారణ" అనే ఒకే శిఖరం కలిగిన దేహాత్మ భావన నిర్మూలించే ఉపాయం. 💥పరిక్రమ లేక ప్రదక్షిణ అంటే అరుణాచలం చుట్టూ వున్న 14 కి.మీ.ల మార్గాన్ని సవ్యదిశలో పాదరక్షలు లేకుండా నడచి పూర్తిచెయ్యడం. అంటే, గిరి కుడివైపుకు వచ్చేలా చుట్టిరావడం.  💥దేవరాజ ముదలియార్‌ తన "స్మృతులు"లో ఇలా రాసారు. బద్ధకం కారణంగానో, ఉత్తమ జ్ఞాన పద్ధతిలో మానసిక సాధనయే సమాధానమని సరిపెట్టుకోవడం వల్లనో గిరి చుట్టి రావడాన్ని నేనెక్కువ ఆదరించలేదు. ఆశ్రమవాసినే అయివుండి, ఇతరులు ఎంతో ఉత్సాహ విశ్వాసాలతో చేస్తున్నప్పటికీ పరిక్రమించాలని తోచలేదు. కానీ, అంతమంది అలా చేయడం నన్ను ఆలోచింపచేసేది. దాంతో ఆసక్తిని కూడదీసుకొని, ఈ శారీరక శ్రమ ప్రయో...

💥సత్యన్నారాయణస్వామి వ్రత కధల అంతరార్థం:

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ సత్యనారాయణస్వామినే నమః🌹🙏 💥మనకున్న ఎన్నో గొప్ప విశేషమైన పూజలలో, వ్రతాలలో శ్రీ సత్యన్నారాయణస్వామి వ్రతం చాలా ఉత్కృష్టమైనది. పెళ్ళిళ్ళలో, గృహప్రవేశాలలో, ఏ శుభ సందర్భంలో అయినా మనం ఆచారంగా ఈ వ్రతం చేసుకుంటాము. 💥ముందుగా అష్టదిక్పాలకులను, నవగ్రహాలను, దేవతాసమూహాన్ని వారి సపరివారంగా ఆహ్వానించి, ఆవాహన చేసి ఉచితాసనాలతో సత్కరించి వారి ఆశీస్సులను స్వీకరించి మంత్రపుష్పం సమర్పించి అప్పుడు స్వామివారి లీలా విశేషాలను కధల రూపంగా విని తరిస్తాము. 💥ఇక్కడ 5 కధల సమాహారం ఎన్నో విశేషాలను మనకు తెలుపుతాయి. 💥సత్యన్నారాయణస్వామి వ్రత కధల అంతరార్థం : 🍁1) మొదటి అధ్యాయం: మొదటగా నారద మహర్షి శ్రీమన్నారాయణుని దర్శించి కలియుగంలో ప్రజలు పడుతున్న కష్టాలను వివరించి వాటిని తగిన నివారణోపాయం సూచించమని వేడుకుంటాడు. ఈ అధ్యాయం మనకు ఎదురవుతున్న ఎన్నో కష్టాలను పేర్కొంటూ వాటిని ఎలా పోగొట్టుకోవాలో చెబుతోంది. భరోసా ఇస్తోంది.  మన పూర్వ జన్మ పాపం ఇప్పుడు మనకు రావలసిన ఆనందాలకు ఎలా అడ్డుపడుతుందో మనకు అవగతమవుతుంది. వాటిని ఇటువంటి క్రతువులు ఒక దూదికొండను ఒక నిప్పురవ్వ మండించి తొలగించినట్టు ఎలా తీరుస్తాయో చెబుత...

💥శ్రీ గణేశ నామాష్టక స్తోత్రం💥

Image
 ⚜️🕉️🚩ఓం శ్రీ మహా గణాధిపతయే నమః 🌹🙏 💥సామవేదాంతర్గతమైన గణపతి మంత్రములను నామములుగా, స్తోత్రముగా స్వయంగా శ్రీ హరి, పార్వతీ దేవికి చెప్పిన స్తోత్రమిది. మొదటి శ్లోకములలోని నామములు చెప్పినంతనే విఘ్నేశ్వరుని కృపతో సర్వ విఘ్నములు నివారింపబడతాయి. ఈ అష్టకం చాలా మహిమాన్వితమైనది. మూడు సంధ్యలలోనూ పఠింపతగినది. 🔸🔹🔸🔹🔸🔹🔸 💥శ్రీ గణేశ నామాష్టక స్తోత్రం💥 గణేశమేకదంతం చ హేరంబం విఘ్ననాయకం లంబోదరం శూర్పకర్ణం గజవక్త్రం గుహాగ్రజం  జ్ఞానార్థవాచకో గశ్చ ణశ్చ నిర్వాణవాచకః తయోరీశం పరం బ్రహ్మ గణేశం ప్రణమామ్యహమ్‌ || 1 || ఏకశబ్దః ప్రధానార్థో దంతశ్చ బలవాచకః బలం ప్రధానం సర్వస్మాదేకదంతం నమామ్యహమ్‌ || 2 || దీనార్థవాచకో హేశ్చ రంబః పాలకవాచకః పాలకం దీనలోకనాం హేరంబం ప్రణమామ్యహమ్‌ || 3 || విపత్తివాచకో విఘ్నోనాయకః ఖండనార్థకః విపత్‌ ఖండనకారం తం ప్రణమామి విఘ్ననాయకమ్‌ || 4 || విష్ణుదత్తైశ్చ నైవేద్యైర్యస్య లంబం పురోదరమ్‌ పిత్రా దత్తైశ్చ వివిధైఃవందే లంబోదరం చ తమ్‌ || 5 || శూర్పాకారౌ చ యత్కర్ణౌ విఘ్నవారణకారణౌ సంపద్దౌ జ్ఞానరూపే చ శూర్పకర్ణం నమామ్యహమ్‌ || 6 || విష్ణుప్రసాదం మునినా దత్తం యన్మూర్ధ్ని పుష్పకమ్‌ తద్‌గజే...

💥శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి గురుగుహా అనే నామం యొక్క విశిష్ఠత ఏమిటి?

Image
 ⚜️🕉️🚩ఓం వల్లీదేవసేనాసమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామినే నమః🌹🙏 మయూరాధిరూఢం మహావాక్యగూఢం – మనోహారిదేహం మహచ్చిత్తగేహమ్ | మహీదేవదేవం మహావేదభావం – మహాదేవబాలం భజే లోకపాలమ్ || 💥భావం: నెమలిని అధిష్టించి యున్నవాడును, వేదాంత మహా వాక్యములలో నిగూఢముగా ఉన్నవాడును, మనోహరమైన దేహము గలవాడును, మహాత్ముల చిత్తమునందు నివసించువాడును, బ్రాహ్మణులకారాధ్యుడును, వేదములచే ప్రతిపాద్యుడును, మహాదేవుని నందనుడును, లోకపాలకుడు అయిన సుబ్రహ్మణ్యేశ్వరుని సేవించుచున్నాను. 🍁🍁🍁🍁🍁 💥శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి గురుగుహా అనే నామం యొక్క విశిష్ఠత ఏమిటి? "#గురుగుహా" అనేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఉన్న అనంత నామాలలో ఒకటి.  గురుగుహా ఒక అర్ధం చెప్పాలంటే, మన హృదయ గుహలోనే ఉన్న గురు స్వరూపమైన సుబ్రహ్మణ్యుడు అని. ఇక్కడ గుహా అంటే మన హృదయ గుహ – హృదయాంతరాళము అని అన్వయించుకోవచ్చు. 💥శాస్త్రీయ సంగీత త్రయములో ఒకరు, ప్రఖ్యాత వాగ్గేయకారుడు, సుబ్రహ్మణ్యానుగ్రహ పాత్రుడు అయిన శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ చేసిన కీర్తనలు అన్నీ "గురుగుహా" అనే మకుటంతో ఉంటాయి.  ముత్తుస్వామి దీక్షితార్ గారి జీవితంలో ఆయన గురువైన చిదంబరనాథ...

💥హనుమ లాంగూల స్తోత్రమ్💥

Image
 ⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏 💥ఆంజనేయ స్వామీ తన తోకతో లంకా దహనం చేసిన విషయం, ఎందరో రాక్షసులను అంతమొందించిన విషయం అందరకూ తెలిసిందే! అటువంటి ఆంజనేయస్వామి వారి తోకను పూజించడం మంచిది. హనుమంతుడి లాంగూలాన్ని పూజించడం కూడా అనేక సత్ఫలితాలను ఇస్తుంది. "లాంగూలం" అంటే తోక. 💥చిత్రపటంను ఏర్పాటు చేసుకుని, శనివారం నాడు గానీ, మంగళవారం నాడు గానీ పూజను ప్రారంభించాలి. ప్రతి రోజూ ఆంజనేయ స్వామివారిని అష్టోత్తర శత నామాలతో పూజ చేసి శక్తి మేరకు పండో, ఫలాన్నో నివేదన సమర్పించి సింధూరంతో తోకపైన ఒక బొట్టు పెట్టవలెను. ఈ విధంగా వరుసగా 41 రోజుల పాటూ పూజ చేయడం వల్ల ఎటువంటి పనైనా సానుకూలమవుతుందని, కష్టాలు తీరిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. 💥"హనుమ లాంగూల స్తోత్రం" ఎంతో మహిమాన్వితమైనది. ఈ స్తోత్రాన్ని నిత్యం పటించడం వల్ల అన్నింటా విజయం లభిస్తుంది. ఈ స్తోత్రాన్ని రావి చెట్టు క్రింద కూర్చుని చదవటం మరింత ఫలాన్ని కలిగిస్తిందని నమ్మకం. 🔸🔹🔸🔹🔸🔹🔸🔹 💥హనుమ లాంగూల స్తోత్రమ్💥 శ్రీమంతం హనుమంత మాత్త రిపుభి ర్భూభృత్తరు భ్రాజితం| చాల్ప ద్వాలధిబధ్ధ వైరినిచయం చామీకరాది ప్రభం| రోషా ద్రక్త పిశంగ నేత్ర నలినం భ...

💥శివ అక్షరమాలాస్తోత్రము💥

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 💥 శివుడు మంగళాన్ని కలిగిస్తాడు. శాంతిని పెంచుతాడు. అకాల మృత్యువును దరి చేరనీయడు. సకల ఐశ్వర్యాలనూ అందిస్తాడు. 💥భారతీయ దైవాలన్నీ ఖగోళ-భూగోళ ప్రకృతికి ప్రతీకలే. శివలింగం మనం నివసించే భూగోళానికి ప్రతీక.  🍁చంద్రశేఖరుడు శివుడు. భూమికి ఉపగ్రహం చంద్రుడు. 🍁గంగాధరుడు శివుడు. భూమిపైనా మూడింట రెండువంతులు జలం ఉంటుంది. 🍁శివుడు దిగంబరుడు. భూమి కూడా ఆకాశంలో దిక్కులే అంబరంగా తిరుగుతుంది. 🍁శివుడు లింగస్వరూపుడైతే భూమి ఆకారం గోళాకృతి. 🍁మహాకాలుడు శివుడు. భూమ్మీద ఉన్న వారికి కాలం అనేది భూమి ఆత్మభ్రమణ, పరిభ్రమణ కాలాల వల్లనే తెలుస్తుంది. 🍁లయకారకుడు శివుడు. భూమిపైన జీవులు మరణిస్తే భూమిలోనే లయం కావలసిందే. 🍁విభూతి ధారణ శివుని ధర్మం. భూమ్మీద ఉండేది మట్టి మాత్రమే. 🍁పార్వతికి భర్త శివుడు. భూమి చుట్టూ ఉండే ఓజోన్‌ పొర లోపలి పాంచభౌతిక ప్రకృతికి పార్వతి ప్రతీక. 🍁శివుడు అర్ధ నారీశ్వరుడు. ప్రకృతి, భూమి సంగమం వల్లనే ఈ సృష్టి ఏర్పడుతుంది. అందుకే, రెండూ కలిసి మాత్రమే ఉంటాయి. 🍁గణపతికి తండ్రి ఆయన. భూమి లోని గురుత్వాకర్షణ శక్తి గణపతి. 🍁కుమార జనకుడు శివుడు. భూమి చుట్టూ ఉండే విద్య...

💥కాశీలో మరణించిన వారికి ముక్తిని ప్రసాదిస్తానని తాను చేసిన ప్రతిజ్ఞని పరమేశ్వరుడు ఎలా నెరవేర్చుకుంటాడో శ్రీనాధకవిసార్వభౌముడు కాశీఖండం లో తెలియచేసిన పద్యం

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ। శరణం భవ భూతేశ కరుణాకర శంకర॥ హర శంభో మహాదేవ విశ్వేశామరవల్లభ। శివ శంకర సర్వాత్మన్ నీలకంఠ నమోస్తుతే॥ 💥మహాప్రళయ కాలంలో అవిముక్త నగరం, ఆదిదంపతులకు ఆనందకాననం, మర్త్యలోకంలో మహాశివుడు నివసించే మహాస్మశానం, విశ్వేశ్వరలింగం జ్యోతిర్లింగంగా వెలసి, స్వయంగా శివుడే నిర్మించాడని చెప్పే #వారణాసి.  💥కాశ్యాంతు మరణాన్ముక్తిః – కాశీ పట్టణంలో మరణించడమే మోక్షదాయకం.  💥శివుడు ప్రళయకాలంలో తన త్రిశూలం మీద నిలబెట్టాడని చెప్పే నగరం కాశీ. దీనికి బిందుమాధవ క్షేత్రం అనే పేరు కూడా ఉంది. ఋగ్వేదంలో ఈ పట్టణాన్ని జ్యోతిస్థానం అని వర్ణించారు. జ్యోతిర్లింగంగా, శక్తిపీఠంగా, ముక్తినగరంగా వినుతికెక్కిన కాశీ (వారణాశి) స్మరణ మాత్రం చేతనే సప్తజన్మల పాపాలనూ పోగొట్టగల మహిమ కలది.  💥వాసం చేతనే వాసనా బలాన్ని జయించగల శక్తిని ప్రసాదించే వారణాసి, సురనది అయిన గంగానదీ తీరాన ఉన్న పుణ్యనగరం. 🔸🔹🔸🔹🔸🔹🔸 💥కాశీలో మరణించిన వారికి ముక్తిని ప్రసాదిస్తానని తాను చేసిన ప్రతిజ్ఞని పరమేశ్వరుడు ఎలా నెరవేర్చుకుంటాడో శ్రీనాధకవిసార్వభౌముడు కాశీఖండం లో తెలియచేసిన పద...

💥॥ శ్రీ పరమేశ్వర స్తుతిః (వసిష్ఠ కృతమ్) ॥💥

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 💥ఆదిదేవుడిగా, సర్వజ్ఞుడిగా, భోళాశంకరుడిగా, పరమశివునిగా కీర్తించబడే పరమాత్మయే "పరమేశ్వరుడు" లింగ స్వరూపంలో పూజలందుకునే ఈ పరమశివుడే సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములను నిర్వహిస్తూ భక్తుల పాలిట కల్పవృక్షంగా భాసిస్తూ ఉంటాడు. జగన్మాత అయిన పార్వతీదేవి ఈయన అర్ధాంగి. పార్వతీపరమేశ్వరులు ఆదిదంపతులుగా సకల లోక వాసుల చేత పూజలందుకుంటూ ఉంటారు.  💥శివ కుటుంబం కూడా చాలా చిత్రమైనది. శివుడు త్రినేత్రుడై, భస్మాంగధారియై, పాములను ఆభరణాలుగా వేసుకుని, గజచర్మాన్ని ధరించి ఉంటే, అమ్మవారు సకలాభరణ భూషితురాలై అలరారుతూ ఉంటుంది. పెద్దకుమారుడైన విఘ్నేశ్వరుడు గజముఖుడు. చిన్నకుమారుడైన కుమారస్వామి ఆరు ముఖములు కలవాడు. విరోధ భావన కలిగిన జీవులైన ఎద్దు, సింహం, ఎలుక, నెమలి, పాము, శివ సదనమైన కైలాసగిరిపై సఖ్యతతో తిరుగాడుతూ ఉంటాయి. 💥పరమేశ్వరుడిని నిరంతరారాధన చేసే వారి హృదయమే కైలాసమై, వారి మనసు లోని కామక్రోధాదులు శమించి నిరంతరానందాన్ని పొందుతారన్న సత్యాన్ని పైవిషయం ప్రబోధిస్తుంది. నిర్గుణ పరబ్రహ్మ యొక్క కర్మ స్వరూపం శ్రీమహావిష్ణువు అయితే, జ్ఞాన స్వరూపం పరమేశ్వరుడు. అందుకే లౌకిక పురోగతి...

💥లోకబాంధవుడు💥

Image
 ⚜️🕉️🚩 ఓం సూర్య నారాయణాయ నమః🌹🙏 రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతమ్ | పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్ ||  💥భావం: సూర్యుడు ప్రశస్తమైన కిరణములు కలవాడు. ఉదయపర్వతమందు ఉదయించువాడు (లోకులను తమ తమ పనులలో ప్రవర్తింపచేయువాడు అని కొందరు వ్యాఖ్యాతలు) దేవతలచేత, అసురులచేత కూడ నమస్కరింప బడినవాడు. తన తేజస్సుచే ఇతరుల తేజస్సులను కప్పి వేయువాడు. కాంతిని ఇచ్చువాడు. సర్వలోకములను నియమించువాడు. అట్టి సూర్యుని ఆరాధింపుము. 💥లోకబాంధవుడు💥 దేవతలు, మానవులే కాదు.. రాముడు, కృష్ణుడు లాంటి అవతార పురుషులూ ఆయనను అర్చించారు. శ్రీరామచంద్రుడు ఆదిత్య హృదయస్తోత్ర పఠనంతోనే లంకేశ్వరుడిపై విజయం సాధించాడని, హనుమ సూర్యోపాసన ద్వారానే సర్వవిద్యలు అభ్యసించినట్లు పురాణ కథనం. శ్రీకృష్ణుడి కుమారుడు సాంబుడు సూర్యారాధనతో కుష్టువ్యాధి నుంచి విముక్తుడయ్యాడట. ధర్మరాజు వనవాస కాలంలో సూర్యారాధనతోనే ‘అక్షయ పాత్ర’ను పొంది ఆకలిదప్పులను జయించగలిగాడు. దివాకరుడిని ప్రసన్నం చేసుకునే సత్రాజిత్‌ "శ్యమంతకమణి"ని పొందాడు. మానవ మనుగడకు ప్రధాన మైన ఆహార, ఆరోగ్యప్రదాత సూర్యభగవానుడే. #సర్వం_సూర్యమయం_జగత్‌ సకల జగత్తు ఆయన తేజస్సుతో చైతన్...

💥కూర్మావతార సందేశం💥

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥"భాగవతం" వైభవం క్రింది శ్లోకంలో చెప్పబడింది. ‘భా’ శబ్దో కీర్తివచనో ‘గ’ శబ్దో జ్ఞాన వాచకః। సర్వేష్ట వచనో ‘వశ్చ’ ‘తో విస్తారస్య వాచకః। ధర్మార్థకామమోక్షాంశ్చ ముక్తి వర్ణ చతుష్టయీ। ప్రాప్యంతే యతో-నేన తస్మాద్భాగవతం స్మృతమ్॥ 💥మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః।      రామోరామశ్చ శ్రీ రామశ్చ కృష్ణః కల్కిరేవచ॥ - అని పేర్కొనబడినవే దశావతారాలు. ఈ అవతారాల చరిత్రను తెలియజేసేదే శ్రీ మహా భాగవతం. 🍁🍁🍁🍁🍁 వేదము లుద్ధరించి, గిరి వీపున మోసి, ధరన్ ధరించి, ప్ర హ్లాదునిగాచి, నొంచిబలి, హైహయవంశజులన్ వధించి,వి చ్ఛేదమొనర్చి రావణుని, చే హరిమూని,కృపాబ్ధినించి,మ్లే చ్చాదుల మూర్ఛ ముంచియు దశాకృతి బొల్చిన కృష్ణు మ్రొక్కెదన్. 💥#కూర్మావతారం💥🐢 💥అమృతప్రాప్తికై సురాసురులందరూ కలిసి క్షీరసాగరం సమీపించినారు. సాగరమథనం సామాన్యమా? మంధరాన్ని కవ్వంగా చేసికొన్నారు. వాసుకి సర్పాన్ని ఆ పర్వతానికి చుట్టినారు. తలవైపు రాక్షసులు, తోక వైపు దేవతలు పట్టుకొన్నారు. అయితే సముద్రం లోపల మునిగి పోతున్న మంధర పర్వతాన్ని చూచి... వనజాక్షుడు ఆ వార్థి నడుమ లక్ష యోజనాల పర్యంతమైన కర్పరంతో బ్రహ్...

⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ 🌹🙏 💥అన్నమయ్య కీర్తన:💥 ఉన్నమంత్రాలిందు సదా(రా) వొగివిచారించుకొంటే విన్నకన్నవారికెల్ల విష్ణునామమంత్రము పరగ పుచ్చకాయల పరసిపోదు మంత్రము గరిమ ముట్టంటులేని ఘనమంత్రము వరుస నెవ్వరు విన్నా వాడిచెడనిమంత్రము అరయనిదొక్కటేపో హరినామమంత్రము యేజాతినోరికైన నెంగిలి లేని మంత్రము వోజదప్పితే జెడకవుండే మంత్రము తేజాన నొకరికిస్తే తీరిపోనిమంత్రము సాజమైన దిదెపో సత్యమైన మంత్రము యిహము పరము తానే యియ్యజాలిన మంత్రము సహజమై వేదాలసారమంత్రము బహునారదాదులెల్ల పాటపాడినమంత్రము విహితమయిన శ్రీవేంకటేశుమంత్రము 🍁🍁🍁🍁🍁 అన్ని మంత్రములు ఇందె ఆవహించెను వెన్నతో నాకు గలిగె వేంకటేశు మంత్రము నారదుడు జపియించె నారాయణ మంత్రము చేరె ప్రహ్లాదుడు నారసింహ మంత్రము కోరి విభీషణుడు చేకొనె రామ మంత్రము వేరెనాకు గలిగె వేంకటేశు మంత్రము రంగగు వాసుదేవ మంత్రము ధృవుండు జపించె అంగవించె కృష్ణ మంత్రము అర్జునుడు ముంగిట విష్ణు మంత్రము మొగిశుకుడు పఠించె వింగడమై నాకు నబ్బె వేంకటేశు మంత్రము ఇన్ని మంత్రముల కెల్ల ఇందిరనాథుడె గుఱి పన్నిన దిదియే పరబ్రహ్మ మంత్రము నన్ను గావగలిగేబో నాకు గురుడియ్యగాను వెన్నెల వంటిది శ్రీవేంకటేశు మంత్ర...

🌷🌷!!! గాయత్రి రక్ష సర్వ జగద్రక్ష !!!🌷🌷

Image
 ⚜️🕉️🚩ఓం నమో గాయత్రీ దేవ్యై నమః🌹🙏 🌷🌷!!! గాయత్రి రక్ష సర్వ జగద్రక్ష !!!🌷🌷 💥గాయత్రీ మంత్రము💥 "ఓం, భూర్భువస్సువః, తత్ సవితుర్వరేణ్యం, భర్గోదేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్" ఈ మంత్రాన్ని ఏకధాటిగా చదవకుండా మంత్రాన్ని నాలుగు చోట్ల ఆపి చదవాలి. అది ఎలాగంటే... ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఇలా మంత్రం మద్యలో నాలుగు సార్లు ఆపి చదవాలి. 💥ఈ మంత్రములో "ఓం" అనేది “ప్రణవము” “భూర్భువస్సువః” లోని భూ, భువః, సువః అనేవి “వ్యాహృతులు"... వ్యాహృతులు అనేవి దివ్యశక్తిని కలిగిన పదాలు. ఇవి మూడు లోకాలను సూచిస్తాయి. "తత్” నుంచి మిగిలిన భాగాన్ని “సావిత్రి” అని అంటారు. 🔸🔹🔸🔹🔸🔹🔸 💥గాయత్రి మంత్రంలో 24 బీజాక్షరాలు ఉన్నాయి. వాటిని ఆధారం చేసుకుని నిర్మితమైన కొన్ని గొప్ప ఆలయాలను ఒకసారి అవలోకించుకుందాం. 💥కంచి కామాక్షి మందిరం లో అమ్మవారు మూలవిరాట్టుగా కూర్చుని ఉన్న మంటపాన్ని గాయత్రి మంటపం అంటారు. ఆ ప్రాకారంలో 24 స్తంభాలున్నాయి. అవి 24 బీజాక్షరాలకు ప్రతీకలు. 💥కోణార్క్ లోని సూర్య దేవాలయ సముదాయం ఒక పెద్ద రధం మీద వున్నట్టు నిర్మించబడి ...

💥శ్రీసంతోషిమాత అష్టోత్తర శతనామావళిః💥

Image
 ⚜️🕉️🚩ఓం శ్రీ సంతోషి మహా దేవ్యై నమః🌹🙏 💥మంత్రం: ఓం శ్రీ సంతోషి మహామాయే గజానందం దాయిని శుక్రవార ప్రియే దేవి నారాయణి నమోస్తుతే. 💥ఉత్తరాదిన వినిపించే గాథ‌ల ప్రకారం సంతోషి మాత "వినాయ‌కుని" కుమార్తె.  ఒక "ర‌క్షాబంధ‌నం" రోజున అన్నద‌మ్ములంద‌రూ, అక్కచెల్లెళ్లతో రాఖీ క‌ట్టించుకుంటున్నార‌ట‌.  ఆ దృశ్యాల‌ని గ‌మ‌నించిన వినాయ‌కుని కుమారుల‌కి చాలా బాధ క‌లిగింద‌ట‌.  త‌మ‌కి కూడా ఓ చ‌క్కటి "చెల్లెలు" ఉంటే ఎంత బాగుండేదో అనుకున్నార‌ట వాళ్లు.  నార‌దుడు ఆ పిల్లల కోరిక‌ను తీర్చమ‌ని వినాయ‌కుని కోర‌డంతో... వినాయ‌కుడు, "సంతోషిమాత‌"ను సృష్టించాడు.  అలా వినాయకుని కుటుంబంలోకి సరికొత్త సంతోషాల‌ను తీసుకువ‌చ్చింది కాబ‌ట్టి, ఆమెను "సంతోషిమాత‌"గా పిల‌వ‌సాగారు.  కేవ‌లం దేవ‌త‌ల‌కే కాదు, త‌న‌ని కొలిచిన మాన‌వులంద‌రికీ స‌క‌ల‌ సంతోషాల‌నూ ఒస‌గుతుంది కాబ‌ట్టి ఆ పేరు స్థిర‌ప‌డిపోయింది. 💥ఒక చేత "ఖ‌డ్గం"తో, మ‌రోచేత "త్రిశూలం"తో ఉండి సింహారూఢినిగా సంచ‌రించే రూపం...   "సంతోషి మాత" 💥శ్రీసంతోషిమాత అష్టోత్తర శతనామావళిః💥 ఓం కమలసనాయై నమః ఓం కారుణ్య ర...

💥గురు స్వరూపం.. హయగ్రీవుడు!💥

Image
 ⚜️🕉️🚩 ఓం హయగ్రీవాయ నమః🌹🙏 💥గురు స్వరూపం.. హయగ్రీవుడు!💥 💥భగవంతుడే అందరికీ ఆది గురువు. ఒక్కో దేవతకూ ఒక్కో గురు స్వరూపం ఉంది. పరమేశ్వరుడిని గురువుగా భావిస్తే దక్షిణామూర్తిగా అనుగ్రహిస్తాడు. అమ్మవారిని గురువుగా కొలిస్తే శారదగా జ్ఞానం ప్రసాదిస్తుంది. విష్ణుమూర్తిని గురువుగా పూజిస్తే.. హయగ్రీవుడుగా కరుణిస్తాడు. నారాయణుడు ధరించిన అనేక అవతారాల్లో.. గురు స్వరూపం "హయగ్రీవుడు" జ్ఞానానందమయం దేవం నిర్మలస్పటికాకృతిం  | ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ||     వ్యాఖ్యా ముద్రాం కరసరసిజైః పుస్తకం శంఖచక్రే బిభ్రద్భిన్నస్పటికరుచిరే పుండరీకే నిషణ్ణః | అమ్లానశ్రీరమృతవిశదైరంశుభిః ప్లావయన్ మాం ఆవిర్భూయాదనఘ మహిమా మానసే వాగధీశః || 💥సృష్టి ఆదిలో మహావిష్ణువు నుంచి బ్రహ్మదేవుడు, ఆయన నుంచి దేవతలు ఉద్భవించారు. దేవతలంతా తమ కర్తవ్యం ఏమిటని బ్రహ్మను అడిగారట. అదే విషయాన్ని బ్రహ్మదేవుడు.. విష్ణుమూర్తిని అడిగాడట. అప్పుడు మహావిష్ణువు యజ్ఞం చేయాలని వారికి సూచించాడట. అయితే యజ్ఞం ఆచరించడానికి తగిన జ్ఞానం ప్రసాదించమని కోరాడట బ్రహ్మ. అప్పుడు నారాయణుడు హయగ్రీవ రూపంలో ప్రకటితమై.. "ప్రపంచాన్ని స...

అనాయాసేన మరణం వినా ధైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం.

Image
 ⚜️🕉️🚩 ఓం శివాయ గురవే నమః 🌹🙏 💥సకల చరాచర సృష్టికి మూలకారణమైన "పరమేశ్వరుడు" సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, అన్ని విద్యలకు మూలమైనవాడు. అందుకే ఆయనను #శివాయగురవేనమః అంటూ నమస్కరిస్తాము. జగద్గురో నమస్తుభ్యం శివాయ శివదాయ చ । యోగీన్ద్రాణాం చ యోగీన్ద్ర గురూణాం గురవే నమః ॥ 💥గుడి లోనికి వెళ్లినప్పుడు దేవుని ముందు నిల్చుని  రెండు చేతులను జోడించి, కళ్ళు తెరిచి ప్రశాంతమైన మనసుతో దర్శనం చేసుకొని... దర్శనం అయ్యి గుడి బయటకు వచ్చాక గుడి మండపంలో కూర్చుని కళ్ళు మూసుకుని అప్పుడు మళ్లీ భగవంతుని రూపాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆయనను ఈ క్రింది విధముగా అడగాలి. అనాయాసేన మరణం వినా ధైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం. 💥"అనాయాసేన మరణం" నాకు నొప్పి లేక బాధ కానీ లేని మరణాన్ని ప్రసాదించు. 💥"వినా ధైన్యేన జీవనం" నాకు ఎవరి మీదా ఆధారపడకుండా, నేను జీవితంలో ఎవరి ముందూ తలవంచకుండా, ఎవరినీ నొప్పించకుండా, నేను ఎవరి వద్దా చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు. 💥"దేహాంతే తవ సాన్నిధ్యం" మృత్యువు నావద్దకు వచ్చినప్పుడు నేను నిన్ను దర్శించుకునే విధంగా దీవించు.  💥"దేహిమే...

💥శ్రీ దత్తాత్రేయ స్తోత్రం💥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీదత్తాయ నమః🌹🙏 💥 గురువు "బ్రహ్మ"లా జ్ఞానాన్ని మనలో పుట్టించి , "విష్ణువు"లా రక్షించి, "శివుడి"లా అజ్ఞానాన్ని తుంచి మంచి చెడులను విశదీకరించి, మానవతా విలువలు, సద్గుణ సంపన్నతలు ఎలా పొందాలో నేర్పుతాడు. 💥దత్తాత్రేయ అవతారం జ్ఞాన అవతారం.  గురువుగా లోకోద్ధరణ కోసం అవతరించిన రూపం. 💥ఆయన కాశీ గంగలో స్నానమాచరించి, కొల్హాపురిలో భిక్ష తీసుకొని, సహ్యాద్రి శిఖరంలోని మాలాపురంలో నిద్రపోతారని పురాణాల్లో ఉంది.  💥అనేక సంవత్సరాల రాజ్యపాలన తర్వాత... జ్ఞానాన్వేషణలో ప్రహ్లాదుడు అరణ్యమార్గం పట్టాడు. అక్కడ, అజగరవృత్తిలో ఓ వ్యక్తి కనిపించాడు.  అజగరం అంటే... కొండచిలువ! ఆ విషప్రాణికో ప్రత్యేకత ఉంది. కొండచిలువ ఆహారం కోసం వేటకు వెళ్లదు. తాను ఉన్నచోటికి ఆహారం వస్తే మాత్రం... గుటుక్కున మింగి కడుపు నింపుకుంటుంది. లేకపోతే ఉపవాసమే. సాధకులు కూడా... ఆహారపానీయాల విషయంలో ఇలాంటి నిర్మోహత్వాన్నే అనుసరిస్తారు. పిచ్చివాడిలా కనిపిస్తున్న ఆ మనిషే దత్తుడని ప్రహ్లాదుడు గ్రహించాడు. "జై గురుదత్తా"  అంటూ పాదాల మీద పడ్డాడు. ఆ మహాగురువు కరుణించి జ్ఞానమార్గాన్ని బోధించాడు. 💥అత్రి ...

💥శ్రీరామ నామ మహిమ

Image
 ⚜️🕉️🚩 శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🌹🙏 💥ఎలాగైతే అత్యంత సూక్ష్మమైన మర్రి విత్తనం నుండి బ్రహ్మాండమైన వృక్షం ఉద్భవిస్తుందో, అలాగే "రాం" అనే బీజం నుండి ఈ చరాచర జగత్తంతా ఏర్పడింది. కాబట్టి ఈ కనబడే ప్రపంచమంతా రామమయమే.  మట్టి నుండి ఏర్పడిన కుండ, పిడత, బుంగ, తొట్టి, ప్రమిద ఎలాగ మృత్తికా స్వరూపమో, అలాగే ఈ జగమంతా రామ స్వరూపమే. 💥"శ్రీరామ" - ఈ సంబోధన శ్రీరామునికై పిలుపు. "జయరామ" ఇది అతని స్తుతి. "జయజయరామ" - ఇది అతని విషయంలో పరిపూర్ణ సమర్పణ. మంత్రాన్ని జపించే సమయంలో ఈ భావాలే వుండాలి. 💥అసలు శ్రీరామ నామ జపమే సమస్త పాపాలను నివృత్తి చేసే ఏకైక ఔషదం. శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం అజానుబాహుం మరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి 💥భావం: లక్ష్మీ సహితుడైన రాఘవుని, దశరథుని కుమారుని, అప్రమేయుని (కొలతలకు అందనివానిని), సీతాపతిని, రఘువంశంలో రత్నదీపంలా ప్రకాశించే వానిని, ఆజానుబాహుని, పద్మ దళాలవలె విశాలమైన కన్నులు గల వానిని, రాక్షసులను నశింపజేసినవానిని, శ్రీరామచంద్రునికి నమస్కరించుకుంటున్నాను. 💥విష్ణుమూర్తి యొక్క ఒక్కొక్క నామం సర్వదేవ...

💥లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము💥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ లక్ష్మీ నృసింహస్వామినే నమః🌹🙏 🌷🌼🌷🌼🌷🌼🌷🌼 💥హరి సర్వాంతర్యామి. ప్రహ్లాదవరదుడిగా స్తంభం నుంచి ఆవిర్భవించినా... ఆదిశంకరులను రక్షించేందుకు అరణ్యంలో సింహగర్జనలు చేసినా... అది సర్వ కాల సర్వావస్థల్లోనూ తానున్నానని చాటిచెప్పేందుకే... తరచిచూస్తే... నృసింహావతారం మనకు ఎన్నో విషయాలు బోధపరుస్తుంది. ఆయన ఎంత ప్రచండమో... అంత ప్రసన్నం. ఎంత ఉగ్రమో... అంత సమగ్రం. ఎంత అద్భుతమో... అంత ఆహ్లాదం. 💥హృదయాంతరాళాల్లో నుంచి "మమ దేహి కరావలంబం" అని పిలిస్తే చాలు ఆయనవచ్చి వాలిపోతాడు. ఎంతటి క్లిష్టసమస్యలనైనా ఎదుర్కొనే ధైర్యాన్నిస్తాడు. 🔸🔹🔸🔹🔸🔹🔸 💥లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము💥 శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే భోగింద్రభోగమణిరంజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ బ్రహ్మేంద్రరుద్రమరుదర్కకిరీటకోటి సంఘట్టితాంఘ్రికమలామలకాంతికాంత లక్ష్మీలసత్ కుచసరోరుహ రాజహంస లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్ సంసారసాగర విశాల కరాళకామ నక్రగ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య మగ్నస్య రాగలసదూర్మినిపీడితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ సంసారఘోరగహనే చరతో మురారే మారోగ్రభీకర మృ...

💥గణపతి ఏకదంతస్తోత్రం💥🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహా గణాధిపతయే నమః 🌹🙏 💥గణపతి ఏకదంతస్తోత్రం💥🙏 మదాసురం సుశాంతం వై దృష్ట్వా విష్ణుముఖాః సురాః | భృగ్వాదయశ్చ మునయ ఏకదంతం సమాయయుః || 1 || ప్రణమ్య తం ప్రపూజ్యాదౌ పునస్తం నేమురాదరాత్ | తుష్టువుర్హర్షసంయుక్తా ఏకదంతం గణేశ్వరమ్ || 2 || దేవర్షయ ఊచుః సదాత్మరూపం సకలాదిభూత -మమాయినం సోఽహమచింత్యబోధమ్ | అనాదిమధ్యాంతవిహీనమేకం తమేకదంతం శరణం వ్రజామః || 3 || అనంతచిద్రూపమయం గణేశం హ్యభేదభేదాదివిహీనమాద్యమ్ | హృది ప్రకాశస్య ధరం స్వధీస్థం తమేకదంతం శరణం వ్రజామః || 4 || విశ్వాదిభూతం హృది యోగినాం వై ప్రత్యక్షరూపేణ విభాంతమేకమ్ | సదా నిరాలంబ-సమాధిగమ్యం తమేకదంతం శరణం వ్రజామః || 5 || స్వబింబభావేన విలాసయుక్తం బిందుస్వరూపా రచితా స్వమాయా | తస్యాం స్వవీర్యం ప్రదదాతి యో వై తమేకదంతం శరణం వ్రజామః || 5 || త్వదీయ-వీర్యేణ సమస్తభూతా మాయా తయా సంరచితం చ విశ్వమ్ | నాదాత్మకం హ్యాత్మతయా ప్రతీతం తమేకదంతం శరణం వ్రజామః || 7 || త్వదీయ-సత్తాధరమేకదంతం గణేశమేకం త్రయబోధితారమ్ | సేవంత ఆపూర్యమజం త్రిసంస్థా- స్తమేకదంతం శరణం వ్రజామః || 8 || తతస్త్వయా ప్రేరిత ఏవ నాద- స్తేనేదమేవం రచితం జగద్వై | ఆనందరూపం సమభావసంస్థం తమేకదంత...

💥ఆ పరమేశ్వరుడికే గురువై ఓంకారానికి అర్థం చెప్పిన సుబ్రహ్మణ్యుని "స్వామిమలై"...

Image
 ⚜️🕉️🚩  ఓం సుబ్రహ్మణ్యస్వామినే నమః 🌹🙏 💥ఆ పరమేశ్వరుడికే గురువై ఓంకారానికి అర్థం చెప్పిన సుబ్రహ్మణ్యుని "స్వామిమలై"... సుబ్రహ్మణ్యస్వామి వారికి ఉన్న ఆరు ముఖ్యమైన క్షేత్రాలలో -  అయిదవది.  "స్వామి మలై" అంటే దేవుని పర్వతం అని అర్థం. సుబ్రహ్మణ్వేశ్వరుడు తన తండ్రిని శిష్యునిగా చేసుకుని.. తను గురువుగా ప్రణవ స్వరూపమైన ఓంకారానికి అర్థం చెప్పిన పవిత్ర ప్రదేశమిది. 💥పురాణ కథనం: ఒకసారి సృష్టి కర్త అయిన బ్రహ్మగారు కైలాసానికి వెళుతూ ఉండగా.. దోవలో కుమారస్వామి బ్రహ్మ గారిని ఆపి... "బ్రహ్మమనగా ఏమి? ప్రణవ మంత్రమైన ఓంకారానికి అర్థం చెప్పమని" అడిగాడు.  చతుర్ముఖ బ్రహ్మ గారు "బ్రహ్మము అనగా నేనే" అన్నారు. వెంటనే కార్తికేయుడు మీరు నాలుగు ముఖములతో వేదములు చెప్తున్నారు కాని, బ్రహ్మము అర్ధం కాలేదు అని ఆయన్ని బందీ చేశాడు. సృష్టికే మూలకర్త అయిన బ్రహ్మ దేవుడు బందీ అయ్యే సరికి సృష్టి ఆగిపోయింది. దాంతో దేవతలందరూ ఆ పరమశివుడి వద్దకు వెళ్ళి పరిస్థితి విన్నవించారు. అందరూ కలసి కుమారస్వామి వద్దకు వచ్చి బ్రహ్మదేవుణ్ణి విడిచి పెట్టమని అడిగారు. అందుకు కుమారస్వామి ఇలా అన్నాడు..  బ్రహ...

హనుమ ద్వారా మనం నేర్చుకోవాల్సినవి

Image
 ⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏 💥హనుమ కథలో... వెతుక్కుంటూ పొతే మన జీవితానికి కావలిసిన పాఠాలు ఎన్నో దొరుకుతాయి. 💥హనుమ ద్వారా మనం నేర్చుకోవాల్సినవి 1) ఎవరిని / దేనిని ఆశ్రయించావు? రావణుడు అపారమైన శివ భక్తుడు. అయినా పరకాంతల యందు.. పరుల సొమ్ము నందు వాంఛను చంపుకోలేకపోయాడు. చివరకు రాముని ఒక్క బాణం తో పది తలలు కూలి మట్టిలో కలిసిపోయాడు. ధర్మ మూర్తి అయిన శ్రీ రాముని పాదాలను పట్టి ఆశ్రయించి.. ఆయన బాట యందు నడిచిన స్వామి హనుమ "చిరంజీవి" గా మిగిలిపోయారు. చరిత్రలో నిలిచిపోయారు. జీవితం లో ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు దేన్ని పట్టుకోవాలో.. దేన్ని విడిచిపెట్టాలో తెలియాలి. సరైన మార్గాన్ని తెలుసుకోవాలి. తెలియడం కాదు.. పాటించే దమ్ము కూడా ఉండాలి. 🍁🍁🍁🍁🍁 2) అహం బ్రహ్మాస్మి - నేనే గొప్ప అని అనకు! నాదేం లేదు.. అనగలిగే గొప్ప స్వభావం కలిగి ఉండాలి! లంకకు వెళ్ళే ముందు హనుమ ఇలా అంటారు. నేను తలచుకుంటే నా శరీరాన్ని అమాంతం పెంచి వంగి ఒక్క చేత్తో అవతలి లంకా తీరాన్ని అందుకో గలను. అంత బలం ఉంది. కాని నేను ఎలా వెళ్తానో తెలుసా? "నా స్వామి రామ చంద్రమూర్తి యొక్క కుడిచేత్తో తన భుజం వెనుకనున్న అక్షయ బాణ తూ...

💥యముడు మార్కండేయుడిపై యమపాశం వేసినప్పుడు మార్కండేయుడు శివుని ప్రార్థిస్తూ స్తుతించిన స్తోత్రము.

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 💥యముడు మార్కండేయుడిపై యమపాశం వేసినప్పుడు మార్కండేయుడు శివుని ప్రార్థిస్తూ స్తుతించిన స్తోత్రము. 💥💥#చంద్రశేఖరాష్టకం💥💥 చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహి మామ్‌ | చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! రక్ష మామ్‌ | 1 రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం | శింజినీకృతపన్నగేశ్వర మచ్చుతానలసాయకం | క్షిప్రదగ్ధపురత్రయం త్రిదశాలయై రభివందితం | చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః | 2 పంచపాదపపుష్పగంధపదాంబుజద్వయశోభితం | ఫాలలోచనజాతపావకదగ్ధమన్మథవిగ్రహం | భస్మదిగ్ధకళేబరం భవనాశనం భవ మవ్యయం | చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః | 3 మత్తవారణముఖ్యచర్మకృతోత్తరీయమనోహరం | పంకజాసనపద్మలోచనపూజితాంఘ్రిసరోరుహమ్‌ | దేవసింధుతరంగశీకరసిక్తశుభ్రజటాధరం | చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః | 4 యక్షరాజసఖం భగాక్షహరం భుజంగవిభూషణం | శైలరాజసుతాపరిష్కృతచారువామకళేబరమ్‌ | క్ష్వేలనీలగళం పరశ్వథధారిణం మృగధారిణమ్‌ | చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః | 5 కుండలీకృతకుండలీశ్వరకుండలం వృషవాహనం | నారదాదిమునీశ్వరస్తుతవైభవం భువనేశ్వరమ్‌ | అంధకాంతక మాశ్రితామరపాదపం శమనాంతకం చంద్రశేఖర మాశ్రయే...

మనసు కోతి వంటిది. నిలకడ ఉండదు అంటూ శంకరులు చెప్పిన శ్లోకం –

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 🌹🌹మనసు కోతి వంటిది. నిలకడ ఉండదు. అన్నీ కావాలనుకొంటుంది.. ఎంగిలి చేసి వదిలేస్తుంది. మోహం ఎక్కువ అంటూ శంకరులు చెప్పిన శ్లోకం – సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశాశాఖాస్వటతి ఝటితి స్వైరమభితః । కపాలిన్ భిక్షో మే హృదయకపిమత్యన్తచపలం దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో ।।20।। 💥మనసు అనే కోతి అడవుల్లో పర్వతాలలో కుదురు లేకుండా గంతులు వేస్తూ ఉంటుంది. చెట్ల కొమ్మలపై పల్టీలు కొడుతుంది. దాన్ని అదుపు చేసి బంధించటం కష్టం. దానికి మోహం ఎక్కువ. పరుగులు పెడుతూ ఉంటుంది. నా వశంలో లేని నా మనసును నువ్వే భక్తి అనే త్రాడుతో బంధించి నీ స్వాధీనం చేసుకో నువ్వు భక్తి  అనే జ్ఞాన భిక్షను పెట్టే ఆదిభిక్షుడవు. 🌹🌹మనసు ఒక ఇల్లు అంటూ – శివ తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా భవ మమ గుణధుర్యాం బుద్ధికన్యాం ప్రదాస్యే । సకల భువన బన్ధో సచ్చిదానన్ద సిన్ధో సదయ హృదయగేహే సర్వదా సంవస త్వమ్ ।।84।। 💥సకల భువన బంధువైన శివా ! నా మనసు ఒక ఇల్లు. నాబుద్ధి ఒక కన్య. ఆకన్య గుణ గరిష్టురాలు. దాన్ని నీకు అర్పించాలని సంకల్పిస్తున్నా. నా కోరిక మన్నించి నామనసు అనే ఇంట్లో పార్వతీదేవితో వచ్చి ఉండిప...