💥శ్రీ దత్తాత్రేయ స్తోత్రం💥

 ⚜️🕉️🚩 ఓం శ్రీదత్తాయ నమః🌹🙏


💥 గురువు "బ్రహ్మ"లా జ్ఞానాన్ని మనలో పుట్టించి , "విష్ణువు"లా రక్షించి, "శివుడి"లా అజ్ఞానాన్ని తుంచి

మంచి చెడులను విశదీకరించి, మానవతా విలువలు,

సద్గుణ సంపన్నతలు ఎలా పొందాలో నేర్పుతాడు.


💥దత్తాత్రేయ అవతారం జ్ఞాన అవతారం. 

గురువుగా లోకోద్ధరణ కోసం అవతరించిన రూపం.


💥ఆయన కాశీ గంగలో స్నానమాచరించి, కొల్హాపురిలో భిక్ష తీసుకొని, సహ్యాద్రి శిఖరంలోని మాలాపురంలో నిద్రపోతారని పురాణాల్లో ఉంది. 


💥అనేక సంవత్సరాల రాజ్యపాలన తర్వాత... జ్ఞానాన్వేషణలో ప్రహ్లాదుడు అరణ్యమార్గం పట్టాడు.

అక్కడ, అజగరవృత్తిలో ఓ వ్యక్తి కనిపించాడు. 


అజగరం అంటే... కొండచిలువ!

ఆ విషప్రాణికో ప్రత్యేకత ఉంది.

కొండచిలువ ఆహారం కోసం వేటకు వెళ్లదు.

తాను ఉన్నచోటికి ఆహారం వస్తే మాత్రం... గుటుక్కున మింగి కడుపు నింపుకుంటుంది.

లేకపోతే ఉపవాసమే. సాధకులు కూడా... ఆహారపానీయాల విషయంలో ఇలాంటి నిర్మోహత్వాన్నే అనుసరిస్తారు.

పిచ్చివాడిలా కనిపిస్తున్న ఆ మనిషే దత్తుడని ప్రహ్లాదుడు గ్రహించాడు.

"జై గురుదత్తా"  అంటూ పాదాల మీద పడ్డాడు.

ఆ మహాగురువు కరుణించి జ్ఞానమార్గాన్ని బోధించాడు.


💥అత్రి  అంటే త్రిగుణాలకు అతీతుడు అని అర్థం.

సత్వ, రజో, తమోగుణాలకు అతీతంగా,

జాగ్ర, స్వప్న, సుషుప్తావస్థలకు అతీతమైన స్థితి కలిగి

దానికి అనసూయ తోడైనవారికి భగవంతుడు దత్తం అవుతాడు అన్నదే ఈ అవతార రహస్యం. 

🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸


💥శ్రీ దత్తాత్రేయ స్తోత్రం💥


జటాధరం పాండురాంగం శూలహస్తం కృపానిధిమ్ ।

సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే ॥ 1 ॥


అస్య శ్రీదత్తాత్రేయస్తోత్రమంత్రస్య భగవాన్నారదృషిః । అనుష్టుప్ ఛందః । శ్రీదత్తః పరమాత్మా దేవతా

శ్రీదత్తాత్రేయ ప్రీత్యర్థే జపే వినియోగః ॥


నారద ఉవాచ ।

జగదుత్పత్తికర్త్రే చ స్థితిసంహారహేతవే ।

భవపాశవిముక్తాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 1 ॥


జరాజన్మవినాశాయ దేహశుద్ధికరాయ చ ।

దిగంబర దయామూర్తే దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 2 ॥


కర్పూరకాంతిదేహాయ బ్రహ్మమూర్తిధరాయ చ ।

వేదశాస్త్రపరిజ్ఞాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 3 ॥


హ్రస్వదీర్ఘకృశస్థూలనామగోత్రవివర్జిత ।

పంచభూతైకదీప్తాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 4 ॥


యజ్ఞభోక్తే చ యజ్ఞాయ యజ్ఞరూపధరాయ చ ।

యజ్ఞప్రియాయ సిద్ధాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 5 ॥


ఆదౌ బ్రహ్మా హరిర్మధ్యే హ్యంతే దేవస్సదాశివః ।

మూర్తిత్రయస్వరూపాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 6 ॥


భోగాలయాయ భోగాయ యోగయోగ్యాయ ధారిణే ।

జితేంద్రియ జితజ్ఞాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 7 ॥


దిగంబరాయ దివ్యాయ దివ్యరూపధరాయ చ ।

సదోదితపరబ్రహ్మ దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 8 ॥


జంబూద్వీపే మహాక్షేత్రే మాతాపురనివాసినే ।

జయమాన సతాం దేవ దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 9 ॥


భిక్షాటనం గృహే గ్రామే పాత్రం హేమమయం కరే ।

నానాస్వాదమయీ భిక్షా దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 10 ॥


బ్రహ్మజ్ఞానమయీ ముద్రా వస్త్రే చాకాశభూతలే ।

ప్రజ్ఞానఘనబోధాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 11 ॥


అవధూత సదానంద పరబ్రహ్మస్వరూపిణే ।

విదేహదేహరూపాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 12 ॥


సత్యరూప సదాచార సత్యధర్మపరాయణ ।

సత్యాశ్రయపరోక్షాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 13 ॥


శూలహస్తగదాపాణే వనమాలాసుకంధర ।

యజ్ఞసూత్రధర బ్రహ్మన్ దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 14 ॥


క్షరాక్షరస్వరూపాయ పరాత్పరతరాయ చ ।

దత్తముక్తిపరస్తోత్ర దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 15 ॥


దత్త విద్యాఢ్య లక్ష్మీశ దత్త స్వాత్మస్వరూపిణే ।

గుణనిర్గుణరూపాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 16 ॥


శత్రునాశకరం స్తోత్రం జ్ఞానవిజ్ఞానదాయకమ్ ।

సర్వపాపం శమం యాతి దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 17 ॥


ఇదం స్తోత్రం మహద్దివ్యం దత్తప్రత్యక్షకారకమ్ ।

దత్తాత్రేయప్రసాదాచ్చ నారదేన ప్రకీర్తితమ్ ॥ 18 ॥


ఇతి శ్రీనారదపురాణే నారదవిరచితం శ్రీ దత్తాత్రేయ స్తోత్రమ్ ।

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం