💥ఆ పరమేశ్వరుడికే గురువై ఓంకారానికి అర్థం చెప్పిన సుబ్రహ్మణ్యుని "స్వామిమలై"...
⚜️🕉️🚩 ఓం సుబ్రహ్మణ్యస్వామినే నమః 🌹🙏
💥ఆ పరమేశ్వరుడికే గురువై ఓంకారానికి అర్థం చెప్పిన సుబ్రహ్మణ్యుని "స్వామిమలై"...
సుబ్రహ్మణ్యస్వామి వారికి ఉన్న ఆరు ముఖ్యమైన క్షేత్రాలలో - అయిదవది.
"స్వామి మలై" అంటే దేవుని పర్వతం అని అర్థం.
సుబ్రహ్మణ్వేశ్వరుడు తన తండ్రిని శిష్యునిగా చేసుకుని.. తను గురువుగా ప్రణవ స్వరూపమైన ఓంకారానికి అర్థం చెప్పిన పవిత్ర ప్రదేశమిది.
💥పురాణ కథనం:
ఒకసారి సృష్టి కర్త అయిన బ్రహ్మగారు కైలాసానికి వెళుతూ ఉండగా.. దోవలో కుమారస్వామి బ్రహ్మ గారిని ఆపి...
"బ్రహ్మమనగా ఏమి? ప్రణవ మంత్రమైన ఓంకారానికి అర్థం చెప్పమని" అడిగాడు.
చతుర్ముఖ బ్రహ్మ గారు "బ్రహ్మము అనగా నేనే" అన్నారు.
వెంటనే కార్తికేయుడు మీరు నాలుగు ముఖములతో వేదములు చెప్తున్నారు కాని, బ్రహ్మము అర్ధం కాలేదు అని ఆయన్ని బందీ చేశాడు.
సృష్టికే మూలకర్త అయిన బ్రహ్మ దేవుడు బందీ అయ్యే సరికి సృష్టి ఆగిపోయింది.
దాంతో దేవతలందరూ ఆ పరమశివుడి వద్దకు వెళ్ళి పరిస్థితి విన్నవించారు.
అందరూ కలసి కుమారస్వామి వద్దకు వచ్చి బ్రహ్మదేవుణ్ణి విడిచి పెట్టమని అడిగారు.
అందుకు కుమారస్వామి ఇలా అన్నాడు..
బ్రహ్మదేవున్ని ప్రణవ మంత్రమైన ఓంకారానికి అర్థం అడిగితే చెప్పలేదు. అందుకే బందీని చేశానని సమాధానం చెప్పి, ఇందులో తన తప్పు ఏమి లేదని చెప్పాడు.
అప్పుడు ఆ పరమేశ్వరుడు కుమారస్వామిని ఇలా ప్రశ్నించాడు. ఆయనకి తెలియదని బందీని చేశావు సరే.
మరి నీకు తెలుసా అని అడుగగా.. నేను చెప్తాను అన్నాడు.
అయితే నేను ప్రణవ మంత్రార్థాన్ని బోధిస్తున్నాను కనుక...
నేను గురువుని, నువ్వు అత్యంత భక్తి శ్రద్దలున్న శిష్యునిగా వింటానంటే చెప్తానన్నాడు.
కుమారుడు గురువయ్యాడు, తండ్రి శిష్యుడయ్యాడు.
తండ్రి అత్యంత భక్తి శ్రద్దలతో కుమారుడు ఉపదేశించిన ప్రణవ మంత్రార్థాన్ని విని పులకరించిపోయాడు.
"ఈశానః సర్వ విద్యానాం" అంటారు కదా.
ఇక్కడ దీని అంతరార్ధము ఏమిటంటే, ఏ తండ్రి అయినా తన కొడుకు చేతిలో ఓడిపోవడం ఇష్టపడతాడు.
కొడుకు చేతిలో తండ్రి ఓడిపోతే అది తనకి గొప్ప సన్మానముగా భావిస్తాడు తండ్రి.
లోకానికంతటికీ జ్ఞానమునిచ్చే తండ్రికి, తన తేజస్సుతో పుట్టిన పుత్రుడు జ్ఞాన బోధ చేయడం అనేది ఎంతో ఆనందదాయకమైన విషయము.
🔸🔹🔸🔹🔸🔹🔸
💥మరో పురాణ కథనం:
భృగు మహర్షి మహా తపస్సంపన్నుడు.
భృగు మహర్షి ఒకసారి తపస్సు ప్రారంభించడానికి ముందు తన తపస్సుని ఆటంక పరచిన వారికి అంతకు ముందున్న జ్ఞానం అంతా నశిస్తుందనే వరం పొంది తీవ్ర తపస్సు ప్రారంభించాడు.
ఆ తపోశక్తి ఊర్థ్వలోకాలకి వ్యాపించగా,
ఆ వేడిమిని భరించలేని దేవదేవుళ్ళు ఆ పరమేశ్వరుని శరణు కోరారు.
అప్పుడు ఈశ్వరుడు ఆ తపశ్శక్తి దేవలోకాలకి వ్యాపించకుండా తన చేయిని భృగు మహర్షి తలమీద అడ్డంగా పెట్టాడు.
దాంతో పరమశివునంత వారికి కూడా జ్ఝానం నశించింది.
తన పూర్వ జ్ఞానాన్ని తిరిగి పొందటానికి ఆయన జ్ఞాన స్వరూపుడైన సుబ్రహ్మణ్యస్వామి దగ్గర ఈ క్షేత్రంలో ప్రణవోపాసన పొందాడు.
💥ఆ పరమేశ్వరుడు ఈ జగత్తుకే స్వామి.
ఆ స్వామికి స్వామియై, నాథుడై ఉపదేశించాడు కనుక ఇక్కడ కుమార స్వామికి "స్వామినాథుడు" అనే పేరు వచ్చింది.
ఈ స్థలానికి స్వామిమలై అనే పేరు వచ్చింది.
💥పురాణ కథనం ప్రకారం స్వామిమలై సన్నిధికి వచ్చి నిశ్చల భక్తితో పూజించే వారి పాపాలన్నీ సూర్యుని ముందు పొగమంచులాగా కరిగిపోతాయి
అంటారు.
సేకరణ... 💐🌹
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment