మనసు కోతి వంటిది. నిలకడ ఉండదు అంటూ శంకరులు చెప్పిన శ్లోకం –
⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏
🌹🌹మనసు కోతి వంటిది. నిలకడ ఉండదు.
అన్నీ కావాలనుకొంటుంది.. ఎంగిలి చేసి వదిలేస్తుంది. మోహం ఎక్కువ అంటూ శంకరులు చెప్పిన శ్లోకం –
సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ
నటత్యాశాశాఖాస్వటతి ఝటితి స్వైరమభితః ।
కపాలిన్ భిక్షో మే హృదయకపిమత్యన్తచపలం
దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో ।।20।।
💥మనసు అనే కోతి అడవుల్లో పర్వతాలలో కుదురు లేకుండా గంతులు వేస్తూ ఉంటుంది.
చెట్ల కొమ్మలపై పల్టీలు కొడుతుంది.
దాన్ని అదుపు చేసి బంధించటం కష్టం.
దానికి మోహం ఎక్కువ.
పరుగులు పెడుతూ ఉంటుంది.
నా వశంలో లేని నా మనసును నువ్వే భక్తి అనే త్రాడుతో బంధించి నీ స్వాధీనం చేసుకో
నువ్వు భక్తి అనే జ్ఞాన భిక్షను పెట్టే ఆదిభిక్షుడవు.
🌹🌹మనసు ఒక ఇల్లు అంటూ –
శివ తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా
భవ మమ గుణధుర్యాం బుద్ధికన్యాం ప్రదాస్యే ।
సకల భువన బన్ధో సచ్చిదానన్ద సిన్ధో
సదయ హృదయగేహే సర్వదా సంవస త్వమ్ ।।84।।
💥సకల భువన బంధువైన శివా !
నా మనసు ఒక ఇల్లు. నాబుద్ధి ఒక కన్య.
ఆకన్య గుణ గరిష్టురాలు.
దాన్ని నీకు అర్పించాలని సంకల్పిస్తున్నా.
నా కోరిక మన్నించి నామనసు అనే ఇంట్లో పార్వతీదేవితో వచ్చి ఉండిపో.
నా బుద్ధికన్యను గ్రహించి ఇల్లరికపు అల్లుడిలాగా ఇక్కడే ఉంటే నిన్ను సదా సేవిస్తూ ధన్యుడనవుతాను.
🌹🌹మనసు ఒక అడవి అని వర్ణించే శ్లోకం –
మా గచ్ఛ త్వమితస్తతో గిరిశ భో మయ్యేవ వాసం కురు
స్వామిన్నాది కిరాత మామకమనః కాన్తారసీమాన్తరే ।
వర్తన్తే బహుశో మృగా మదజుషో మాత్సర్యమోహాదయః
తాన్ హత్వా మృగయా వినోద రుచితాలాభం చ సంప్రాప్స్యసి ।।43।।
💥శివా... నువ్వు ఎక్కడికీ పోవద్దు.
నాలోనే ఉండిపో. నామనసు ఒక అరణ్యం అని ముందే చెప్పాను. నువ్వేమో ఆది కిరాతకుడవు.
నీకు వేటాడటం చాలా ఇష్టం సరదా కదా.
నీకు కావలసినన్ని మృగాలు నాలోనే ఉన్నాయి. హాయిగా వేటాడి అనుభవించు... రా ఆలస్యం చేయకు. ఇవిగో కామ క్రోధ మద మాత్సర్యాలు అనే మృగాలు... వీటిని వేటాడి నీ వేట తీట తీర్చుకో అనుభవించు.. ఆస్వాదించు, వినోదించు, ప్రయోజనం పొందు.
🌹🌹మనసును ఒక పెట్టె గా అభివర్ణించిన మరో శ్లోకం
ఆశాపాశక్లేశదుర్వాసనాది
భేదోద్యుక్తైః దివ్యగన్ధైరమన్దైః ।
ఆశాశాటీకస్య పాదారవిన్దం
చేతఃపేటీం వాసితాం మే తనోతు ।।74।।
💥నా మనసు ఒక పెట్టె.
దాని నిండా అవిద్య, అస్మితం, రాగం, ద్వేషం అభినివేశం అనే అయిదు క్లేశాలు అనే దుర్వాసనతో ఉంది. ఇవి దుఃఖ హేతువులు.
దిక్కులే వస్త్రాలు కల దిగంబరుడైన శివుడి పాదపద్మాలు నా మనస్సు అనే పెట్టెలో ఉంటే ఆ క్లేశ దుర్వాసనలు అన్నీ తొలగి పోతాయి.
అవిద్య అంటే అజ్ఞానం.
అస్మితం అంటే సుఖ దుఖాలు నేను అనుభవిస్తున్నాను అనే భావం వలన కలిగే దుఖం.
రాగం అంటే ఇష్టమైన దానిపై కోరిక.. అవి దూరమైతే దుఖం.
ద్వేషం అంటే ఇష్టం లేని వస్తువులు దగ్గరైతే కలిగేది.
అభినివేశం అంటే తనను తాను ప్రేమించటం మరణాదుల వలన కలిగే దుఖం.
ఈ క్లేశాలు నశించాలంటే #శివజ్ఞానం ఒక్కటే మార్గం అని ఆంతర్యం.
సేకరణ... శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారు - ఉయ్యూరు రచనల నుండి 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment