💥గురు స్వరూపం.. హయగ్రీవుడు!💥

 ⚜️🕉️🚩 ఓం హయగ్రీవాయ నమః🌹🙏


💥గురు స్వరూపం.. హయగ్రీవుడు!💥


💥భగవంతుడే అందరికీ ఆది గురువు.

ఒక్కో దేవతకూ ఒక్కో గురు స్వరూపం ఉంది. పరమేశ్వరుడిని గురువుగా భావిస్తే దక్షిణామూర్తిగా అనుగ్రహిస్తాడు.

అమ్మవారిని గురువుగా కొలిస్తే శారదగా జ్ఞానం ప్రసాదిస్తుంది.

విష్ణుమూర్తిని గురువుగా పూజిస్తే.. హయగ్రీవుడుగా కరుణిస్తాడు.

నారాయణుడు ధరించిన అనేక అవతారాల్లో..

గురు స్వరూపం "హయగ్రీవుడు"


జ్ఞానానందమయం దేవం నిర్మలస్పటికాకృతిం  |

ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ||    


వ్యాఖ్యా ముద్రాం కరసరసిజైః పుస్తకం శంఖచక్రే

బిభ్రద్భిన్నస్పటికరుచిరే పుండరీకే నిషణ్ణః |


అమ్లానశ్రీరమృతవిశదైరంశుభిః ప్లావయన్ మాం

ఆవిర్భూయాదనఘ మహిమా మానసే వాగధీశః ||


💥సృష్టి ఆదిలో మహావిష్ణువు నుంచి బ్రహ్మదేవుడు, ఆయన నుంచి దేవతలు ఉద్భవించారు.

దేవతలంతా తమ కర్తవ్యం ఏమిటని బ్రహ్మను అడిగారట.

అదే విషయాన్ని బ్రహ్మదేవుడు.. విష్ణుమూర్తిని అడిగాడట.

అప్పుడు మహావిష్ణువు యజ్ఞం చేయాలని వారికి సూచించాడట.

అయితే యజ్ఞం ఆచరించడానికి తగిన జ్ఞానం ప్రసాదించమని కోరాడట బ్రహ్మ.

అప్పుడు నారాయణుడు హయగ్రీవ రూపంలో ప్రకటితమై.. "ప్రపంచాన్ని సృష్టించి, నడపగలిగే జ్ఞానం, యజ్ఞ విజ్ఞానాన్ని ఇస్తున్నాన"ని వేదాలను బ్రహ్మ దేవుడికి అనుగ్రహించాడట.

ఈ వేదాలను మధుకైటభులు అనే రాక్షసులు అపహరించగా.. హయగ్రీవుడు వాటిని సంరంక్షించి మళ్లీ బ్రహ్మకు అందజేశాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. 


💥హయగ్రీవుడి రూపం:

గుర్రం ముఖం, నర శరీరంతో ఉంటాడు.

గుర్రం ముఖం చైతన్యానికి ప్రతీక.

గుర్రం సకలింపు నుంచి బీజాక్షరాలు ఉద్భవించాయని అంటారు.

శుద్ధ స్పటిక రూపం ఆయనది.

నిర్మలత్వానికి చిహ్నం ఇది.

రెండు చేతుల్లో శంఖ, చక్రాలు ధరించి ఉంటాడు.

మరో చేతిలో పుస్తకం ఉంటుంది.

ఇంకో చేతిని చిన్ముద్రతో చూపుతూ భక్తులను అనుగ్రహిస్తుంటాడీ దేవుడు.


💥జ్ఞానాన్ని ప్రసాదించేవాడు హయగ్రీవుడు.

ఆయన్ను గురువుగా భావించి ఉపాసిస్తే.. సద్బుద్ధి కలుగుతుంది. సత్వ గుణం వికసిస్తుంది.

విద్యాప్రాప్తి కలుగుతుంది.

సకల దేవతా మంత్రాలు ఆధీనంలోకి వస్తాయని

చెబుతారు.


💥సర్వ విద్యా స్వరూపుడైన భగవంతుని విద్యాప్రదమైన అవతారం హయగ్రీవ అవతారం.


💥మనిషికి ప్రధానమైనది జ్ఞానం, జ్ఞానానికి ఆధారం శాస్త్రాలు, శాస్త్రాలకు మూలం వేదం.

ఆవేదాన్ని లోకానికి అందించిన అవతారం హయగ్రీవ అవతారం.


💥శ్రీమద్భాగవతంలో శ్రీసుఖమహర్షి పరిక్షిత్తు మహారాజుకి చేసే ఉపదేశంలో హయగ్రీవ అవతారం కూడా భగవంతుడు వేదోద్దరణ కోసం ఎత్తిన అవతారం అనేది తెలుస్తుంది.


💥హయగ్రీవుని ఆరాధించడం వల్ల అటు జ్ఞానమూ ఇటు విజయమూ రెండూ లభిస్తాయన్నది పెద్దల మాట.


💥సూర్యచంద్రులు కళ్లుగా, దేవతలు ఎముకలుగా, అష్టవసువులు పాదాలుగా, అగ్ని నాలుకగా, సత్యం వాక్కుగా, బ్రహ్మ హృదయంగా... ఇలా ఆయనలోని అణువణువూ దేవతామయమని అంటారు.

మరి అలాంటి హయగ్రీవుని ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించిన ఫలితం దక్కుతుంది కదా!

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం