💥శ్రీసంతోషిమాత అష్టోత్తర శతనామావళిః💥

 ⚜️🕉️🚩ఓం శ్రీ సంతోషి మహా దేవ్యై నమః🌹🙏


💥మంత్రం:

ఓం శ్రీ సంతోషి మహామాయే గజానందం దాయిని

శుక్రవార ప్రియే దేవి నారాయణి నమోస్తుతే.


💥ఉత్తరాదిన వినిపించే గాథ‌ల ప్రకారం సంతోషి మాత "వినాయ‌కుని" కుమార్తె. 

ఒక "ర‌క్షాబంధ‌నం" రోజున అన్నద‌మ్ములంద‌రూ, అక్కచెల్లెళ్లతో రాఖీ క‌ట్టించుకుంటున్నార‌ట‌. 

ఆ దృశ్యాల‌ని గ‌మ‌నించిన వినాయ‌కుని కుమారుల‌కి చాలా బాధ క‌లిగింద‌ట‌. 

త‌మ‌కి కూడా ఓ చ‌క్కటి "చెల్లెలు" ఉంటే ఎంత బాగుండేదో అనుకున్నార‌ట వాళ్లు. 

నార‌దుడు ఆ పిల్లల కోరిక‌ను తీర్చమ‌ని వినాయ‌కుని కోర‌డంతో... వినాయ‌కుడు, "సంతోషిమాత‌"ను సృష్టించాడు. 

అలా వినాయకుని కుటుంబంలోకి సరికొత్త సంతోషాల‌ను తీసుకువ‌చ్చింది కాబ‌ట్టి, ఆమెను "సంతోషిమాత‌"గా పిల‌వ‌సాగారు. 

కేవ‌లం దేవ‌త‌ల‌కే కాదు, త‌న‌ని కొలిచిన మాన‌వులంద‌రికీ స‌క‌ల‌ సంతోషాల‌నూ ఒస‌గుతుంది కాబ‌ట్టి ఆ పేరు స్థిర‌ప‌డిపోయింది.


💥ఒక చేత "ఖ‌డ్గం"తో, మ‌రోచేత "త్రిశూలం"తో ఉండి సింహారూఢినిగా సంచ‌రించే రూపం...  

"సంతోషి మాత"


💥శ్రీసంతోషిమాత అష్టోత్తర శతనామావళిః💥


ఓం కమలసనాయై నమః

ఓం కారుణ్య రూపిన్యై నమః

ఓం కిశోరిన్యై నమః

ఓం కుందరదనాయై నమః

ఓం కూటస్థాయై నమః

ఓం కేశవార్చితాయై నమః

ఓం కౌతుకాయై నమః

ఓం కంబుకంటాయై నమః

ఓం ఖడ్గదాయిన్యై నమః

ఓం గగన చారిన్యై నమః

ఓం గాయత్రై నమః

ఓం గీతప్రియాయై నమః

ఓం గూడప్రియాయై నమః

ఓం గూడాత్మికాయై నమః

ఓం గోపిరూన్యై నమః

ఓం గౌర్యై నమః

ఓం గంధప్రియాయై నమః

ఓం ఘంటారవాయై నమః

ఓం ఘోష నాయై నమః

ఓం చంద్రాసనాయై నమః

ఓం చామీకరంగాయై నమః

ఓం చిత్స్యరూపిన్యై నమః

ఓం చూడామన్యై నమః

ఓం చేతానాయై నమః

ఓం ఛాయాయై నమః

ఓం జగద్దాత్రే నమః

ఓం జాతి ప్రియాయై నమః

ఓం జీమూతనాదిన్యై నమః

ఓం జేత్రే నమః

ఓం శ్రీ జ్ఞానదాయై నమః

ఓం ఝల్లరీ ప్రియాయై నమః

ఓం టంకార ప్రియాయై నమః

ఓం డమరు ప్రియాయై నమః

ఓం డక్కానాద్య ప్రియాయై నమః

ఓం తత్త్వస్వారూపిన్యై నమః

ఓం తాపన ప్రియాయై  నమః

ఓం ప్రియ భాషిన్యై నమః

ఓం తీర్థప్రియాయై నమః

ఓం తుషార ప్రియాయై నమః

ఓం తూష్నీ శీలాయై నమః

ఓం తెజస్విన్యై నమః

ఓం త్రపాయై నమః

ఓం త్రాణాదాయై నమః

ఓం త్రిగునాత్మికాయై నమః

ఓం త్రయంబకాయై నమః

ఓం త్రయీధర్మాయై నమః

ఓం దక్షాయై నమః

ఓం దాడిమీప్రియాయై నమః

ఓం దినకర ప్రభాయై నమః

ఓం ధీన ప్రియాయై నమః

ఓం మైత్ర్యే నమః

ఓం మోహిన్యై నమః

ఓం మోక్షదాయిన్యై నమః

ఓం మందార మాలిన్యై నమః

ఓం మంజులాయై నమః

ఓం యశోదాయై నమః

ఓం రక్తాంబరాయై నమః

ఓం లలితాయై నమః

ఓం వత్సప్రియాయై నమః

ఓం శరణ్యాయై నమః

ఓం షట్కర్మ ప్రియాయై నమః

ఓం సంసిధ్యై నమః

ఓం సంతోషిన్యై నమః

ఓం హంసప్రియాయై నమః

ఓం సంతోషీ మాతృదేవతాయై నమః


💥#సంతోషిమాత_వ్రతం💥


💥16 శుక్రవారాల‌పాటు ఒంటిపూట భోజ‌నం మాత్రమే చేస్తూ, అమ్మవారిని పూజించాలి. 

ఇందుకోసం పంచ‌భ‌క్ష్యాలు ఏవీ అవ‌స‌రం లేదు. 

ప్రతి  ఇంట్లోనూ ఉండే బెల్లం/ ప‌ంచ‌దార‌, కాసిని శ‌న‌గ‌లు నివేదిస్తే చాలు అమ్మవారు సంతోషిస్తారు. అయితే వ్రతాన్ని ఆచ‌రించే స‌మ‌యంలో 

👉పుల్లటి ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం మాత్రం నిషిద్ధం.  


ఇక 16వ శుక్రవారం నాడు 8 మంది బాలుర‌ను భోజ‌నానికి పిలిచి, ఈ వ్రతానికి ఉద్యాప‌న చేయాలి. 


సంతోషిమాత వ్రతాన్ని ఆచ‌రించి స‌క‌ల‌శుభాల‌ను పొందిన స‌త్యవ‌తి అనే భక్తురాలి క‌థ‌ను ఈ సంద‌ర్భంగా గుర్తుచేసుకుంటారు.


💥సంతోషిమాత, ల‌క్ష్మీదేవి అవ‌తార‌మ‌ని కొంద‌రంటే... దుర్గామాతకి ప్రస‌న్న రూపమే సంతోషిమాత అని మ‌రికొంద‌రు విశ్వసిస్తారు. 

ఎవ‌రేమ‌నుకున్నా, ఎలా కొలుచుకున్నా సంతోషిమాత స‌క‌ల సంతోషాల‌నూ ఒస‌గుతూనే ఉంది. 

ఎందుకంటే ఆమె భ‌క్తులంద‌రికీ త‌ల్లి క‌దా...

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం