💥లోకబాంధవుడు💥

 ⚜️🕉️🚩 ఓం సూర్య నారాయణాయ నమః🌹🙏


రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతమ్ |

పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్ || 


💥భావం:

సూర్యుడు ప్రశస్తమైన కిరణములు కలవాడు. ఉదయపర్వతమందు ఉదయించువాడు (లోకులను తమ తమ పనులలో ప్రవర్తింపచేయువాడు అని కొందరు వ్యాఖ్యాతలు)

దేవతలచేత, అసురులచేత కూడ నమస్కరింప బడినవాడు.

తన తేజస్సుచే ఇతరుల తేజస్సులను కప్పి వేయువాడు. కాంతిని ఇచ్చువాడు. సర్వలోకములను నియమించువాడు.

అట్టి సూర్యుని ఆరాధింపుము.


💥లోకబాంధవుడు💥


దేవతలు, మానవులే కాదు.. రాముడు, కృష్ణుడు లాంటి అవతార పురుషులూ ఆయనను అర్చించారు.


శ్రీరామచంద్రుడు ఆదిత్య హృదయస్తోత్ర పఠనంతోనే లంకేశ్వరుడిపై విజయం సాధించాడని,


హనుమ సూర్యోపాసన ద్వారానే సర్వవిద్యలు అభ్యసించినట్లు పురాణ కథనం.


శ్రీకృష్ణుడి కుమారుడు సాంబుడు సూర్యారాధనతో కుష్టువ్యాధి నుంచి విముక్తుడయ్యాడట.


ధర్మరాజు వనవాస కాలంలో సూర్యారాధనతోనే ‘అక్షయ పాత్ర’ను పొంది ఆకలిదప్పులను జయించగలిగాడు.


దివాకరుడిని ప్రసన్నం చేసుకునే సత్రాజిత్‌ "శ్యమంతకమణి"ని పొందాడు.


మానవ మనుగడకు ప్రధాన మైన ఆహార, ఆరోగ్యప్రదాత సూర్యభగవానుడే.


#సర్వం_సూర్యమయం_జగత్‌

సకల జగత్తు ఆయన తేజస్సుతో చైతన్యం పొందుతోంది.

సమస్త ప్రాణకోటి ఆయనపైనే ఆధారపడి ఉంది. 


#నమస్కార_ప్రియో_భానుః

కేవలం వందనంతోనే ప్రసన్నుడై ఆరోగ్య విజ్ఞానాలను ప్రసా దించే ప్రత్యక్ష భగవానుడు సూర్యదేవుడు. 


యోగ్యత, అయోగ్యతలతో నిమిత్తం లేకుండా సర్వ జీవకోటికి సమానంగా వెలుగులు (కాంతులు) పంచే భగ వానుడు.


సృష్టి స్థితి లయలు సూర్యుని ప్రమేయంతోనే జరుగుతున్నాయని...


సూర్యాద్భవంతి భూతాని సూర్యేణ పాలితానిచ/

సూర్యే లయం ప్రాప్నువంతి య సూర్యః సోహ మేవచ

 - "సూర్యోపనిషత్తు" పేర్కొంది.


💥తినే మెతుకుపై వారి వారి పేర్లుంటాయన్నది ఎంత నిజమో, పండే ప్రతి గింజ సూర్య భగవానుడి దయాపాత్రమనడం అంతే నిజమంటారు విజ్ఞులు.


సమస్త లోకాలకు కర్మసాక్షిగా అనంతమైన శక్తి కిరణాలతో వెలుగును, తేజస్సును ప్రసాదిస్తున్న ఆదిత్యుడు..

ఆదితి కశ్యప ప్రజాపతి కుమారుడిగా విశాఖ నక్షత్రంలో ఉద్భవించినట్లు బ్రహ్మాండ పురాణ కథనం.


సూర్యభగవానుడు సమత్వానికి, చైతన్యానికి, క్రమశిక్షణకు ప్రతీక.

తరతమ భేదాలు, పాప పుణ్యాలతో నిమిత్తం లేకుండా అందరికి వెలుగు నిస్తాడు.

ఆయన ఉదయాస్తమానాలు క్రమశిక్షణకు నిదర్శనం. 


కాలానికి ఆదిత్యుడే కొలమానం.

సమస్త జీవరాశికి ఆధారభూతుడు.

కాలం ఎవరి కోసం ఆగదని నిరూపిస్తూ సాగుతాడు. 


"లోకబాంధవుడు" సూర్యుడు ఎవరి ప్రభావం లేకుండానే ఉదయిస్తూ, ఆరోగ్యభాగ్యాన్ని ప్రసాదిస్తూ తన పని చేసుకుంటూ పోతాడు.

ఎప్పటిపనులు అప్పుడు చేయాలన్న సందేశం ఆయన గమనంలో కనిపిస్తుంది.


సప్తలోక ప్రకాశాయ సప్తసప్త రథాయచ

సప్త ద్వీప ప్రకాశయ భాస్కరాయ నమోనమః


💥#ఆరోగ్యం_భాస్కరాదిచ్చేత్‌

(ఆరోగ్యం కోసం భాస్కరుని ఆరాధించాలి) అంటారు.


వేదకాలంలో ప్రస్కణ్వుడు అనే మహర్షి సౌరమంత్రాలు మూడుసార్లు జపించి చర్మవ్యాధి నుంచి విముక్తుడయ్యాడని (అది ‘తృచభాస్కరం’ అని ప్రసిద్ధికెక్కింది).


మయూరుడనే కుష్టువ్యాధిగ్రస్తుడు ‘సూర్యశతకం’ రచనతో సంపూర్ణ ఆరోగ్యం పొందారని చెబుతారు.


💥సూర్యారాధన సర్వరోగాలను హరించి ఆరోగ్యాన్ని, బలాన్ని, తేజస్సును ప్రసాదిస్తుంది. 


ఆయన ఔషధరూపుడని, ఆయన కిరాణాల వల్ల ఎన్నో వ్యాధులు తొలగి పోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఉదయాస్తమయ వేళల్లోని సూర్యకిరణాలు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయని ఆయుర్వేదం చెబుతోంది.


ఆదివారాలలో సూర్య నమస్కారాలు చేసి పాలను నివేదిస్తే సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం