💥శివ అక్షరమాలాస్తోత్రము💥

 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏


💥 శివుడు మంగళాన్ని కలిగిస్తాడు.

శాంతిని పెంచుతాడు.

అకాల మృత్యువును దరి చేరనీయడు.

సకల ఐశ్వర్యాలనూ అందిస్తాడు.


💥భారతీయ దైవాలన్నీ ఖగోళ-భూగోళ ప్రకృతికి ప్రతీకలే.

శివలింగం మనం నివసించే భూగోళానికి ప్రతీక. 


🍁చంద్రశేఖరుడు శివుడు.

భూమికి ఉపగ్రహం చంద్రుడు.


🍁గంగాధరుడు శివుడు.

భూమిపైనా మూడింట రెండువంతులు జలం ఉంటుంది.


🍁శివుడు దిగంబరుడు.

భూమి కూడా ఆకాశంలో దిక్కులే అంబరంగా తిరుగుతుంది.


🍁శివుడు లింగస్వరూపుడైతే భూమి ఆకారం గోళాకృతి.


🍁మహాకాలుడు శివుడు.

భూమ్మీద ఉన్న వారికి కాలం అనేది భూమి ఆత్మభ్రమణ, పరిభ్రమణ కాలాల వల్లనే తెలుస్తుంది.


🍁లయకారకుడు శివుడు.

భూమిపైన జీవులు మరణిస్తే భూమిలోనే లయం కావలసిందే.


🍁విభూతి ధారణ శివుని ధర్మం.

భూమ్మీద ఉండేది మట్టి మాత్రమే.


🍁పార్వతికి భర్త శివుడు.

భూమి చుట్టూ ఉండే ఓజోన్‌ పొర లోపలి పాంచభౌతిక ప్రకృతికి పార్వతి ప్రతీక.


🍁శివుడు అర్ధ నారీశ్వరుడు.

ప్రకృతి, భూమి సంగమం వల్లనే ఈ సృష్టి ఏర్పడుతుంది. అందుకే, రెండూ కలిసి మాత్రమే ఉంటాయి.


🍁గణపతికి తండ్రి ఆయన.

భూమి లోని గురుత్వాకర్షణ శక్తి గణపతి.


🍁కుమార జనకుడు శివుడు.

భూమి చుట్టూ ఉండే విద్యుదయస్కాంత రూపమైన సర్పశక్తికి కుమారస్వామి ప్రతీక.

ఇవే శివుని మెడలోని సర్పాలు కూడా.


🍁అభిషేక ప్రియుడు శివుడు.

భూమిపైన కురిసే వర్షమే మనకు ఆహారాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది.

అందుకే, శివలింగానికి నిరంతరం అభిషేకం చేస్తూ వర్షాలు కురవాలనే భావాన్ని ప్రకటిస్తాం.


🍁ఐశ్వర్య ప్రదాత ఈశ్వరుడు.

భౌతికమైన అన్నిరకాల సంపదలూ (పెట్రోల్‌, సహజవాయువు, బొగ్గు, వజ్రాలు, గ్రానైట్‌, నీరు వంటివన్నీ) భూమి పైన,లోపలా ఉన్నాయి.

అందుకే "సర్వ సముద్భవ కారణ లింగం" అని నమస్కరిస్తున్నాం. 


ఇలా శివలింగం ఎన్నో అంశాలకు ప్రతీకగా కనిపిస్తుంది.


💥శివపూజలో శివలింగంపై బిల్వదళాలు, తులసీ దళాలు పెట్టి పూజించే సంప్రదాయం ఉంది.

దీని అర్థం భూమిపై చాలా విరివిగా బిల్వవృక్షాలు, తులసీ వృక్షాలు పెంచి పోషించాలని!

ఆ వృక్షాలు అధికమైన చోట కాలుష్యాలన్నీ నియంత్రితమై ఆనందంగా అందరూ జీవిస్తారని.


💥ఎన్నో రూపాల్లో సంతోషాన్నిచ్చే ఈ భూమి పుట్టిన కాలాన్నే "లింగోద్భవ" కాలంగా గుర్తించి...

లింగోద్భవ కాలంలో భూగోళరూప శివుని మరింత భక్తి శ్రద్ధలతో ఆరాధిద్దాం.

సేకరణ.. సాగి కమలాకర శర్మ గారి రచనల నుండి💐🙏

🔸🔹🔸🔹🔸🔹🔸🔹


💥శివ అక్షరమాలాస్తోత్రము💥


సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ ||


అద్భుతవిగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ |


ఆనందామృత ఆశ్రితరక్షక ఆత్మానంద మహేశ శివ |


ఇందుకళాధర ఇంద్రాదిప్రియ సుందరరూప సురేశ శివ |


ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ సేవిత కీర్తి శివ |


ఉరగాదిప్రియ ఉరగవిభూషణ నరకవినాశ నటేశ శివ |


ఊర్జిత దానవనాశ పరాత్పర ఆర్జితపాపవినాశ శివ |


ఋగ్వేదశ్రుతి మౌళి విభూషణ రవి చంద్రాగ్నిత్రినేత్ర శివ |


ఋపనామాది ప్రపంచవిలక్షణ తాపనివారణ తత్వ శివ |


ళుల్లిస్వరూప సహస్రకరోత్తమ వాగీశ్వర వరదేశ శివ |


ళూతాధీశ్వర రూపప్రియ హర వేదాంతప్రియ వేద్య శివ |


ఏకానేక స్వరూప సదాశివ భోగాదిప్రియ పూర్ణ శివ |


ఐశ్వర్యాశ్రయ చిన్మయ చిద్ఘన సచ్చిదానంద సురేశ శివ |


ఓంకారప్రియ ఉరగవిభూషణ హ్రీంకారప్రియ ఈశ శివ |


ఔరసలాలిత అంతకనాశన గౌరిసమేత గిరీశ శివ |


అంబరవాస చిదంబర నాయక తుంబురు నారద సేవ్య శివ |


ఆహారప్రియ అష్ట దిగీశ్వర యోగిహృది ప్రియవాస శివ |


కమలాపూజిత కైలాసప్రియ కరుణాసాగర కాశి శివ |


ఖడ్గశూల మృగ టంకధనుర్ధర విక్రమరూప విశ్వేశ శివ |


గంగా గిరిసుత వల్లభ శంకర గణహిత సర్వజనేశ శివ |


ఘాతకభంజన పాతకనాశన దీనజనప్రియ దీప్తి శివ |


గాంతస్వరూపానంద జనాశ్రయ వేదస్వరూప వేద్య శివ |


చండవినాశన సకలజనప్రియ మండలాధీశ మహేశ శివ |


ఛత్రకిరీట సుకుండల శోభిత పుత్రప్రియ భువనేశ శివ |


జన్మజరా మృత్య్వాది వినాశన కల్మషరహిత కాశి శివ |


ఝంకారప్రియ భృంగిరిటప్రియ ఓంకారేశ్వర విశ్వేశ శివ |


జ్ఞానాజ్ఞాన వినాశన నిర్మల దీనజనప్రియ దీప్తి శివ |


టంకస్వరూప సహస్రకరోత్తమ వాగీశ్వర వరదేశ శివ |


ఢక్కాద్యాయుధ సేవిత సురగణ లావణ్యామృత లసిత శివ |


డంభవినాశన డిండిమభూషణ అంబరవాస చిదేక శివ |


ఢంఢంఢమరుక ధరణీనిశ్చల ఢుంఢివినాయక సేవ్య శివ |


నానామణిగణ భూషణనిర్గుణ నతజనపూత సనాథ శివ |


తత్వమస్యాది వాక్యార్థ స్వరూప నిత్యస్వరూప నిజేశ శివ |


స్థావరజంగమ భువనవిలక్షణ తాపనివారణ తత్వ శివ |


దంతివినాశన దళితమనోభవ చందన లేపిత చరణ శివ |


ధరణీధరశుభ ధవళవిభాసిత ధనదాదిప్రియ దాన శివ |


నళినవిలోచన నటనమనోహర అలికులభూషణ అమృత శివ |


పార్వతినాయక పన్నగభూషణ పరమానంద పరేశ శివ |


ఫాలవిలోచన భానుకోటిప్రభ హాలాహలధర అమృత శివ |


బంధవిమోచన బృహతీపావన స్కందాదిప్రియ కనక శివ |


భస్మవిలేపన భవభయమోచన విస్మయరూప విశ్వేశ శివ |


మన్మథనాశన మధురానాయక మందరపర్వతవాస శివ |


యతిజన హృదయాధినివాస విధివిష్ణ్వాది సురేశ శివ |


రామేశ్వర పుర రమణ ముఖామ్బుజ సోమేశ్వర సుకృతేశ శివ |


లంకాధీశ్వర సురగణ సేవిత లావణ్యామృత లసిత శివ |


వరదాభయకర వాసుకిభూషణ వనమాలాది విభూష శివ |


శాంతి స్వరూపాతిప్రియ సుందర వాగీశ్వర వరదేశ శివ |


షణ్ముఖజనక సురేంద్రమునిప్రియ షాడ్గుణ్యాది సమేత శివ |


సంసారార్ణవ నాశన శాశ్వత సాధుజన ప్రియవాస శివ |


హరపురుషోత్తమ అద్వైతామృత మురరిపుసేవ్య మృడేశ శివ |


లాలిత భక్తజనేశ నిజేశ్వర కాళినటేశ్వర కామ శివ |


క్షరరూపాభి ప్రియాన్విత సుందర సాక్షాత్ స్వామిన్నంబా సమేత శివ |


సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు