⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ 🌹🙏

 ⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ 🌹🙏


💥అన్నమయ్య కీర్తన:💥


ఉన్నమంత్రాలిందు సదా(రా) వొగివిచారించుకొంటే

విన్నకన్నవారికెల్ల విష్ణునామమంత్రము


పరగ పుచ్చకాయల పరసిపోదు మంత్రము

గరిమ ముట్టంటులేని ఘనమంత్రము

వరుస నెవ్వరు విన్నా వాడిచెడనిమంత్రము

అరయనిదొక్కటేపో హరినామమంత్రము


యేజాతినోరికైన నెంగిలి లేని మంత్రము

వోజదప్పితే జెడకవుండే మంత్రము

తేజాన నొకరికిస్తే తీరిపోనిమంత్రము

సాజమైన దిదెపో సత్యమైన మంత్రము


యిహము పరము తానే యియ్యజాలిన మంత్రము

సహజమై వేదాలసారమంత్రము

బహునారదాదులెల్ల పాటపాడినమంత్రము

విహితమయిన శ్రీవేంకటేశుమంత్రము


🍁🍁🍁🍁🍁


అన్ని మంత్రములు ఇందె ఆవహించెను

వెన్నతో నాకు గలిగె వేంకటేశు మంత్రము


నారదుడు జపియించె నారాయణ మంత్రము

చేరె ప్రహ్లాదుడు నారసింహ మంత్రము

కోరి విభీషణుడు చేకొనె రామ మంత్రము

వేరెనాకు గలిగె వేంకటేశు మంత్రము


రంగగు వాసుదేవ మంత్రము ధృవుండు జపించె

అంగవించె కృష్ణ మంత్రము అర్జునుడు

ముంగిట విష్ణు మంత్రము మొగిశుకుడు పఠించె

వింగడమై నాకు నబ్బె వేంకటేశు మంత్రము


ఇన్ని మంత్రముల కెల్ల ఇందిరనాథుడె గుఱి

పన్నిన దిదియే పరబ్రహ్మ మంత్రము

నన్ను గావగలిగేబో నాకు గురుడియ్యగాను

వెన్నెల వంటిది శ్రీవేంకటేశు మంత్రము


💥విష్ణు నామ మంత్ర విశిష్టతను ఈ సంకీర్తనలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు.


శ్రీ మహా విష్ణు మంత్రము సాటిలేనిది.

తత్త్వ విచారణతో చూస్తే దీనికి సాటికి రాగల మరొక మంత్రం లేదు.

హరి నామ మంత్రము ముట్టు, అంటూ లేనిది.

ఎవరైనా వినవచ్చు, పఠించవచ్చు!

కులమత జాతి బేధములు లేక ఈ మంత్రోపాసన, మంత్రోఛ్ఛారణ చెయ్యవచ్చు.


ఇది ఎంతమందికి పంచినా తరగని మంత్రము!

సకల వేదాల సారమైన ఈ మంత్రం ఇహపరాలను అవలీలగా అందిస్తుంది.

విష్ణు భక్తులైన నారదాదులు భక్తితో పాటలుగా పాడుకున్న మంత్రం!

కలియుగంలో మనందరకు శ్రీ వెంకటేశ మంత్రంగా విహితమైనది!

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

వైశాఖ అమావాస్య శని జయంతి.

💥సింహాచల చందనోత్సవం💥