అనాయాసేన మరణం వినా ధైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం.
⚜️🕉️🚩 ఓం శివాయ గురవే నమః 🌹🙏
💥సకల చరాచర సృష్టికి మూలకారణమైన "పరమేశ్వరుడు" సర్వజ్ఞుడు, సర్వవ్యాపి,
అన్ని విద్యలకు మూలమైనవాడు.
అందుకే ఆయనను #శివాయగురవేనమః అంటూ నమస్కరిస్తాము.
జగద్గురో నమస్తుభ్యం శివాయ శివదాయ చ ।
యోగీన్ద్రాణాం చ యోగీన్ద్ర గురూణాం గురవే నమః ॥
💥గుడి లోనికి వెళ్లినప్పుడు దేవుని ముందు నిల్చుని రెండు చేతులను జోడించి, కళ్ళు తెరిచి ప్రశాంతమైన మనసుతో దర్శనం చేసుకొని...
దర్శనం అయ్యి గుడి బయటకు వచ్చాక గుడి మండపంలో కూర్చుని కళ్ళు మూసుకుని అప్పుడు మళ్లీ భగవంతుని రూపాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆయనను ఈ క్రింది విధముగా అడగాలి.
అనాయాసేన మరణం
వినా ధైన్యేన జీవనం
దేహాంతే తవ సాన్నిధ్యం
దేహిమే పరమేశ్వరం.
💥"అనాయాసేన మరణం"
నాకు నొప్పి లేక బాధ కానీ లేని మరణాన్ని ప్రసాదించు.
💥"వినా ధైన్యేన జీవనం"
నాకు ఎవరి మీదా ఆధారపడకుండా,
నేను జీవితంలో ఎవరి ముందూ తలవంచకుండా,
ఎవరినీ నొప్పించకుండా, నేను ఎవరి వద్దా చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు.
💥"దేహాంతే తవ సాన్నిధ్యం"
మృత్యువు నావద్దకు వచ్చినప్పుడు నేను నిన్ను
దర్శించుకునే విధంగా దీవించు.
💥"దేహిమే పరమేశ్వరా"
ఓ పరమేశ్వర! నాకు ఈ క్రింది మూడు వరములను ప్రసాదించమని నిన్ను ప్రార్ధిస్తున్నాను.
🍁🍁🍁🍁🍁
అనుక్షణం నీ ప్రార్ధన లొనే గడిపే విధముగా అనుగ్రహించు.
నీ ప్రార్ధనతో నన్ను ఉత్తమమైన మార్గంలోకి తీసుకు వెళ్ళు.
ఎప్పుడూ కూడా నేను నిన్ను... నాకు కానీ నా బిడ్డలకు కానీ సంపదలు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ ఇవ్వమని అడగను.
కానీ నాకు నీవు ఉత్తమమైన నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహించు.
నాకు ఎప్పుడూ కూడా నీవు సదా అండగా ఉండి నన్ను ఉత్తమమైన మార్గంలో నడిపించు.
🌹లోకా సమస్తా సుఖినో భవంతు🌹🙏
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment