💥॥ శ్రీ పరమేశ్వర స్తుతిః (వసిష్ఠ కృతమ్) ॥💥

 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏


💥ఆదిదేవుడిగా, సర్వజ్ఞుడిగా, భోళాశంకరుడిగా, పరమశివునిగా కీర్తించబడే పరమాత్మయే "పరమేశ్వరుడు"


లింగ స్వరూపంలో పూజలందుకునే ఈ పరమశివుడే సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములను నిర్వహిస్తూ భక్తుల పాలిట కల్పవృక్షంగా భాసిస్తూ ఉంటాడు.

జగన్మాత అయిన పార్వతీదేవి ఈయన అర్ధాంగి. పార్వతీపరమేశ్వరులు ఆదిదంపతులుగా సకల లోక వాసుల చేత పూజలందుకుంటూ ఉంటారు. 


💥శివ కుటుంబం కూడా చాలా చిత్రమైనది.

శివుడు త్రినేత్రుడై, భస్మాంగధారియై, పాములను ఆభరణాలుగా వేసుకుని, గజచర్మాన్ని ధరించి ఉంటే, అమ్మవారు సకలాభరణ భూషితురాలై అలరారుతూ ఉంటుంది.


పెద్దకుమారుడైన విఘ్నేశ్వరుడు గజముఖుడు. చిన్నకుమారుడైన కుమారస్వామి ఆరు ముఖములు కలవాడు.

విరోధ భావన కలిగిన జీవులైన ఎద్దు, సింహం, ఎలుక, నెమలి, పాము, శివ సదనమైన కైలాసగిరిపై సఖ్యతతో తిరుగాడుతూ ఉంటాయి.


💥పరమేశ్వరుడిని నిరంతరారాధన చేసే వారి హృదయమే కైలాసమై, వారి మనసు లోని కామక్రోధాదులు శమించి నిరంతరానందాన్ని పొందుతారన్న సత్యాన్ని పైవిషయం ప్రబోధిస్తుంది.


నిర్గుణ పరబ్రహ్మ యొక్క కర్మ స్వరూపం శ్రీమహావిష్ణువు అయితే, జ్ఞాన స్వరూపం పరమేశ్వరుడు.

అందుకే లౌకిక పురోగతికి విష్ణు రూపాన్ని,

ఆధ్యాత్మిక పురోగతికి శివ స్వరూపాన్ని ఆరాధన చేయాలని పురాణాలు చెబుతున్నాయి.


💥వేదం శివుడిని సకల దుఃఖ హరుడైన రుద్రుడిగా చెబుతోంది.

శత్రుబాధ, పిశాచపీడ, దుఃఖము పోవడానికి...

"ఓం నమో భగవతే రుద్రాయ" అనే మంత్రాన్ని,

విషపూరిత జీవుల నుండి రక్షణకై...

"ఓం నమో భగవతే నీలకంఠాయ" అనే మంత్రాన్ని పఠించాలన్నది పురాణవచనం.

🔸🔹🔸🔹🔸🔹🔸🔹


💥॥ శ్రీ పరమేశ్వర స్తుతిః (వసిష్ఠ కృతమ్) ॥💥


లింగమూర్తిం శివం స్తుత్వా గాయత్ర్యా యోగమాప్తవాన్ |

నిర్వాణం పరమం బ్రహ్మ వసిష్ఠోన్యశ్చ శంకరాత్ || 1 ||


నమః కనకలింగాయ వేదలింగాయ వై నమః |

నమః పరమలింగాయ వ్యోమలింగాయ వై నమః || 2 ||


నమస్సహస్రలింగాయ వహ్నిలింగాయ వై నమః |

నమః పురాణలింగాయ శ్రుతిలింగాయ వై నమః || 3 ||


నమః పాతాళలింగాయ బ్రహ్మలింగాయ వై నమః |

నమో రహస్యలింగాయ సప్తద్వీపోర్ధ్వలింగినే || 4 ||


నమస్సర్వాత్మలింగాయ సర్వలోకాంగలింగినే |

నమస్త్వవ్యక్తలింగాయ బుద్ధిలింగాయ వై నమః || 5 ||


నమోహంకారలింగాయ భూతలింగాయ వై నమః |

నమ ఇంద్రియలింగాయ నమస్తన్మాత్రలింగినే || 6 ||


నమః పురుషలింగాయ భావలింగాయ వై నమః |

నమోరజోఽర్ధలింగాయ సత్త్వలింగాయ వై నమః || 7 ||


నమస్తే భవలింగాయ నమస్త్రైగుణ్యలింగినే |

నమో నాగతలింగాయ తేజోలింగాయ వై నమః || 8 ||


నమో వాయూర్ధ్వలింగాయ శ్రుతిలింగాయ వై నమః |

నమస్తే ధర్మలింగాయ సామలింగాయ వై నమః || 9 ||


నమో యజ్ఞాంగలింగాయ యజ్ఞలింగాయ వై నమః |

నమస్తే తత్త్వలింగాయ దేవానుగతలింగినే || 10 ||


దిశ నః పరమం యోగమపత్యం మత్సమం తథా |

బ్రహ్మ చైవాక్షయం దేవ శమం చైవ పరం విభో |

అక్షయత్వం చ వంశస్య ధర్మే చ మతిమక్షయామ్ || 11 ||


అగ్నిరువాచ –

వసిష్ఠేన స్తుతశ్శంభుస్తుష్టః శ్రీపర్వతే పురా |

వసిష్ఠాయ వరం దత్వా తత్రైవాంతరధీయత || 12 ||


ఇతి శ్రీమహాపురాణే ఆగ్నేయే అగ్నివసిష్ఠసంవాదే వసిష్ఠకృత పరమేశ్వరస్తుతిర్నామసప్తదశాధికద్విశతతమోధ్యాయః ||


సేకరణ... 💐🙏


⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



 

Comments

Popular posts from this blog

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

వైశాఖ అమావాస్య శని జయంతి.

💥సింహాచల చందనోత్సవం💥