💥కాశీలో మరణించిన వారికి ముక్తిని ప్రసాదిస్తానని తాను చేసిన ప్రతిజ్ఞని పరమేశ్వరుడు ఎలా నెరవేర్చుకుంటాడో శ్రీనాధకవిసార్వభౌముడు కాశీఖండం లో తెలియచేసిన పద్యం
⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏
విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ।
శరణం భవ భూతేశ కరుణాకర శంకర॥
హర శంభో మహాదేవ విశ్వేశామరవల్లభ।
శివ శంకర సర్వాత్మన్ నీలకంఠ నమోస్తుతే॥
💥మహాప్రళయ కాలంలో అవిముక్త నగరం,
ఆదిదంపతులకు ఆనందకాననం,
మర్త్యలోకంలో మహాశివుడు నివసించే మహాస్మశానం,
విశ్వేశ్వరలింగం జ్యోతిర్లింగంగా వెలసి,
స్వయంగా శివుడే నిర్మించాడని చెప్పే #వారణాసి.
💥కాశ్యాంతు మరణాన్ముక్తిః –
కాశీ పట్టణంలో మరణించడమే మోక్షదాయకం.
💥శివుడు ప్రళయకాలంలో తన త్రిశూలం మీద నిలబెట్టాడని చెప్పే నగరం కాశీ.
దీనికి బిందుమాధవ క్షేత్రం అనే పేరు కూడా ఉంది.
ఋగ్వేదంలో ఈ పట్టణాన్ని జ్యోతిస్థానం అని వర్ణించారు.
జ్యోతిర్లింగంగా, శక్తిపీఠంగా, ముక్తినగరంగా వినుతికెక్కిన కాశీ (వారణాశి) స్మరణ మాత్రం చేతనే సప్తజన్మల పాపాలనూ పోగొట్టగల మహిమ కలది.
💥వాసం చేతనే వాసనా బలాన్ని జయించగల శక్తిని ప్రసాదించే వారణాసి, సురనది అయిన గంగానదీ తీరాన ఉన్న పుణ్యనగరం.
🔸🔹🔸🔹🔸🔹🔸
💥కాశీలో మరణించిన వారికి ముక్తిని ప్రసాదిస్తానని తాను చేసిన ప్రతిజ్ఞని పరమేశ్వరుడు ఎలా నెరవేర్చుకుంటాడో శ్రీనాధకవిసార్వభౌముడు కాశీఖండం లో తెలియచేసిన పద్యం:👇
పాలిండ్లు కదలంగా పసిడి పైయెద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ,
ధుఃకారమొనరించు తొండంబు ముక్కున శిఖరారావము జిలుకు డుంఠి,
ప్రత్యక్షమైవచ్చి భాగీరధీ గంగ మృదుల హస్తంబు చాచి మేను నిమురు,
ప్రధమోత్తముండు భృంగి భయరక్షణార్ధంబు ఫాలాగ్రమున దీర్చు భసిత రేఖ,
దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్లి, పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ,
పంచజనులకు తారక బ్రహ్మవిద్య అభవుడుపదేశమొనరించు కాశి!
💥భావం:
ఊపిరి అందక మరణావస్థలో ఉన్న జీవుడు ప్రాణోత్క్ర్కమణం అవుతున్నవేళ...
చేతి గాజుల, కాలియందెల చప్పుడు వినిపిస్తుండగా పర్వత రాజపుత్రి అయిన పార్వతి దేవి వచ్చి
జీవుడి తలను తన ఒడిలో పెట్టుకుని తన పవిటతో గాలి వీచేసరికి జీవుడు స్వాంతన పొందుతాడు.
డుంఠి గణపతి వచ్చి ఎగ ఊపిరి తీస్తున్న జీవుడికి తన చల్లటి తొండంతో ముక్కు దగ్గర నిమురుతూ ఊపిరి అందిస్తాడు.
ఇక దేహం విడిచిపెట్టేస్తున్నాను అనే భయంతో వేడెక్కిపోయిన జీవుడి శరీరాన్ని తన చల్లటి చేతులతో గంగమ్మ నిమిరేసరికి హాయిని పొందుతాడు.
ప్రమధ గణములలో ఉత్తముడైన భృంగి జీవుడి నుదుటిపైన ఇక భయపడవద్దని విభూది పెడతాడు.
చక్కటి సువాసనలు వెదజల్లుతుండగా, గణ గణ గంటల ధ్వనులు వినిపిస్తుండగా, సాక్షాత్తూ కాశీ విశ్వనాధుడే వచ్చి జీవుడి పక్కన కూర్చుని, ముందుకి వంగి జీవుడి కుడి చెవిలో తారకాన్ని ఉపదేశించగా, జీవుడు తారక మంత్రాన్ని ఉచ్ఛరిస్తాడు.
మరణ సమయంలో తారకాన్ని పలికావు అన్న మిషతో ఆ జీవుడిని తనలో ఐక్యం చేసుకుంటాడు.
🍁🍁🍁🍁🍁
💥సాక్షాత్తూ రామకృష్ణ పరమహంస తన యోగ దృష్టితో దర్శించి చెప్పారు.. కాశీలో చనిపోతున్న
ప్రతీ జీవి కుడి చెవిలో ఆ విశ్వనాథుడు తారక మంత్రోపదేశం చేస్తున్నాడని...
మనకి అంత యోగ దృష్టి లేకపోయినా కాశీలో చనిపోయిన జీవులని గమనిస్తే తెలుస్తుంది..
వాటి కుడి చెవి పైకి పెట్టి వింటున్నట్టుగా ఉంటుంది.
అదే మనకి ప్రత్యక్ష నిదర్శనం.
💥ఇలా ఎన్నో ప్రాణులు ఈశ్వరునిలో కలిసిపోతున్న దివ్యక్షేత్రం.
సర్వ జగత్తు లయం అయిపోతున్నా, తాను మాత్రం నిత్యంగా ఉండిపోయే పరమ పావనమయిన భూమి కాశీ.
కాశీలో ప్రతీ జీవీ శివస్వరూపమే.
ప్రతీదీ శివమయమే..
సేకరణ.. "నా కాశీ యాత్రా విశేషాలు" సంకలనం నుండి💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment