💥శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి గురుగుహా అనే నామం యొక్క విశిష్ఠత ఏమిటి?

 ⚜️🕉️🚩ఓం వల్లీదేవసేనాసమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామినే నమః🌹🙏


మయూరాధిరూఢం మహావాక్యగూఢం –

మనోహారిదేహం మహచ్చిత్తగేహమ్ |

మహీదేవదేవం మహావేదభావం –

మహాదేవబాలం భజే లోకపాలమ్ ||


💥భావం:

నెమలిని అధిష్టించి యున్నవాడును,

వేదాంత మహా వాక్యములలో నిగూఢముగా ఉన్నవాడును,

మనోహరమైన దేహము గలవాడును,

మహాత్ముల చిత్తమునందు నివసించువాడును,

బ్రాహ్మణులకారాధ్యుడును,

వేదములచే ప్రతిపాద్యుడును,

మహాదేవుని నందనుడును,

లోకపాలకుడు అయిన సుబ్రహ్మణ్యేశ్వరుని సేవించుచున్నాను.

🍁🍁🍁🍁🍁


💥శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి గురుగుహా అనే నామం యొక్క విశిష్ఠత ఏమిటి?


"#గురుగుహా" అనేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఉన్న అనంత నామాలలో ఒకటి. 


గురుగుహా ఒక అర్ధం చెప్పాలంటే, మన హృదయ గుహలోనే ఉన్న గురు స్వరూపమైన సుబ్రహ్మణ్యుడు అని.

ఇక్కడ గుహా అంటే మన హృదయ గుహ – హృదయాంతరాళము అని అన్వయించుకోవచ్చు.


💥శాస్త్రీయ సంగీత త్రయములో ఒకరు, ప్రఖ్యాత వాగ్గేయకారుడు, సుబ్రహ్మణ్యానుగ్రహ పాత్రుడు అయిన శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ చేసిన కీర్తనలు అన్నీ

"గురుగుహా" అనే మకుటంతో ఉంటాయి. 


ముత్తుస్వామి దీక్షితార్ గారి జీవితంలో ఆయన గురువైన చిదంబరనాథ శాస్త్రి గారిని కాశీ పట్టణంలో విశ్వేశ్వరుని సన్నిధిలో ఐదు సంవత్సరాలు పాటు గురు సేవ చేస్తూ, అటు రోజూ విశ్వేశ్వరుని దర్శనం చేస్తూ గురువు వద్ద సంగీతం అభ్యసించారు


ఈయన గురుభక్తికి మెచ్చిన వారి గురువు గారు, ఒకనాడు గంగా నదిలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు, శిష్యుడైన ముత్తుస్వామి దీక్షితార్ గారిని పిలిచి, కళ్ళుమూసుకుని, నదిలో మునిగి, చేతికి తగిలిన వస్తువు తీసుకోమని చెప్తారు.


అప్పుడు దీక్షితార్ గారికి నదిలో ఒక అద్భుతమైన వీణ లభిస్తుంది.

గురు అనుగ్రహం కలగడం చేత గంగా నది ఆయనకి ఆ వీణ బహూకరించినది.

ముత్తుస్వామి దీక్షితార్ గారికి దొరికిన ఆ వీణ చాలా విలక్షణమైనది, అందులో యాళి పైకి ఉంటుంది.

ఇక అలాంటి వీణ మరెక్కడా లేదు.


ఇది జరిగిన తర్వాత ఆయన గురువు గారు శరీరం విడిచి, శివ సాయుజ్యం పొందుతారు.

ఆయన ముత్తుస్వామి దీక్షితార్ ని తిరుత్తణి వెళ్లమని ఆదేశిస్తారు.


అప్పుడు ముత్తుస్వామి దీక్షితార్ దక్షిణదేశం బయలుదేరి #తిరుత్తణి అనే ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రం చేరుకుంటారు.


తిరుత్తణి ఆలయ ప్రాంగణంలో కూర్చుని ఉండగా, అప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి వారే అక్కడికి వచ్చి -  


"ముత్తుస్వామి దీక్షితార్!! ముత్తుస్వామి దీక్షితార్!! ఏదీ నీ నోరు తెరు"అని ఆయన నోటిలో పటిక బెల్లం వేస్తారు.

ముత్తుస్వామి దీక్షితార్ గారు కళ్ళు తెరిచి చూసే సరికి అక్కడ ఆ వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చిన సుబ్రహ్మణ్యుడు కనబడడు.

అంతే అప్పుడు వెంటనే సుబ్రహ్మణ్యానుగ్రహంతో ఆయన నోటి నుండీ సుబ్రహ్మణ్యుడిపై అద్భుతమైన కీర్తనలు వచ్చాయి.


వాటినే #తిరుత్తణికీర్తనలు అంటారు.


ఇలా సుబ్రహ్మణ్య అనుగ్రహం ప్రత్యక్షంగా పొందినందుకు, ఆయన కీర్తనలన్నిటిలోనూ, ‘గురుగుహా’ అనే మకుటం వేసి కీర్తనలు చేశారు దీక్షితార్.


కాశీలో ఆయన చేసిన గురు శుశ్రూషకి మెచ్చిన సుబ్రహ్మణ్యుడు దీక్షితార్ కి అఖండమైన సంగీత పరిజ్ఞానాన్ని కటాక్షించాడు. 


💥గురు స్వరూపమైన సుబ్రహ్మణ్యుడు, సర్వ జీవుల హృదయములో కొలువై ఉన్న సుబ్రహ్మణ్యుడు,

ఆయనయే గురు స్వరూపం.


సుబ్రహ్మణ్యుడు గురువుగా కేవలం ముత్తుస్వామి దీక్షితార్ గారికే కాదు, సాక్షాత్తు శంకరుడికి కూడా గురువుగా ప్రణవార్ధం బోధించాడు.

అందుకే ఆయనని #స్వామినాథ అని కూడా అంటారు. 


💥సుబ్రహ్మణ్యుడు సంపూర్ణ గురు తత్త్వంతో కూడిన సర్వ జీవుల హృదయాలలో ఉన్నవాడు కనుక -  "గురుగుహ"

🔸🔹🔸🔹🔸🔹🔸


నమస్తే నమస్తే మహాశక్తిపాణే – నమస్తే నమస్తే

లసద్వజ్రపాణే ।

నమస్తే నమస్తే కటిన్యస్తపాణే – నమస్తే నమస్తే

సదాభీష్టపాణే ।

సేకరణ... శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర  వైభవం 💐🙏

                (Murugan Online Library)

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం