🌷🌷!!! గాయత్రి రక్ష సర్వ జగద్రక్ష !!!🌷🌷
⚜️🕉️🚩ఓం నమో గాయత్రీ దేవ్యై నమః🌹🙏
🌷🌷!!! గాయత్రి రక్ష సర్వ జగద్రక్ష !!!🌷🌷
💥గాయత్రీ మంత్రము💥
"ఓం, భూర్భువస్సువః, తత్ సవితుర్వరేణ్యం,
భర్గోదేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్"
ఈ మంత్రాన్ని ఏకధాటిగా చదవకుండా మంత్రాన్ని నాలుగు చోట్ల ఆపి చదవాలి. అది ఎలాగంటే...
ఓం
భూర్భువస్సువః
తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్య ధీమహి
ధియో యోనః ప్రచోదయాత్
ఇలా మంత్రం మద్యలో నాలుగు సార్లు ఆపి చదవాలి.
💥ఈ మంత్రములో "ఓం" అనేది “ప్రణవము”
“భూర్భువస్సువః” లోని భూ, భువః, సువః అనేవి “వ్యాహృతులు"...
వ్యాహృతులు అనేవి దివ్యశక్తిని కలిగిన పదాలు.
ఇవి మూడు లోకాలను సూచిస్తాయి.
"తత్” నుంచి మిగిలిన భాగాన్ని “సావిత్రి” అని అంటారు.
🔸🔹🔸🔹🔸🔹🔸
💥గాయత్రి మంత్రంలో 24 బీజాక్షరాలు ఉన్నాయి.
వాటిని ఆధారం చేసుకుని నిర్మితమైన కొన్ని గొప్ప ఆలయాలను ఒకసారి అవలోకించుకుందాం.
💥కంచి కామాక్షి మందిరం లో అమ్మవారు మూలవిరాట్టుగా కూర్చుని ఉన్న మంటపాన్ని గాయత్రి మంటపం అంటారు.
ఆ ప్రాకారంలో 24 స్తంభాలున్నాయి.
అవి 24 బీజాక్షరాలకు ప్రతీకలు.
💥కోణార్క్ లోని సూర్య దేవాలయ సముదాయం ఒక పెద్ద రధం మీద వున్నట్టు నిర్మించబడి వున్నది.
ఆ రధానికి గాయత్రీ మంత్రానికి ప్రతీకగా 24 చక్రాలు వున్నాయి.
💥పురాణ కధనం ప్రకారం 24 ఋషులు వారి మంత్రశక్తిని ఈ 24 బీజాక్షరాలలో నిక్షిప్తం చేసారు.
ధర్మచక్రం లో వున్న 24 చువ్వలు (spokes ) వాటికి ప్రతీకలు. దాన్నే మనం సమయచక్రం అని కూడా అంటున్నాము.
💥జైన సిద్ధాంతంలో 24 తీర్ధంకరులు –
💥24 కేశవ నామాలు...
💥24 తత్వాలు :
5 జ్ఞానేంద్రియాలు,
5 కర్మేంద్రియాలు, (5) పంచతన్మాత్రలు,
5 మహాద్భుతాలు,
బుద్ధి, ప్రకృతి, అహంకారం, మనస్సు.
💥ఛందస్సులలో ఒకానొక గొప్ప ఛందస్సు గాయత్రి పేరు మీద వున్నది.
భగవద్గీతలో శ్రీ కృష్ణుడు ఇలా చెబుతాడు:
"బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ చందసామాహం"
💥రామాయణం లో 24 సహస్ర శ్లోకాలు.
రామాయణం గాయత్రి మంత్రాన్నే ప్రతిపాదిస్తోంది. కావాలంటే మీరే ఒకసారి తరచి చూడండి.
1, 1001, 2001, 3001, 4001,..... 23001 శ్లోకాలను గనుక మీరు చూస్తె మీకు గాయత్రి మంత్రమే కనబడుతుంది.
దీన్ని #గాయత్రిరామాయణం అని కూడా అంటారు.
💥ఒక వీణలో 24 చిర్రలు వుంటాయి.
సంగీత శాస్త్రం తెలిసినవాళ్ళు దీన్నే గాయత్రి ఉపాసన అని అంటారు.
💥మన వెనుబాములో 24 మ్రుదులాస్తులు ( Cartilage )వుంటాయి.
వాటికి అధి దేవతలే గాయత్రి మంత్రాక్షరాలు.
💥న గాయత్రీ త్రాహ్య పరం మంత్రం .. నమాతా: పర దైవతం” అన్నారు పెద్దలు.
💥24 బీజాక్షరాలతో కూడిన గాయత్రీ మాతను ఒక్కసారి జపిస్తే చాలు, సర్వ పాపాలు హరిస్తాయంటారు.
సకల దోషాలు తొలగి పోతాయంటారు.
💥సకల దేవతా స్వరూపం గాయత్రీ.
రామాయణ సారం గాయత్రీ.
కోర్కెలు తీర్చే మంత్ర రాజం గాయత్రీ.
విశ్వశాంతికి పరిష్కారం గాయత్రీ.
సకల కోర్కెలు ఈడేర్చే మహా మంత్రం గాయత్రీ.
24 బీజాక్షర సంపుటి గాయత్రీ.
💥అలాంటి గాయత్రి మాతను స్మరణం చేసుకోవడం అంటే నిజంగా పూర్వ జన్మ సుకృతమే అని చెప్పాలి.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment