💥పిలిచే భక్తునికి – పలికే దైవం కాణిపాకం వినాయకుడు.
⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏 💥పిలిచే భక్తునికి – పలికే దైవం కాణిపాకం వినాయకుడు. 'వినాయకుడు’ అనే పదానికి నాయకుడు లేనివాడని అర్థం. వినాయకుడికి వేరే నాయకుడు లేడు. తనకు తానే నాయకుడు అందుకనే, పరమశివుడు ప్రమథ గణాలకు ఆధిపత్యాన్ని ఇచ్చి, వినాయకుని గణాధిపతిని చేశాడు. వినాయకుని వక్రతుండం నాదానికి మూలమైన ఓంకారాన్ని సూచిస్తుంది. అందుకే ప్రతి మంత్రానికి ముందు ఓంకారాన్ని చేర్చి చదువుతుంటారు. ఇంతటి శక్తిమంతుడైన వినాయకుడు వివిధ రూపాల్లో దర్శనమిస్తుంటాడు. వినాయకుని పూజించేవారు వారి అభీష్టాన్ని అనుసరించి అందుకు తగిన రూపంలోనున్న వినాయకుని పూజిస్తుంటారు. మనలను కార్యోన్ముఖులను చేసి తలపెట్టిన పనులను నిర్విఘ్నంగా పూర్తి చేయించి సంకల్ప సిద్ధిని ప్రసాదించే దైవం కాణిపాకం వరసిద్ధి వినాయకుడు. చిత్తూరుకు 12 కిలో మీటర్ల దూరంలో వున్న ‘కాణిపాకం’ క్షేత్రంలో వెలసిన వరసిద్ధి వినాయకుని లక్షలాదిమంది భక్తుల కోర్కెలు తీరుస్తున్నాడు. పిలిచే భక్తులకు పలికే దేవునిగా కొలువై వున్నాడు. 💥వరసిద్ధి వినాయకస్వామి చరిత్ర: కాణిపాకంలో వినాయకస్వామి పుట్టుకకు ఓ చరిత్ర వుంది. ఇక్కడ ఆలయం లేని సమయంలో మూగ, గుడ్డి, చెవిటి అం...