💥తిరుప్పావై ఆరవరోజు పాశురం
⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏
💥తిరుప్పావై ఆరవరోజు పాశురం
పుళ్ళుమ్ శిలుమ్బినకాణ్ పుళ్ళరైయన్ కోయిలిల్
వెళ్లై విళిశఙ్గిన్ పేరరవమ్ కేట్టి లైయో
పిళ్ళాయ్ ! ఎలున్దిరాయ్ పేయ్ ములైనఞ్దణ్డు
కళ్ళచ్చగడమ్ కలక్కళియక్కాలోచ్చి
వెళ్లత్తరవిల్ తుయి లమర్‌న్డ విత్తినై
ఉళ్ళత్తు క్కొణ్డు మునివర్ గుళమ్ యోగిగళుమ్
మెళ్ల వెళున్దు అరియెన్ఱ పేరరవమ్
ఉళ్ళమ్ వుగున్దు కుళిర్‌న్డేలో రెమ్బావాయ్
#భావం:
ఇచటి నుండి పది పాశురములతో పదిమంది గోపికలను లేపుట చెప్పబడును. ఇచట పదిమంది గోపికలనగా పది ఇంద్రియములు, పదిమంది ఆళ్వారులు. గురువాక్య పరంపర కూడా ఈ పది పాశురములచే బోధించబడును.
ఈ పాశురమున – భగవదనుభవము క్రొత్తయగుట వలన ఈ వైభవము తెలియని తానొక్కతే తన భవనములో పరుండి వెలికిరాని ఒక ముగ్ధను లేపుచున్నారు.
లేపుటకు తెల్లవారవలయును కదా! తెల్లవారుటకు గురుతులు చెప్పుచున్నారు.
"పక్షులు అరచుచున్నవి. దేవాలయమున శంఖము చేయు పెద్ద ధ్వని వినరాలేదా! ఓ పిల్లా ! లెమ్ము. పూతన చనుబాల విషమును ఆరగించి కపట శకటాసురుని కాలు చాచి సంహరించి పాలసముద్రముపై చల్లని తెల్లని మెత్తని శేషశయ్యపై పవళించియున్న జగత్కారణ భూతుడగు శ్రీమన్నారాయణుని తన హృదయమున నిలుపుకొని మెల్లగా లేచిన మునులు యోగులు ‘హరి హరి’ అను చేయు పెద్ద ధ్వని మా హృదయమున చొరబడి చల్లబరిచి మమ్ములను మేల్కొలిపినది. నీవు కూడా లేచి రమ్ము."
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️
Comments
Post a Comment