॥ శ్రీ సూర్య స్తోత్రం ॥
⚜️🕉️🚩 ఓం శ్రీ సూర్య నారాయణ స్వామినే నమః 🌹🙏
సూర్య భగవానుడిని ఆరాధిస్తూ పండితులు ప్రత్యేకంగా ఒక స్తోత్రాన్ని భావితరాలకు అందించారు.
ఆ స్తోత్రాన్ని చెప్తూ సూర్యదేవున్ని ఆరాధిస్తే.. పూజిస్తే వారిని అన్నీ శుభాలే జరుగుతాయి.
ఉదయాన్నే కొందరికి సూర్య నమస్కారం చేయడం అలవాటు. అలాంటి వారు సూర్యుడిని దర్శించి నమస్కరించే సమయంలో ఈ స్తోత్రాన్ని స్మరిస్తే సూర్యదేవుని ఆశిస్సులు మీకు ఎల్లవేళలా ఉంటాయి.
॥ శ్రీ సూర్య స్తోత్రం ॥
ధ్యానం:
ధ్యాయేత్సూర్యమనంతకోటికిరణం తేజోమయం భాస్కరం
భక్తానామభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్ |
ఆదిత్యం జగదీశమచ్యుతమజం త్రైలోక్యచూడామణిం
భక్తాభీష్టవరప్రదం దినమణిం మార్తాండమాద్యం శుభమ్ || ౧ ||
కాలాత్మా సర్వభూతాత్మా వేదాత్మా విశ్వతోముఖః |
జన్మమృత్యుజరావ్యాధిసంసారభయనాశనః || ౨ ||
బ్రహ్మస్వరూప ఉదయే మధ్యాహ్నే తు మహేశ్వరః |
అస్తకాలే స్వయం విష్ణుః త్రయీమూర్తిర్దివాకరః || ౩ ||
ఏకచక్రరథో యస్య దివ్యః కనకభూషితః |
సోఽయం భవతు నః ప్రీతః పద్మహస్తో దివాకరః || ౪ ||
పద్మహస్తః పరంజ్యోతిః పరేశాయ నమో నమః |
అండయోనిర్మహాసాక్షీ ఆదిత్యాయ నమో నమః || ౫ ||
కమలాసన దేవేశ భానుమూర్తే నమో నమః |
ధర్మమూర్తిర్దయామూర్తిస్తత్త్వమూర్తిర్నమో నమః || ౬ ||
సకలేశాయ సూర్యాయ క్షాంతేశాయ నమో నమః | [ఛాయేశాయ] క్షయాపస్మారగుల్మాదిదుర్ధోషవ్యాధినాశనమ్ || ౭ ||
సర్వజ్వరహరం చైవ కుక్షిరోగనివారణమ్ |
ఏతత్ స్తోత్రం శివ ప్రోక్తం సర్వసిద్ధికరం పరమ్ |
సర్వసంపత్కరం చైవ సర్వాభీష్టప్రదాయకమ్ || ౮ ||
ఇతి శ్రీసూర్యస్తోత్రమ్ |
పై సూర్యదేవుని స్తోత్రాన్ని చదవుతూ పూజించడం ద్వారా అనేక సమస్యలనుంచి బయటపడతారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు ఏవైనా ఉన్నా నయం అవుతాయి. జటిల సమస్యలు వెంటనే పరిష్కారమవుతాయి.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️
Comments
Post a Comment