💥తిరుప్పావై పదవరోజు పాశురం

 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏


💥తిరుప్పావై పదవరోజు పాశురం


నోత్తు చ్చువర్ క్కమ్ పుగుగిన్ఱ అమ్మనాయ్!

మాత్తముమ్ తారారో వాశల్ తిఱవాదార్

నాత్తత్తుళాయ్ ముడి నారాయణన్; - నమ్మాల్

పోత్తప్పఱై తరుమ్ పుణ్ణియనాల్! పణ్డోరునాళ్

కూత్తత్తిన్ వాయ్ వీళ్ న్ద కుమ్బకరణనుమ్

తోత్తు మునక్కే పెరున్దుయిల్ తాన్ తన్దానో?

ఆత్త అనన్దలుడైయాయ్! అరుజ్గలమే!

తేత్తమాయ్ వన్దు తిఱ వేలో రెమ్బావాయ్.


#భావం:

నోము నోచి శ్రీకృష్ణ సంశ్లేష సుఖానుభవమును పొందుచున్న ఓయమ్మా! తలుపును తెరువుము, తలుపును తెరువకపోయినను మానెగాని, నోటినైనను తెఱచి పలుకవచ్చునుకదా తల్లీ! (జ్ఞానుల దర్శనము కంటె వారి శ్రీ సూక్తులను వినటమే చాల ముఖ్యమని చెప్పుచున్నది ఆండాళ్ తల్లి). పరిమళాలను వెదజల్లే తులసి మాలలను కిరీటముగా ధరించిన శ్రీ నారాయణుడు మనచే స్తోత్రము చేయబడినవాడై సంతసించి మనకు వ్రతోపక రణాలను (పఱై) ఇచ్చును కద! పూర్వమొకనాడు ధర్మస్వరూపుడైన పరమాత్మ రామావతారుడై అవతరించి కుంభకర్ణుణ్ణి సంహరించాడు. ఆ కుంభకర్ణుడు తన పెనునిద్రను నీకేమైనా కానుకగా యిచ్చెనాయేమి? ఓ పెద్ద నిద్ర కలదానా! లేచిరమ్ము. నీవు మాకు శిరోభూషణమైన దానివి కద! తొట్రుపడక లేచి వచ్చి మా గోష్ఠిలో చేరి మా వ్రతాన్ని పూర్తి చేయాలి. కనుక నీ యోగ నిద్రను వీడి లేచి రావమ్మా! అని ఐదవ గోపికను మేల్కొలుపుచున్నారు.   


వేదములను అధ్యయనం చేయటానికి సమర్ధుడైన ఒక వేదాచార్యుడే లభించాలి. అట్లే శ్రీకృష్ణ సంశ్లేషమును పొందాలనుకుంటే దానికి సమర్ధులైన ఒక నాయకుడో, నాయకురాలో లభించి ఆ మార్గాన నడిపించవలెకదా! ఆ వూరి యంతటికిని కృష్ణ సంశ్లేషమున సమర్ధురాలైన ఒక గోప కన్యక, యీ గోపకన్యలందరును కృష్ణ సంశ్లేషమును పొందగోరి పడుచున్న శ్రమనంతయు శ్రీ కృష్ణుడే పడునట్లు చేయ సమర్ధురాలైనది, శ్రీకృష్ణునికి పొరిగింటనున్నదియై, నిరంతరము కృష్ణానుభవమునకు నోచుకొన్నదియై వున్నది. అట్టి ఆ గోపికను (యీ పదవ మాలికలో) లేపుచున్నారు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥ఏకవింశతి పత్రపూజ💥

💥ఆషాఢమాస విశిష్టత:

💥ఆషాఢ శుద్ధ పౌర్ణమి.. 'గురుపౌర్ణమి'.. 'వ్యాసపౌర్ణమి