💥తిరుప్పావై ఐదవరోజు పాశురం
⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏
💥తిరుప్పావై ఐదవరోజు పాశురం
మాయనై మన్ను వడమదురై మైన్దనై
త్తూయ పెరునీర్ యమునై త్తుఱైవనై
ఆయర్ కులత్తినిల్ తోన్ఱుమ్ మణివిళక్కై
త్తాయైక్కుడల్ విళక్కమ్ శెయ్ త తామోదరనై
తూయోమాయ్ వన్దు నామ్ తూమలర్ తూవిత్తొళుతు
వాయినాల్ పాడిమనత్తినాల్ శిన్ధిక్క
ప్పోయపిళైయుమ్ పుగుదరువా నిన్ఱనవుమ్
తీయినిల్ తూశాగుమ్ శెప్పేలో రెమ్బాబాయ్
#భావం:
మిక్కిలి ఆశ్చర్యకరమైన గుణములను, చేష్టలను కలవాడు శ్రీకృష్ణుడు. అతడు ఉత్తర మధురకు నిర్వాహకునిగ జన్మించాడు. భాగత్సంబంధము ఎడతెగనట్టి మధురకు ప్రభువే. యమునా నదీతీరమందున్న గొల్ల కులమున జన్మించి, ఆ గొల్లకులాన్ని ప్రకాశింపజేసినవాడు. గొల్లకుల మాణిక్య దీపము తల్లి యశోదా గర్భమును కాంతివంతమొనర్చిన దామోదారుడు. వ్రతకారణముగా శ్రీకృష్ణుని చేరి, మనము ఇతరములైన కోరికలేవీ కోరక, పవిత్రమైన మనస్సులతో స్వామికి పూలనర్పించి, నమస్కరించి, నోరార అతని కల్యాణ గుణములను సంకీర్తన చేసి, ధ్యానించిన - సంచిత పాపములను, ఇక ఆగామి పాపములను తప్పించుకొనవచ్చును. అతని గుణకీర్తనం చేయటం వలన పాపములన్ని అగ్నిలో పడిన దూదివలె భస్మమై పోయేవే! కావున స్వామియొక్క తిరునామములను అనుసందించుడు.
కర్మసందోహము మోక్షప్రాప్తికి ప్రతిబంధకము కద! అనేక జన్మలను పొందుటకీ కర్మలే కారణాలు. కావున వీనిని నిర్మూలించక తప్పదు. అది ఎట్లన భగవద్ధ్యానము, భగవత్సేవ, భగవస్సంకీర్తనములే కర్మను పోగొట్టుకొనుటకు సులభతరమార్గములని గోదాదేవి సూచించుచున్నది.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️
Comments
Post a Comment