💥తిరుప్పావై రెండవరోజు పాశురం
⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏
💥తిరుప్పావై రెండవరోజు పాశురం
వైయత్తు వాళ్’వీర్‍గాళ్ నాముం నం పావైక్కు,
శెయ్యుం కిరిశైగళ్ కేళీరో, పాఱ్కడలుళ్
పైయ త్తుయిన్ఱ పరమ నడిపాడి,
నెయ్యుణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి,
మైయిట్టెళు’తోం మలరిట్టు నాం ముడియోం,
శెయ్యాదన శెయ్యోం తీక్కుఱళై చెన్ఱోదోం,
ఐయముం పిచ్చైయుమాందనైయుం కైకాట్టి,
ఉయ్యుమాఱెణ్ణి ఉగందేలోరెంబావాయ్ ॥ 2 ॥
భావము:
భూలోకంలోని గోకులంలో పుట్టిన భాగ్యవతులారా! మనం చేయబోయే వ్రతానికి ముఖ్యంగా ఆచరించ వలసిన కృత్యముల వినుడు. శ్రీమన్నారాయణుని పాదారవిందాలకు కీర్తిస్తాము. అతనితో కల్గిన విశ్లేష సమయాన ఇతరములైన ఎట్టి భోగ్య విషయాలను తలచము. పాలను త్రాగము. కన్నుల కాటుక నుంచము. నేతిని భుజింపము. సిగలో పూలను దాల్చము. అనగా శాస్త్ర విరుద్దములైన ఎట్టి పనులను చేయము. ఒకరిపై చాడీలను చెప్పము. సత్పాత్రదానము చేతము. సన్యాసులకును, బ్రహ్మచారులకును సత్పత్రదానము చేతుము. ఇంకను ఉజ్జీవించు మార్గములేవైన యున్న వాని నెరిగి సంతోషముతో నాచరింతుము. ఇట్లు యీ ధనుర్మాస కాలమంతయు కొనసాగింతుము. ఇదియే మన వ్రతము.
ఈ మాలికలో గోదాదేవి వ్రతమును చేయటానికి కొన్ని నియమాలను వివరిస్తోంది. శ్రీ కృష్ణునికి అంకితం కావటమే ముఖ్యమైన నియమం. భక్తి లేనిదే వ్రతం చేసినా ఫలం దక్కదు. శ్రీకృష్ణునికి అంకితం కావటం ఆయన అనుగ్రహం మాత్రమే కోరటం, ఇవే ముఖ్యం. ప్రత్యేకమైన విధులూ, నియమాలూ అంటూ ఏమీలేవు. శ్రీ కృష్ణుని యందు ప్రీతితో యేది చేస్తే అవే నియమాలు అంటుంది గోదా.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️
Comments
Post a Comment