💥తిరుప్పావై నాల్గవరోజు పాశురం
⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏
💥తిరుప్పావై నాల్గవరోజు పాశురం
ఆళి’మళై’ క్కణ్ణా ఒనృ నీ కైకరవేల్,
ఆళి’యుళ్ పుక్కు ముగందు కొడార్తేఱి,
ఊళి’ ముదల్వనురువంబోల్ మెయ్ కఋత్తు,
పాళి’యందోళుడై ప్పఱ్బనాబన్ కైయిల్,
ఆళి’పోల్ మిన్ని వలంబురిపోల్ నిన్ఱతిర్‍ందు,
తాళా’దే శార్‍ంగముదైత్త శరమళై’ పోల్,
వాళ’ వులకినిల్ పెయ్‍దిడాయ్, నాంగళుం
మార్కళి’ నీరాడ మగిళ్’ందేలోరెంబావాయ్ ॥ 4 ॥
భావము:
ఓ పర్జన్య దైవమా! వర్షమును కురిపించుటలో లోభత్వమును జూపకుము. నీవు సముద్రములోని నీటి నంతను కడుపు నిండుగ త్రాగుము, అటుపిదప నీవు పైకెగసి, సృష్టికంతకును కారణభూతుడైన ఆ శ్రీమన్నారాయణుని శరీరపు రంగు వలె నీ శరీరమునకును ఆ నలుపురంగు నద్దుకొనుము. స్వామి కుడి చేతియందున్న సుదర్శన చక్రము వలె మెరయుము. ఎడమ చేతిలోని పాంచజన్య శంఖమువలె గంభీరముగా గర్జించుము. స్వామి సారంగమను ధనుస్సు నుండి వెడలే అవిరళ శరాలుగ వర్షధారలను కురిపించుము. మేమందరము యీ వర్ష ధారలలో స్నానమాడెదము. లోకము సుఖించునట్లు వర్షించుము. మా వ్రతమును నిరాటంకముగ జేసికొనుటకై యిక ఏ మాత్రమూ ఆలసింపక వెంటనే వర్షింపుము స్వామీ!
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️
Comments
Post a Comment