💥తిరుప్పావై 9వరోజు పాశురం

 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏


💥తిరుప్పావై 9వరోజు పాశురం


తూమణి మాడత్తు చ్చుత్తుం విళక్కెరియత్

దూపం కమళత్తుయిల్ అణైమేల్ కణ్ వళరుం

మామాన్ మగళే! మణి క్కదవం తాళ్ తిఱవాయ్

మామీర్! అవళై ఎళుప్పీరో ఉన్ మగళ్ తాన్

ఊమైయో అన్ఱి చ్చెవిడో అనందలో

ఏమ ప్పెరుందుయిల్ మందిర ప్పట్టాళో

మామాయన్ మదవన్ వైకుందన్ ఎన్ఱెన్ఱు

నామం పలవుం నవిన్ఱేలోర్ ఎంబావాయ్


#భావము:

పరిశుద్ధమైన, నవవిధ మణులతో నిర్మింపబడిన మేడలో, చుట్టునూ దీపములు వెలుగుచుండగా, అగరు దూపము మఘుమలాడుచుండగా సుఖశయ్యపై నిద్రించుచున్న ఓ అత్తకూతురా! మణి  కవాటపు తీయవమ్మా! ఓ అత్తా! నీవైననూ ఆమెను లేపవమ్మా! నీ కుమార్తె మూగదో, చెవిటిదో, లేక మానసిక జాడ్యము కలిగినదా? లేక ఎవరైనను కదలకుండా కావలి ఉన్నారా? లేక గాఢ నిదుర పట్టునట్లు మంత్రం వేశారా? ‘ మహా మాయావీ! మాధవా! వైకుంఠవాసా!’ అని అనేక నామములతో కీర్తించి నీకుమార్తెను మేలుకొల్పుము.


తూరుపు తెలవారె! ఓ జవ్వనీ లేవవే!' అంటూ పాడి 8వ (పాశురం) మాలికలో భగవదనుభవాన్ని పొందటానికి కుతూహలపడుతున్న ఒక గోపికను లేపి తన వ్రతంలో భాగస్వామిని చేసింది గోదాతల్లి.


ఇప్పటి వరకు శ్రవణం (వినటం) మననం (విన్నదానిని మాటిమాటికి స్మరించటం) వీటియొక్క విశిష్ఠతను తెలిపి ముగ్గురు గోపకన్యలను గోదా మేల్కొలిపి తన వ్రతంలో చేర్చుకొంది.


ఇక 9మొదలు 12 మాలికలలో (పాశురాలలో) ధ్యానం యొక్క విశిష్ఠతను తెలుపబోతోంది. ఎల్లప్పుడూ శ్రవణము, మననమూ చేసే వారియొక్క మనస్సు పవిత్రమౌతుంది. నిర్మలమౌతుంది. మాలిన్యం తొలగితేనే కద జ్ఞానం చోటు చేసుకొనేది. అప్పుడా జ్ఞానమే ఆ జీవికి కవచమైపోతుంది. నిస్వార్ధమైన వ్రాత నిష్ఠ కలిగినవారికే తన్ను లభించే హక్కు కలదన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. మరిక మనకు స్వాతంత్ర్యం ఎందుకు? పరమాత్మ తానే స్వయంగా మన వద్దకు వచ్చి మన అభీష్టాలను తీరుస్తాడు. కావున మనం ఎచటికినీ పోక వున్నచోటునే భగవదనుభవ ఆనందాన్ని అనుభవిస్తూ వుంటే చాలుననుకొని అతి సుందరమైన మణిమయ భవనంలో నిద్రిస్తూన్న నాల్గవ గోపికను (యీ మాలికలో) లేపుచున్నారు. 'ఓ మామకూతురా! మరదలా లేలెమ్ము!' అంటున్నారు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥ఏకవింశతి పత్రపూజ💥

💥ఆషాఢమాస విశిష్టత:

💥ఆషాఢ శుద్ధ పౌర్ణమి.. 'గురుపౌర్ణమి'.. 'వ్యాసపౌర్ణమి