💥 తిరుప్పావై 8వరోజు పాశురం
⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏
💥 తిరుప్పావై 8వరోజు పాశురం
కీళ్’వానం వెళ్ళెనృ ఎరుమై శిఋవీడు,
మేయ్‍వాన్ పరందన కాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుం,
పోవాన్ పోగిన్ఱారై ప్పోగామల్ కాత్తు,
ఉన్నైక్కూవువాన్ వందు నిన్ఱోం, కోదుగలముడైయ
పావాయ్ ఎళు’ందిరాయ్ పాడిప్పఱై కొండు,
మావాయ్ పిళందానై మల్లరై మాట్టియ,
దేవాదిదేవనై శెనృ నాం శేవిత్తాల్,
ఆవావెన్ఱారాయ్‍ందరుళేలోరెంబావాయ్ ॥ 8 ॥
#భావము:
"తూర్పు దిక్కు తెల్లవారుచున్నది. చిన్నబీడు మేయుటకు విడువబడిన గేదెలు విచ్చలవిడిగా పోవుచున్నవి. మిగిలిన గోపికలందరు వ్రతస్థలమునకు బయలుదేరగా వారిని ఆపి నిన్ను పిలుచుటకు నీ వాకిట వచ్చి నిలిచినాము. కుతూహలము కలదానా? లేచి రమ్ము! కృష్ణ భగవానుని గుణములను కీర్తించి వ్రతమును మొదలిగి వ్రతసాధనమును పొంది, కేశిని చంపిన వానిని, చాణూరముష్టికులను వధించిన వానిని, దేవాది దేవుని, సేవించినచో అయ్యో! అయ్యో! మీరే వచ్చితిరే అని బాధపడి మన మంచి చెడ్డలను విచారించి కటాక్షించును”
తూర్పు దిక్కున తెల్లవారుటయనగా మన మనసున సత్త్వగుణముదయించి రాజస తామస భావముల తగ్గుటయే. కాని పూర్తిగా తొలగుట కాదు. ఇట్లు తగ్గుటయే చిన్న బీడు లోనికి గేదెలు పోవుట. ఇది కేవలము చిత్త ప్రసాదమే.
పరమాత్మను ప్రేమించువారిని ముందు నిడుకొని వెళ్లవలయునుని నీ వాకిలి వద్ద నిలిచితిమి. ఇదియే మాకు పరమ ప్రయోజనము. ఆచార్య గృహద్వారమున నిలువ గలుగుటయే శిష్యునకు ముఖ్య ప్రయోజనము, అశ్వము అహంకారము. చాణూర ముష్టికలు కామక్రోధములు. అహంకారమును, కామక్రోధములను ఆచార్య కాటాక్షముచే పరమాత్మ తొలగించును.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️
Comments
Post a Comment