💥తిరుప్పావై.. మొదటిరోజుపాశురం💥

 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏


💥తిరుప్పావై.. పన్నిద్దరాళ్వారులలో ఒకరైన గోదాదేవి రచించిన ముప్పది పాశురాల ప్రబంధం. వైష్ణవులు పరమ పవిత్రంగా పఠించే ఈ పాశురాలు మధుర భక్తిని ప్రబోధిస్తాయి.


మార్గశిర మాసంలో గోదాదేవి తన ఈడు ఆడపిల్లలతో కోవెలకు వచ్చి నెలరోజుల పాటు గానం చేసిన ముప్పది గీతాలే (పాశురాలే) ఈ తిరుప్పావై.


తిరు అనేది మంగళ వాచకం. శ్రీకరం, శుభప్రదం, పవిత్రం మొదలైన అర్థాలు ఉన్నాయి. పావై అంటే వ్రతం. ఈ వ్రతాన్ని వైష్ణవులు మార్గశీర్ష వ్రతమనీ, ధనుర్మాస వ్రతమనీ అంటారు.


💥తిరుప్పావై.. మొదటిరోజుపాశురం💥


మార్గళి’త్ తింగళ్ మదినిఱైంద నన్నాళాల్ ,

నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళై’యీర్ ,

శీర్ మల్‍గుమాయ్‍పాడి శెల్వచ్చిఋమీర్గాళ్ ,

కూర్ వేల్ కొడుందొళి’లన్ నందగోపన్ కుమరన్ ,

ఏరార్‍ంద కణ్ణి యశోదై యిళం శింగం ,

కార్‍మేని చ్చెంగణ్ కదిర్ మతియంబోల్ ముగత్తాన్,

నారాయణనే నమక్కే పఱై తరువాన్ ,

పారోర్ పుగళ’ ప్పడిందేలోరెంబావాయ్ ॥ 1 ॥


భావము:

సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికలారా.. మార్గశీర్ష మాసం ఎంతో మంచిది. వెన్నెలలు కురిపిస్తుంది. చాలా మంచి రోజులివి. శూరుడైన నందగోపుని కుమారుడును, విశాల నేత్రియగు యశోదకు బాల సింహము వంటి వాడును, నల్లని మేఘము వంటి శరీరమును, చంద్రునివలె ఆహ్లాదకరుడును, సూర్యునివలె తేజోమయుడును యైన నారాయణునే తప్ప, యితరములను కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కాలవసినవిచ్చుటకు సిద్ధపడినాడు. కావున మీరందరూ యీ వ్రతములో ప్రవేశించి లోకము ప్రకాశించునట్లుగ దాని కంగమైన మార్గళి స్నానము చేయు కోరికగల వారందరును ఆలసింపక శీఘ్రముగ రండని శ్రీ గోదాదేవి గొల్ల కన్నియలందరను ఆహ్వానించుచున్నది.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥ఏకవింశతి పత్రపూజ💥

💥ఆషాఢమాస విశిష్టత:

💥ఆషాఢ శుద్ధ పౌర్ణమి.. 'గురుపౌర్ణమి'.. 'వ్యాసపౌర్ణమి