దీపకదళియారు" అనే ఒక శివ భక్తుడు కథ (బసవపురాణం)
⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 💥🌷💥🌷💥🌷💥🌷💥 🍁నిస్వార్థంగా భగవంతుడిని సేవించిన వారికి దక్కని వరాలు ఉండవు. "భక్తి" అనేక విధాలని పురాణ కధలు చదువుతూంటే తెలుస్తుంది. కొందరయితే తమ తనువూ, మనస్సూ తాము నమ్మిన దైవానికే సమర్పించి తమ ధ్యాస కూడా లేకుండా ఆ భగవంతుణ్ణి కొలిచి పునీతులవుతారు. దైవం గురించి తప్ప తన గురించి ఆలోచించని ఒక అమాయక భక్తుడు పేరు దీపకదళియారు బసవపురాణం లోని ఆయన కధ చెప్పుకుందాము. ⚜️🍁⚜️🍁⚜️🍁⚜️🍁 కంబ అనే పట్టణంలో "దీపకదళియారు" అనే ఒక శివ భక్తుడు వుండేవాడు. అతడొకసారి వేరే పనిమీద ఇంకొక గ్రామానికి వెళ్ళాల్సి వచ్చింది. దోవ మధ్యలో ఒక అడవి, దానిలో ఒక పాడుబడ్డ శివాలయాన్ని చూశాడు. అది చూసి ఆయన ఆలోచనలు పరిపరి విధాల పోయాయి. "ఇదేమి వింత! శివుడీ అరణ్యం మధ్యలో వున్నాడు. శత్రువుల వల్ల ఇతనికేమి అపాయం వస్తుందో!? అసలే ఎప్పుడూ త్రిపురాసురులు వగైరా పెద్ద పెద్ద రాక్షసులతోనే శత్రుత్వమేర్పరచుకొని వాళ్ళని చంపేస్తూ వుంటాడు. ఈయనకేమో దయాళువు అని పెద్ద పేరు. మరి ఇలాంటి రాక్షసులని చంపి వాళ్ళ వాళ్ళతో విరోధం తెచ్చుకోవటం ఎందుకు? రాక్షసులు బలవంతులు. వారితో విరోధము మంచిది కాదు. అట్టి విర...