"శ్రావణ బహుళ అష్టమి"... "కృష్ణ జన్మాష్టమి"

 🕉️⚜️🚩 కృష్ణం వందే జగద్గురుం 🌹🙏

💥🌷💥🌷💥🌷💥🌷💥


కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

నాసాగ్రే నవమౌక్తికం కర తలే వేణుం కరే కంకణమ్ !

సర్వాంగే హరి చందనం చ కలియన్ కంఠే చ ముక్తావళి !

గోప స్త్రీ పరివేష్టి తో వవిజయతే గోపాల చూడామణీః !!


🍁లలాటమున కస్తూరీ తిలకము దిద్దుకొన్న వాడును,

వక్షః స్థలమున కౌస్తుభ మణిని ధరించిన వాడును,

ముక్కునకు బులాకీగా మంచి ముత్యమును ధరించిన వాడును,

చేతులలో వేణువు గలవాడును,

చేతులకు కంకణములు ధరించిన వాడును,

దేహమందతటను హరిచందనము పూయబడిన వాడును,

కంఠమునందు ముత్యాలహారమును ధరించినవాడును,

గోపికా స్త్రీలతో పరివేష్టింపబడి యున్నవాడును,

అగు గోపాల చూడామణి అయిన "శ్రీకృష్ణుడు" విజయమును పొందు గాక !!

🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸


"శ్రావణ బహుళ అష్టమి"... "కృష్ణ జన్మాష్టమి"


దేవకీదేవికి అష్టమ గర్భంలో ప్రవేశించిన కథానాయకుడు శ్రీకృష్ణుడు.

జన్మిస్తూనే తన నిజరూప సందర్శన భాగ్యాన్ని జననీ జనకులకు కలిగించిన మధుమోహనుడు.

వారికి తన జన్మ కారణాన్నీ, వారి తక్షణ కర్తవ్యాన్నీ వివరించాడు.

నందుని ఇంట నడయాడాడు.

యదు కులాన్ని ఉద్దరించాడు.

బృదావనాన్ని ప్రేమతో నింపేశాడు.

రేపల్లె రాగం తాళం రాజీవం చేశాడు.

మరోవైపు దుష్టశిక్షణా శిష్టరక్షణా చేసి మానవజాతిని

ధర్మపథాన నడిచేలా చేశాడు.

మానవుడే మాధవుడిగా ఎదిగి పరిపూర్ణ వ్యక్తిత్వం అంటే ఇదీ అని రేపటి తరాలకు చాటిచెప్పాడు. 


ప్రేమతో పిలిచినా, భక్తితో ధ్యానించినా, వైరంతో

దూషించినా... ఇలా ఏ విధంగా తనను ఆశ్రయించినా

మోక్షమిచ్చే కరుణామయుడు కృష్ణస్వామి. 


జీవితంలో కష్టనష్టాలూ సుఖదుఃఖాలూ ఎత్తుపల్లాలూ ప్రతీదీ ఓ భాగమే అంటాడు.

వాటన్నింటిలో ఆనందాన్ని ఎలా వెతుక్కోవాలో తన

జీవన విధానంతో ఆచరించి చూపిన జ్ఞానస్వరూపుడు.

గోకులంలో లీలలు చూపినా, యుద్ధం వద్దని రాయబారం నడిపినా, కురుక్షేత్రంలో వివశుడైన అర్జునుడికి గీతోపదేశం చేసినా...

ప్రతిదీ మధుర ఘట్టమే.

రేపటి తరానికి ఒక వ్యక్తిత్వ పాఠమే. 


కృష్ణుడు అంటేనే అందరి హృదయాలను ఆకర్షించేవాడు అని అర్థం.

సమస్య తలెత్తినప్పుడు అదే నవ్వు..

గెలిచిన తర్వాత అదే చిరునవ్వు.

ఆ నవ్వే "కృష్ణతత్వం"

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు