వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనమ్‌ దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్‌

 ⚜️🕉️🚩 శ్రీ కృష్ణం వందే జగద్గురుం 🌹🙏


వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనమ్‌

దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్‌

💥🏵️💥🏵️💥🏵️💥🏵️


శ్రీకృష్ణుడు... ఆయన రూపం ఆనంద స్వరూపం.

మోహన రూపం. అది అతీంద్రియం.

అలాంటి స్వరూపాన్ని ఆరాధించే పర్వం శ్రీకృష్ణాష్టమి.


విశిష్టమైన మానవశక్తిగా.. శ్రీమన్నారాయణుడి ఎనిమిదవ అవతారంగా.. దేవకీ వసుదేవుల పుణ్యఫలంగా శ్రావణ బహుళ అష్టమి నాడు జన్మించిన శ్రీకృష్ణుడు పుట్టుకతోనే బందీ.

కానీ మానవాళికి భవసాగరం నుంచి బంధ విముక్తి కలిగించే ఆత్మజ్ఞానాన్ని అందించాడు.


విషపూరితమైన పూతన చనుబాలు గ్రోలిన శ్రీకృష్ణుడే.. పోతన ద్వారా భాగవతామృతాన్ని మనకు అందించాడు.


నంద గోవ్రజంలో ఉన్నప్పుడు శకటాసురుడు, తృణావర్తుడు, వత్సాసుర, బకాసురాది రాక్షసులను ఎదుర్కొన్న గోపాలుడు.. రాక్షస స్వభావాలను ఎలా జయించాలో మనకు నేర్పించాడు.


కాళీయ మర్దనం ద్వారా.. అహంకారంతో ప్రవర్తించేవారి మదం ఎలా అణచాలో తెలియజెప్పాడు.


దుష్టుడైన మేనమామ కంసుని వధించి.. దుర్మార్గపు బంధుత్వాన్ని, దుష్ట బంధాలను వదిలించుకోవాలని సూచించాడు.


అడుగడుగునా తనను నమ్మిన పాండవులను రక్షించి ‘నమ్మకం’ అనే విలువకు పట్టంగట్టాడు.


దుష్టులైన దుర్యోధనాదులను ఎదిరించి పశుబలంపై తిరగబడి ధర్మస్థాపన చేయాలని చెప్పాడు.


రక్తసంబంధ వ్యామోహంలో కొట్టుకుపోతున్న అర్జునుడికి తత్వబోధ చేసి గీతామృతాన్ని పంచాడు. 

అర్జునుడి మాధ్యమంగా లోకానికి గొప్ప తత్వధారను అందించాడు.


శ్రీకృష్ణుడు గురువు మాత్రమే కాదు.

గొప్ప రాజనీతిజ్ఞుడు, తత్త్వవేత్త, రక్షకుడు, శిక్షకుడు. 


ఇష్టమైనవారికి జగన్నాటక సూత్రధారి.

గిట్టనివారికి కపట నాటక సూత్రధారి.


ఒకసారి చూస్తే ఇంత ఆకతాయి ఇంకెక్కడా కనిపించడు అనిపిస్తుంది.

మరు నిమిషం లోనే మన సమస్యలన్నింటికీ పరిష్కారాన్ని తెలిపే గురువు ఆయనే అన్నట్టు కనిపిస్తుంది.


గోపబాలురతో ఆడిపాడినా.. గోవర్ధనగిరిని కొనగోటితో ఎత్తినా.. భారతాన్ని బాధ్యతగా నడిపించినా.. ఆయన ప్రతి అడుగూ మానవజీవితానికి మార్గనిర్దేశనం చేసేదే.

అందుకే కన్నయ్య పుట్టిన రోజంటే జగతికి పండగ రోజే.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

వైశాఖ అమావాస్య శని జయంతి.

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

🌺🏵️🌼పూలపండుగ.. బతుకమ్మ🌹🙏