లిం' అంటే మన చూపులకు కనిపించకుండా ఉన్నదానిని 'గం' (గమయతి) అంటే గుర్తు రూపంలో తెలియజేసేది.
⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏
🏵️🌼🏵️🌼🏵️🌼🏵️🌼🏵️
నమో గౌరీశాయ స్ఫటిక దవళాజ్గాయచ నమో,
నమో లోకేశాయ స్తుతవిబుధలోకాయ చ నమః |
నమః శ్రీ కంఠాయ క్షపితపురదైత్యాయ చ నమః
నమః పాలక్షాయ స్మరమదవినాశాయ చ నమః ||
🍁గౌరీశ్వరునికి నమస్కారం.
స్ఫటికంలా శుద్ధ ధవళకాంతులతో దీపించే లోకేశునికి,
దేవతా సమూహంచే స్తుతింపబడేవానికి, శ్రీ (విషం) కంఠంలో ధరించినవానికి,
త్రిపురాసురులను నిర్మూలనం చేసినవానికి,
పాలభాగాన నేత్రం గల జ్ఞానమూర్తికి,
మన్మథుని మదాన్ని వినాశనం చేసిన శివునికి నమస్మృతులు.
🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸
సర్వశక్తిమంతుడైన భగవంతుడు సర్వాంతర్యామి.
ఎవరు ఏ రూపంలో, ఏ ప్రకారంగా సేవిస్తారో, వారిని ఆ రూపంలో, ఆ ప్రకారంగా అనుగ్రహిస్తాడు.
భగవంతునికీ, భక్తునికీ మధ్య బంధాన్ని ఏర్పరచడానికి ఎవరి సాయమూ అవసరంలేదు.
ఆయనే సర్వవ్యాపి, తానే త్రిమూర్తుల రూపాలను ధరించి సృష్టి, స్థితి, లయలను చేస్తుంటాడు.
న - సమస్త లోకాలకు ఆదిదేవుడు
మ - పరమజ్ఞానం
శి - మంగళప్రదం
వా - వృషభ వాహనుడు
య - పరమానంద దాయకుడు
శివ అంటేనే ఆశుభాలను తొలగించేవాడని అర్థం. ఆశుభాలను మన దగ్గరకు రానీయకుండా తరిమివేసిన స్వామి, సమస్త శుభాలను మనకు అనుగ్రహిస్తున్నాడు.
అందుకే ఆయన శంకరుడు.
న ఏష భగవానీశః
సర్వతత్త్వాది రవ్యయః
సర్వతత్త్వ విధానజ్ఞః
🍁పురుషేశ్వరుడైన ఈశ్వర భగవానుడు, సర్వతత్త్వాలకు ప్రథముడు, అవ్యయుడు, సర్వతత్త్వ విధాజ్ఞుడు.
"శివం" అనే పదానికి మంగళం, శుభం, కళ్యాణం, భద్రం, శ్రేయస్సు అనే అర్థాలు ఉన్నాయి.
ఆయన మంగళప్రదాత, మంగళ స్వరూపుడు.
సకల లోకవాసులకు ఇహపర సుఖాలను ప్రసాదించే భక్త సులభుడు ఈశ్వరుడు.
తాను శ్మశానవాసిగా భిక్షాటన చేస్తూ తన భక్తులను సకల ఐశ్వర్యాలను అనుగ్రహించిన భక్త సులభుడు.
ఆచరత్వం, స్థాణురూపం, ఘనీభవించిన శక్తి, విలయ తాండవం, ఆనందతాండవం వంటి రూపాలలో ఆయన దర్శనమిస్తున్నాడు.
మనలో సర్వత్రా శివపరమాత్మ నెలకొని ఉన్నాడు.
ఆకాశలింగమిత్యుక్తం
పృథినీ తస్య పీఠికాం
ఆలయస్సర్వ దేవానాం
లయానాత్ లింగముచ్యతే
🍁ఆకాశమనే లింగానికి భూమి పీఠం.
సమస్త దేవతలు అందులో ఉన్నారు.
అంతా అందులోనే లయమవుతుంది.
ఇక్కడ 'లిం' అంటే మన చూపులకు కనిపించకుండా ఉన్నదానిని 'గం' (గమయతి) అంటే గుర్తు రూపంలో తెలియజేసేది.
అందుకే ఆ లింగంలో సమస్త దేవతలూ కొలువై ఉన్నారు.
సేకరణ... 💐🙏

Comments
Post a Comment