"శ్రీ జ్ఞానప్రసూనాంబికా స్తోత్రమ్"💥🙏
⚜️🕉️🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏
💥🔱💥🔱💥🔱💥🔱
🔱💥శ్రీ జ్ఞానప్రసూనాంబికా దేవి💥🔱
శ్రీ జ్ఞానప్రసూనాంబికా దేవి "శ్రీకాళహస్తీశ్వర స్వామి" యొక్క భార్య. ఆమె పార్వతీదేవి స్వరూపాలలో ఒకటి.
దక్ష యజ్ణ సమయంలో ద్రాక్షాయణి దేవి యాగాగ్ని యందు దగ్దమైన పిదప మరల హిమవంతుని పుత్రికగ "గౌరీ దేవి" గా జన్మించి, పరమశివుని కళ్యాణమాడ పూనెను.
అందులకు గాను పరమేశ్వరుడు ఈ యొక్క శక్తిని నీవు తిరిగి పరిపూర్ణముగా పొందిన గాని వివాహమాడుటకు వీలుపడదని చేప్పెను.
అందులకు పరమేశ్వరి తక్షణ కర్తవ్యము ఏమని పరమేశ్వరుని కోరగ అప్పుడు పరమేశ్వరుడు పరమేశ్వరికి (పంచాక్షరి) మంత్రోపదేశము ఉపదేశించెను.
తదుపరి పరమేశ్వరి తన స్వహస్తము తో శ్రీచక్ర స్థాపన కావించుకొని అనుష్టించి తన శక్తిని తాను తిరిగి పొంది పరమేశ్వరుని కళ్యాణముచేసుకొని శ్రీచక్ర బిందు స్థాపనమున నిలచి తాను సాధించిన జ్ఞాన శక్తిని సమస్త జీవరాసులకు పంచి పెడుతూ వున్నది.
ఆమె తన భక్తులకు పరమ జ్ఞానాన్నీ ప్రసాదిస్తుంది.
🔸🔹🔸🔹🔸🔹🔸🔹
💥"శ్రీ జ్ఞానప్రసూనాంబికా స్తోత్రమ్💥
మాణిక్యాంచితభూషణాం మణిరవాం మాహేంద్రనీలోజ్జ్వలాం
మందారద్రుమమాల్యభూషితకుచాం మత్తేభకుంభస్తనీమ్ |
మౌనిస్తోమనుతాం మరాళగమనాం మాధ్వీరసానందినీం
ధ్యాయే చేతసి కాళహస్తినిలయాం జ్ఞానప్రసూనాంబికామ్ || 1 ||
శ్యామాం రాజనిభాననాం రతిహితాం
రాజీవపత్రేక్షణాం
రాజత్కాంచనరత్నభూషణయుతాం
రాజ్యప్రదానేశ్వరీమ్ |
రక్షోగర్వనివారణాం త్రిజగతాం రక్షైకచింతామణిం
ధ్యాయే చేతసి కాళహస్తినిలయాం
జ్ఞానప్రసూనాంబికామ్ || 2 ||
కల్యాణీం కరికుంభభాసురకుచాం కామేశ్వరీం
కామినీం
కల్యాణాచలవాసినీం కలరవాం కందర్పవిద్యాకలామ్|
కంజాక్షీం కలబిందుకల్పలతికాం కామారిచిత్తప్రియాం
ధ్యాయే చేతసి కాళహస్తినిలయాం
జ్ఞానప్రసూనాంబికామ్ || 3 ||
భావాతీతమనఃప్రభావభరితాం బ్రహ్మాండభాండోదరీం
బాలాం బాలకురంగనేత్రయుగళాం
భానుప్రభాభాసితామ్ |
భాస్వతేత్రరుచాభిరామనిలయాం భవ్యాం భవానీం శివాం
ధ్యాయే చేతసి కాళహస్తినిలయాం
జ్ఞానప్రసూనాంబికామ్ || 4 ||
వీణాగానవినోదినీం విజయినీం వేతండకుంభస్తనీం
విద్వద్వందితపాదపద్మయుగళాం విద్యాప్రదాం
శాంకరీమ్ |
విద్వేషిణ్యభిరంజినీం స్తుతివిభాం వేదాంతవేద్యాం
శివాం
ధ్యాయే చేతసి కాళహస్తినిలయాం
జ్ఞానప్రసూనాంబికామ్ || 5 ||
నానాభూషితభూషణాదివిమలాం లావణ్యపాథోనిధిం
కాంచీచంచలఘంటికాకలరవాం కంజాతపత్రేక్షణామ్|
కర్పూరాగరుకుంకుమాంకితకుచాం
కైలాసనాథప్రియాం
ధ్యాయే చేతసి కాళహస్తినిలయాం
జ్ఞానప్రసూనాంబికామ్ || 6 ||
మంజీరాంచితపాదపద్మయుగళాం
మాణిక్యభూషాన్వితాం
మందారద్రుమమంజరీమధుఝరీమాధుర్యఖేలద్దిరామ్ |
మాతంగీం మధురాలసాం కరశుకాం
నీలాలకాలంకృతాం
ధ్యాయే చేతసి కాళహస్తినిలయాం
జ్ఞానప్రసూనాంబికామ్ || 7 ||
కర్ణాలంబితహేమకుండలయుగాం
కాదంబవేణీముమాం
అంభోజాసనవాసవాదివినుతామర్ధేందుభూషోజ్జ్వలామ్ |
కస్తూరీతిలకాభిరామనిటిలాం గానప్రియాం శ్యామలాం
ధ్యాయే చేతసి కాళహస్తినిలయాం
జ్ఞానప్రసూనాంబికామ్ || 8 ||
కౌమారీం నవపల్లవాంఘియుగళాం
కర్పూరభాసోజ్జ్వలాం
గంగావర్తసమాననాభికుహరాం
గాంగేయభూషాన్వితామ్ |
చంద్రార్కాసలకోటికోటిసదృశాం
చంద్రార్కబింబాననాం
ధ్యాయే చేతసి కాళహస్తినిలయాం
జ్ఞానప్రసూనాంబికామ్ || 9 ||
బాలాదిత్యనిభాననాం త్రినయనాం బాలేందునా
భూషితాం
నీలాకారసుకేశినీ విలసితాం నిత్యాన్నదానప్రదామ్ |
శంఖం చక్రవరాభయం చ దధతీం సారస్వతార్థప్రదాం
ధ్యాయే చేతసి కాళహస్తినిలయాం
జ్ఞానప్రసూనాంబికామ్ || 10 ||
ఇతి "శ్రీ జ్ఞానప్రసూనాంబికా స్తోత్రమ్"
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment